అనువాదలహరి

కాకతాళీయం… ఎఫ్. టి. కూపర్, అమెరికను

నానమ్మ పాత చేతికుర్చీలో కూచుని

నిర్లిప్తంగా సమయం తెలీకుండా అల్లుకుంటోంది;

శాంతంగా, అయినా గంభీరంగానే, ముగ్గుబుట్టతలతో

గతకాలపు బాదరబందీలు నెమరువేసుకుంటోంది.

మనవరాలు మోకాళ్ళమీద హాయిగా కూచుని

నానమ్మ ముణుకుమీద మోచేయి ఆనించి

ఏదో ముఖ్యమైన విషయాన్ని ఎలా చెప్పాలా అని

దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు ఇట్టే తెలిసిపోతోంది.

అల్లికసూదులు టకటకమని కదిలిపోతున్నాయి

నాజూకైన రెండు చేతులు కళ్ళని మూసీదాకా,

సిగ్గుపడుతూ, మురిపెంగా ఆ అమ్మాయి అడిగింది

“తాతయ్య పెళ్లిచేసుకోమని నిన్నెలా అడిగేరో చెప్పవా?” అని.

ఒక్కసారి అల్లుతున్నదీ, గిరగిర తిరిగే ఊలుఉండా జారిపోయేయి,

చిరునవ్వూ, కన్నీటి దొంతరల మధ్య నానమ్మ ఇలా అంది:

“పిచ్చితల్లీ, అదేంలేదు. తాతయ్య ఎప్పుడూ అడగలేదు. 

అలా అవుతుందని ఎందుకో మాకు ముందునించీ అనిపించింది.”

అందంగా సిగ్గుపడుతూ మనవరాలు,

నానమ్మ మోకాళ్ళమీంచి చూపు మరల్చకుండా,

“ఆలోచిస్తుంటే చాలా చిత్రంగా లేదూ, నానమ్మా?

ఈ విషయంలో జాక్ దీ, నాదీ కూడా అచ్చం మీ తీరే.”

 .

ఎఫ్. టి. కూపర్

అమెరికను 

.

A Coincidence

.

Grandmother sits in her old armchair, 

  Placidly knitting the hours away;      

Kindly, yet grave, with her silvered hair,      

  Tracing the cares of life’s yesterday. 

Granddaughter cozily kneels beside,   

  Resting an elbow on grandma’s knee,        

Pondering how she can best confide   

  Something momentous, ’tis plain to see.     

On goes the click of the ivory bones,  

  Till dainty fingers obstruct the view, 

And a shy voice asks in coaxing tones,         

  “Tell me how grandpa proposed to you.”   

Down drops the knitting and truant ball,       

  While grandma answers, ’twixt smile and tear,

“Grandfather never proposed at all;    

  Somehow we knew it without, my dear.”   

Granddaughter blushes a dainty pink, 

  Keeping her gaze fixed on grandma’s knee.         

“Isn’t it funny,” she says, “to think     

  It is just that way with Jack and me?”

.

(in “The Harvard Lampoon”)

F. T. Cooper

American

Poem Courtesy:

The World’s Wit and Humor:

An Encyclopedia in 15 Volumes.  1906.

Vols. I–V: American

http://www.bartleby.com/380/poem/306.html

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: