ప్రతి రాత్రీ అవి బోధించేది… విలియం హాబింగ్టన్, ఇంగ్లీషు కవి అమూల్యమైన మణులు వేలాడుతున్న ఆ తేజోవంతమైన ఖగోళాన్ని రాత్రి దర్శించినపుడు, అది నాకు ఇథియోపియన్ పెళ్లికూతురులా కనిపిస్తుంది. నా మనసు రెక్కలు విప్పుకుని ఒక్కసారి ఆకాశంలోకి ఎగురుతుంది దిశాంతాలకు వ్యాపించిన రోదసి ఖండాల్లో సృష్టికర్త అద్భుత ఆవిష్కరణలు చూడ్డానికి. ఆంత ప్రకాశమానమైన ఆకాశమూ ఏ మంటలూ విరజిమ్మదు; నిశ్శబ్దంగానైనా, అతివిపులంగా భగవంతుని ఉనికిని ప్రదర్శిస్తుంది కనిపించే ఏ చిన్న నక్షత్రమూ మానవుని దృష్టికి దూరంగా కనిపించనంత చిన్నగా తన వెలుగులు ఉపసంహరించుకోదు. కానీ మనం ఓపికగా గమనించినట్టయితే మనం అర్థం చేసుకోగలము ఒక పవిత్రగ్రంధంలో చెప్పినంత సాధికారంగా మనిషి సృష్టిరహస్యాలు ఎలా తెలుసుకోవచ్చో. అంతులేని అధికారాన్ని హస్తగతం చేసుకున్న విజేతకి చెబుతుంది ఎన్నో ప్రమాదాలను గర్వంగా ఎదుర్కొని అతను చేసే సాహసం కేవలం క్షణికమని. సుదూర ఉత్తరాన్నుండి ఏదో ఒక దేశం, ఇంతవరకు కనుగొననిది, ఒకటి అతను కొత్తగా సాధించిన సామ్రాజ్యంపై దండెత్తవచ్చు, హిమనగాల మధ్య కప్పబడిన తెలియరాని ఏదేశమైనా విజృంభించవచ్చు అతను చేసిన పాపాన్ని ప్రక్షాళనం చెయ్యడానికి తిరిగి అవికూడా అతనంత ఘోరాలు చేసేదాకా. అప్పుడవి, పూర్వపువాటిలాగే, తమ అంతాన్ని చూస్తాయి మనలాగే మన సామ్రాజ్యాలూ కూలిపోతాయి ప్రతి రాజ్యానికీ ఒక చివరిరోజు ఉంటుంది. అవి మౌనంగా కనిపిస్తున్నప్పటికీ ఆ ఖగోళ కాంతులు మన ఆశలలోని వంచనలనీ అహంకారపు జీవితాలనీ ఖండిస్తాయి. ఎందుకంటే అవి సృష్టి ప్రారంభం అయినప్పటినుండీ చూస్తూనే ఉన్నాయి: పాపము శాపానికి దారితీస్తుందనీ ఈ భూమి మీద ఏదీశాశ్వతం కాదనీను. . విలియం హాబింగ్టన్ November 4, 1605 – November 30, 1654 ఇంగ్లీషు కవి . NOX NOCTI INDICAT SCIENTIAM . When I survey the bright Celestial sphere so rich with jewels hung; that night Doth like am Ethiop bride appear, My soul her wings doth spread And Heavenwards flies Th’ Almighty’s mysteries to read In the large volumes of the skies. For the bright firmament Shoots forth no flame So silent, but is eloquent In speaking the Creator’s name. No unregarded star Contracts its light, Into so small a character Removed far from our human sight, But, if we steadfast look, We shall discern, In it, as in some holy book, How man may heavenly knowledge learn. It tells the conqueror That far-stretched power, Which his proud dangers traffic for Is but the triumph of an hour; That from the farthest North Some nation may, Yet undiscovered, may issue forth, And o’ver his new-got conquest sway; Some nation yet shut in With hills of ice May be let out to scourge his sin, Till they shall equal him in vice. And then, they like wise shall Their ruin have; For as yourselves your empires fall And every kingdom hath a grave. Thus those Celestial fires, Though seeming mute, The fallacy of our desires And all the pride of life confute; For they have watched since first The world had birth, And found sin in itself accursed And nothing permanent on earth. . William Habington November 4, 1605 – November 30, 1654 Emglish Poet Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే జూన్ 15, 2015
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులు17th CenturyEnglish PoetWilliam Habington సానెట్ -30… షేక్స్పియర్మన జీవితం ఏమిటి? … సర్ వాల్టర్ రాలీ, ఇంగ్లీషు కవి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.