అనువాదలహరి

కాలానిది చక్రగతి… రాబర్ట్ సౌత్ వెల్… ఇంగ్లీషు కవి

ఒకసారి నరికినచెట్టు, కొన్నాళ్ళకి మళ్ళీ చిగురించవచ్చు
పూర్తిగా బోడులైన మొక్కలు మళ్ళీ పూలూ కాయలూ కాయవచ్చు
అలవిమాలిన కష్టాలుపడే అభాగ్యుడికిసైతం ఉపశమనం లభిసుంది
ఎండిపోయిన నేల సైతం వర్షపు చినుకును పీల్చుకోగలుగుతుంది
కాలం చక్రంలా దొర్లుతుంది, భాగ్యాభాగ్యాలు దారి మళ్ళుతుంటాయి:
కష్టం నుండి సుఖానికీ, సుఖం నుండి కష్టానికీ

అదృష్టాంబోనిధి నిరంతరం పోటులోనే ఉండదు
అది తన అలలను విలైనంత వెనక్కి తీసుకుంటుంటుంది;
అవి ముందుకీ వెనక్కి ఒక క్రమంలో వచ్చిపోతుంటాయి
ఆ మగ్గము ముతకబట్టనీ, నూరోనంబరూనీ ఒక్కలాగే నేస్తుంది
కడదాకా కొనసాగగల ఏ గొప్ప సుఖమూ ఉండదు
ఎప్పుడో ఒకప్పుడు ముగియని ఏ పెద్ద కష్టమూ ఉండదు.

ఎప్పుడూ శిశిరమూ ఉండదు, ఎప్పుడూ వసంతమూ ఉండదు
వేకువ ఎరుగని దీర్ఘనిశలూ, అస్తమించని పగళ్ళూ ఉండవు
తీవ్రశోకంలో ఉన్న పక్షికైనా తీయగాపాడే ఋతువొస్తుంది
భీకరమైన తుఫానైనా, ప్రశాంతతతో చెలిమి చెయ్యాల్సిందే
దేముడు ఒకదానివెంట ఒకటి కల్పించి మనిషిని రాటుదేలుస్తాడు
దానివల్ల ఎగరాలని ఆశించేమనిషి, పతనానికి భయపడతాడు.

అకస్మాత్తుగా పోగొట్టుకున్నది అంతే అకస్మాత్తుగా దొరకొచ్చు
చివికిపోయిన వలసైతం చిన్న చేపలని పట్టుకోగలుగుతుంది
అన్నీ నష్టపోయినవారూ, ఏదీ నష్టపోని వారూ ఎవరూ ఉండరు
కొందరికి అవసరమైనవన్నీ దొరకొచ్చు, ఎవరికీ కోరినవన్నీ దొరకవు
కష్టాలతో కలగలవని సుఖాలు ఏ మనిషికీ లభ్యం కావు
కనికిష్టంగా ఉన్నవారు కొందరయితే, అన్నీ ఉన్నవాడు ఏ ఒక్కడూ ఉండడు
.
రాబర్ట్ సౌత్ వెల్

1561 – 21 February 1595

ఇంగ్లీషు కవి

 

 

 

.

 

 

Times go by Turns

The loppèd tree in time may grow again,

Most naked plants renew both fruit and flower;

The sorest wight may find release of pain,

The driest soil suck in some moist’ning shower;

Times go by turns and chances change by course,

From foul to fair, from better hap to worse.

The sea of Fortune doth not ever flow,

She draws her favours to the lowest ebb;

Her tides hath equal times to come and go,

Her loom doth weave the fine and coarsest web;

No joy so great but runneth to an end,

No hap so hard but may in fine amend.

Not always fall of leaf nor ever spring,

No endless night yet not eternal day;

The saddest birds a season find to sing,

The roughest storm a calm may soon allay:

Thus with succeeding turns God tempereth all,

That man may hope to rise, yet fear to fall.

A chance may win that by mischance was lost;

The net that holds no great, takes little fish;

In some things all, in all things none are crost,

Few all they need, but none have all they wish;

Unmeddled joys here to no man befall:

Who least, hath some; who most, hath never all.

 .

(Notes:
Lopped: Cut off
Wight: human being
Unmeddled: unmixed.)

 .

Robert Southwell. (aka Saint Robert Southwell)

1561 – 21 February 1595

English Poet and Roman Catholic Priest of Jesuit Order

Poem Courtesy:

The Oxford Book of English Verse: 1250–1900.

Arthur Quiller-Couch, ed. 1919.

http://www.bartleby.com/101/108.html

 

 

%d bloggers like this: