అనువాదలహరి

నేలపుత్రుని సమాధి… జార్జి మౌంటెన్, కెనేడియన్

ఆకాశం ప్రకాశంగా ఉంది, సన్నని ఈ అఖాతం ప్రశాంతంగా ఉంది;
ఈ రక్షితప్రదేశం లో ఏ చప్పుడూ వినిపించడం లేదు,అప్పుడప్పుడు
దేవదారు వృక్షాలలో గాలి గుసగుసలు తప్ప… విశ్రాంతి ఎరుగని ఈ
మనిషిని చూడనూ లేదు, అతని పనితనం లేశమైనా ఎరుగను.
నే నలా పొదల్లో తిరుగుతూ దారితప్పి వచ్చేను ఈ చిన్ని చోటుకి,
ఎవరూ చూసిఉండని ఈ చోటుని చెల్లాచెదరైన గూటికొమ్మలు బహిర్గతం చేసేయి
ఇక అంతా విశ్రాంతే! అదిగో, అదే … ఈ నేలపుత్రుని సమాధి
ఆ గూటిపడవ విశ్రాంత మందిరంలో చూరుకింద అతని అస్థికలు.

అయ్యో అమాయకుడా! ఈ గూటి పడవలో భీకరమైన
మంచులో బతికేవా? దీనిలోనే నదులు దాటేవా? పట్టులేని గూడు,
దారుధ్యంలేని పడవ, బలహీనమైన మనిషి! అతని గురించి ఎవరికెరుక?
అతని మృతి, అతని ఏలిక చిత్తం తప్ప అతని అభీష్టం చెప్పదు.
ఓ వివేకులూ, సంపన్నులూ, అధికారులారా! మీ గతి ఏమిటి?
ఎవని వల్ల ఈ అన్యమతస్థుడు ఇలా గౌరవహీనంగా మరణించేడు?

 .

The Indian’s Grave

 

Bright are the heavens, the narrow bay serene;       

  No sound is heard within the shelter’d place,        

Save some sweet whisper of the pines—nor seen   

  Of restless man, nor of his works, a trace;  

  I stray, through bushes low, a little space;   

Unlook’d-for sight their parted leaves disclose:      

  Restless no more, lo! one of Indian race,    

His bones beneath that roof of bark repose.  

 

Poor savage! in such bark through deepening snows       

  Once didst thou dwell; in this through rivers move.        

Frail house, frail skiff, frail man! Of him who knows       

  His master’s will, not thine the doom shall prove.

What will be yours, ye powerful, wealthy, wise,    

By whom the heathen unregarded dies?

.

George Jehoshaphat Mountain

(27 July 1789 – 6 January 1863)

Canadian Anglican Bishop  and Founder of Bishop University 

The Oxford Book of Canadian Verse.  1913.

Comp.  William Wilfred Campbell

http://www.bartleby.com/335/1.html

%d bloggers like this: