సానెట్ -30… షేక్స్పియర్

(This is Shakespeare’s 400th Death Anniversary Year)

నేను పదే పదే మౌనంగా మధురమైన ఊహలలోతేలుతూ

జరిగిపోయిన సంఘటనలు గుర్తుచేసుకుంటున్నప్పుడు

నేను కోరుకున్న చాలా వస్తుచులు దక్కనందుకు చింతిస్తాను

ఆ పాత బాధలతోపాటు, జీవితం వృధా అయ్యిందని కూడా.

మృత్యువు కౌగిలిలో తెలవారని రేయి గడుపుతున్న ఆప్తమిత్రులకు

ముందెన్నడూ లేనంతగా శోకిస్తూ కన్నీరు కారుస్తాను

ఎప్పుడో మరిచిపోయిన భగ్నప్రేమకై రోదిస్తూ

కనుమరుగైన ఎన్నో సుందరదృశ్యాలకై వగస్తాను.

ఒక బాధ తర్వాత మరొక బాధ వల్లెవేసుకుంటూ

నేను గడచిపోయిన బాధలకై దీర్ఘంగా రోదిస్తాను;

ఇంతకుముందు వగచిన బాధనే మళ్ళీ మళ్ళీ తలపోస్తూ,

ఇంతకుముందు బాధపడనట్టు కొత్తగా బాధపడతాను.

కానీ ప్రియమిత్రమా! నిన్ను ఒక్క సారి తలుచుకుంటే చాలు,

కోల్పోయినవన్నీ లభిస్తాయి; బాధలు పరిసమాప్తమౌతాయి.

.

షేక్స్పియర్

(26 April 1564 (baptised) – 23 April 1616)

English Poet 

.

Sonnet XXX

.

When to the sessions of sweet silent thought

I summon up remembrance of things past

I sigh the lack of many a thing I sought

And with old woes now wail my dear time’s waste:

Then can I drown an eye, unused to flow

For precious friends hid in death’s dateless night,

And weep afresh love’s long-since cancelled woe,

And moan the expense of many a vanished sight.

Then can I grieve at grievances foregone,

And heavily from woe to woe tell o’er

The sad account of fore-bemoaned moan,

Which I new pay as if not paid before.

But if a while I think on thee, dear friend,

All losses are restored, and sorrows end.

.

William Shakespeare

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: