అనువాదలహరి

సానెట్ 33… షేక్స్పియర్

ఇది షేక్స్పియర్ 400 వర్థంతి సంవత్సరము

నేను చెప్పలేనన్ని అద్భుత సూర్యోదయాల్ని చూశాను

మహోన్నత గిరిశృంగాలని రాజమకుటాలుగా రూపిస్తూ,

చిలకపచ్చని మైదానాలని పసిడి కాంతులతో ముద్దాడుతూ,

కళతప్పిన సెలయేళ్ళకు మహత్తరమైన దివ్య రుచులద్దుతూ;

అంతలోనే నిరాధారమైన నీలిమేఘాలు కూడబలుక్కుని

రోదసి రారాజు దివ్యవదనానికి అడ్డుగా తెరకట్టి

ప్రపంచానికి అతని వదనాన్నీ, వెలుగులని దూరం చేస్తే

పడమటకి అవమానభారంతో తను ఒంటరిగా క్రుంగడమూ తెలుసు;

అయినప్పటికీ నా సూర్యుడు ఒక రోజు ఉదయాన్నే

తన పూర్వ దీధుతులతో నా నుదుటన మెరిసాడు;

ప్చ్! ఏం లాభం, అదొక్క ఘడియసేపే, దాపునే ఉన్న

ఒక మేఘపు తునక నాకు తనని దూరం చేసింది

అంత మాత్రాన నా ప్రేమ అతన్ని ఇసుమంతైనా ఉపేక్షించదు

దివిలోని సూర్యునితోపాటే, భువిలోని సూర్యులూ కళతప్పుదురుగాక!

.

షేక్స్పియర్

William Shakespeare

.

 

.Sonnet XXXIII

.

Full many a glorious morning have I seen
Flatter the mountain tops with sovereign eye,
Kissing with golden face the meadows green,
Gilding pale streams with heavenly alchemy;
Anon permit the basest clouds to ride
With ugly rack on his celestial face,
And from the forlorn world his visage hide,
Stealing unseen to west with this disgrace:
Even so my sun one early morn did shine,
With all triumphant splendour on my brow;
But out, alack, he was but one hour mine,
The region cloud hath mask’d him from me now.
   Yet him for this my love no whit disdaineth;
   Suns of the world may stain when heaven’s sun staineth.

.

Shakespeare

 

 

Poem Courtesy:

http://www.shakespeares-sonnets.com/sonnet/33

 

ఓ నా కవితా!… వాల్టర్ సావేజ్ లాండర్, ఇంగ్లీషు కవి

పద, ఆమె దగ్గరకు వెళ్ళు, బెదిరిపోకు

ఆమె అందాన్ని చూసి పురుషులు సంకోచించినట్టు;

నీ వైపు తీక్షణంగా చూడదులే,

నిన్ను చూసి ముఖం అటు తిప్పుకోదు కూడా.

ఆమె మనోఫలకం మీద నువ్వు నిలిచేలా

నీకు కొన్ని సొగసులు అద్దుతానులే,

ఒకటి రెండు లోపాలు కూడా కలగలిసిపోవచ్చు

వాటిని ఆమె నవ్వుకుంటూ క్షమించెస్తుంది.

.

వాల్టర్ సావేజ్ లాండర్

జనవరి 30, 1775 – 17 సెప్టెంబరు 1864

ఇంగ్లీషు కవి

Walter Savage Landor Image Courtesy: http://www.poetryfoundation.org/bio/walter-savage-landor
Walter Savage Landor
Image Courtesy: http://www.poetryfoundation.org/bio/walter-savage-landor

.

To His Verse

Away my verse; and never fear,

  As men before such beauty do;

On you she will not look severe,

  She will not turn her eyes from you.

Some happier graces could I lend

  That in her memory you should live,

Some little blemishes might blend,

  For it would please her to forgive.

.

Walter Savage Landor

(30 January 1775 – 17 September 1864)

English Poet

Poem Courtesy:

The Oxford Book of Victorian Verse.  1922.

Comp:   Arthur Quiller-Couch

http://www.bartleby.com/336/11.html

%d bloggers like this: