అనువాదలహరి

భవిష్య వాణి… వాల్టర్ వాన్ దెర్ వొగెల్వైడ్, జర్మను కవి

సందేహాలు చుట్టుముట్టి, సతమతమౌతూ,

నేను ఒక్కడినే చాలాసేపు ప్రశాంతంగా కూచుని ఆలోచించేను

ఆమె ఆలోచనలనుండి ఎలా విముక్తి పొందాలా అని

చివరికి ఒక ఆలోచన సాంత్వననిచ్చేదాకా.

నిజానికి దీన్ని పూర్తిగా సాంత్వన అని అనలేము,

చిన్నపిల్లలు కూడా దీనికి శాంతించరేమో, అంత చిన్నది;

అదేమిటో మీకు చెబితే, నన్ను మీరు వెక్కిరిస్తారు:

అయినా ఏ కారణం లేకుండా ఎవ్వరూ సుఖంగా ఉండలేరు కద!

ఇవాళ ఒక పూరిపుడక నాకు ఆనందాన్నిచ్చింది;

అలాంటి ఆనందాన్ని నేనింతవరకు ఎరగను

ఆటలో ఇవాళ నేనొక గడ్డిపుడకతో కొలిచేను,

చాలాసార్లు పిల్లలు ఇలా ఆడడం చూసేను

అయితే వినండి, ఆమె నా ప్రేమ అంగీకరిస్తుందో లేదో

“ఆమె ప్రేమిస్తుంది- లేదు-ప్రేమిస్తుంది!” అనుకుంటూ దాన్ని నాల్గువేళ్లతో కొలిచేను,

చివరకి ఎప్పుడూ “ఆమె ప్రేమిస్తుంది” తోనే ముగిసేది.

అందుకని ఆనందంగా ఉన్నాను; దేనికయినా, నమ్మకమే ప్రధానం.
.
వాల్టర్ వాన్ దెర్ వొగెల్వైడ్,

(1170–1228)

జర్మను కవి

.

The Oracle

.

Beset with doubts, in agony      

I sat quite long alone and thought       

How from her service I might be free,

Until a comfort gladness brought.       

This thing a comfort I can hardly call,

’Tis scarce a baby comfort—oh, so small!    

And if I tell you, you’ll be mocking me:       

Yet without cause no one can happy be.       

A little stalk has made me glad to-day;

It promised happiness I never knew:  

I measured with a stalk of straw in play,       

As I had often seen the children do.    

Now listen, if her heart my love has heeded:

“She loves—loves not—she loves!” Which way my hands would bend,        

“She loves me!” always was the end.  

So I am happy; only—faith is needed!

.

Walter von der Vogelweide

German Poet

(1170–1228)

A Harvest of German Verse.  1916.

Ed., trans: Margarete Münsterberg,

http://www.bartleby.com/177/5.html

%d bloggers like this: