రోజు: జూన్ 15, 2015
-
ప్రతి రాత్రీ అవి బోధించేది… విలియం హాబింగ్టన్, ఇంగ్లీషు కవి
అమూల్యమైన మణులు వేలాడుతున్న ఆ తేజోవంతమైన ఖగోళాన్ని రాత్రి దర్శించినపుడు, అది నాకు ఇథియోపియన్ పెళ్లికూతురులా కనిపిస్తుంది. నా మనసు రెక్కలు విప్పుకుని ఒక్కసారి ఆకాశంలోకి ఎగురుతుంది దిశాంతాలకు వ్యాపించిన రోదసి ఖండాల్లో సృష్టికర్త అద్భుత ఆవిష్కరణలు చూడ్డానికి. ఆంత ప్రకాశమానమైన ఆకాశమూ ఏ మంటలూ విరజిమ్మదు; నిశ్శబ్దంగానైనా, అతివిపులంగా భగవంతుని ఉనికిని ప్రదర్శిస్తుంది కనిపించే ఏ చిన్న నక్షత్రమూ మానవుని దృష్టికి దూరంగా కనిపించనంత చిన్నగా తన వెలుగులు ఉపసంహరించుకోదు. కానీ మనం ఓపికగా గమనించినట్టయితే…