ఒక ముసలి తల్లి బతుకుపాట… WB యేట్స్, ఐరిష్ కవి (విలియం బట్లర్ యేట్స్ 150 వ జన్మదిన సందర్భంగా) నేను పొద్దు పొడుస్తూనే లేస్తాను, మోకాళ్లమీద ఆనుకుని నిప్పురవ్వ నిలిచి బాగా వెలిగేదాకా పొయ్యి ఊదుతాను; తర్వాత ఇల్లు ఊడ్చి, అంట్లుతోమి,వంటవండుతాను చీకటిపడి చుక్కలు తొంగిచూసి మిణుకుమనేదాకా; పిల్లలు పొద్దెక్కేదాకా పడుక్కుని కలలు కంటుంటారు జుత్తుకీ, జాకెట్టుకీ ఏ రిబ్బన్లు జోడీ కుదురుతాయా అని, వాళ్ళకి రోజంతా పూచికపుల్ల పనిలేకుండా గడిచిపోతుంది జుత్తు గాలికి చెదిరితే చాలు, వాళ్ళు నిట్టూర్పులు విడుస్తారు నేను ముసలిదాన్ని కదా అని పని చేస్తూనే ఉండాలి ఒంట్లోని శక్తి సన్నగిలి వేడి తగ్గిపోతోంది. . విలియం బట్లర్ యేట్స్ 13 June 1865 – 28 January 1939 ఐరిష్ కవి (In Commemoration of 150 th Birthday of WB Yeats) The Song of the Old Mother , I rise in the dawn, and I kneel and blow Till the seed of the fire flicker and glow; And then I must scrub and bake and sweep Till stars are beginning to blink and peep; And the young lie long and dream in their bed Of the matching of ribbons for bosom and head, And their day goes over in idleness, And they sigh if the wind but lift a tress: While I must work because I am old, And the seed of the fire gets feeble and cold. . William Butler Yeats 13 June 1865 – 28 January 1939 Irish Poet Poem Courtesy: Anthology of Irish Verse. 1922. Padraic Colum (1881–1972). http://www.bartleby.com/250/2.html Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే జూన్ 13, 2015
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులు10th CenturyIrish PoetWB Yeats కాకతాళీయం… ఎఫ్. టి. కూపర్, అమెరికనుసానెట్ -30… షేక్స్పియర్ స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.