అనువాదలహరి

మన జీవితం ఏమిటి? … సర్ వాల్టర్ రాలీ, ఇంగ్లీషు కవి

మన జీవితం ఏమిటి? కేవలం మన ఆవేశాల ప్రదర్శన

మరి సంతోషం సంగతి? ఆగి ఆగి వినిపించే సంగీతం

మన మాతృగర్భాలు “గ్రీన్ రూం”ల వంటివి

ఈ లఘు జీవిత హాస్యనాటికకి వేషధారణ చేసుకుందికి.

ఈ ప్రపంచం ఒక రంగస్థలం; విధి ప్రేక్షకుడు

కూచుని చూస్తూ ఎవడు తప్పు చేస్తున్నాడా అని గమనిస్తుంది;

మలమల మాడ్చే ఎండనుండి నీడనిచ్చే సమాధులు

నాటకం అయిపోయిన తర్వాత వాలిపోయే తెరల్లాటివి;

అలా ఈ గుర్రపు పందేల ఆట ఆడుతూ తాత్కాలికంగా విశ్రమిస్తాం,

చివరకి చనిపోవడం మాత్రం… సరదాగా చనిపోము.

.

సర్ వాల్టర్ రాలీ

1554 – 29 October 1618

ఇంగ్లీషు కవి

 

.

Sir Walter Raleigh

What Is Our Life

 .

What is our life? The play of passion.

Our mirth? The music of division:

Our mothers’ wombs the tiring-houses be,

Where we are dressed for life’s short comedy.

The earth the stage; Heaven the spectator is,

Who sits and views whosoe’er doth act amiss.

The graves which hide us from the scorching sun

Are like drawn curtains when the play is done.

Thus playing post we to our latest rest,

And then we die in earnest, not in jest..

.

Sir Walter Raleigh

 1554 – 29 October 1618

English Poet and soldier

Poem Courtesy:

English Poetry I: From Chaucer to Gray.

The Harvard Classics.  1909–14.

http://www.bartleby.com/40/50.html

 

 

%d bloggers like this: