మిగిలిపోయేవీ, తరిగిపోయేవీ … థామస్ హార్డీ, ఇంగ్లీషు కవి
తుంపరలమీద కదలాడే సూర్యుడి ఇంద్రధనుసులూ
పారుతున్న సెలయేటి మీది తళతళలూ
అందమైన ముఖాలూ, ప్రమాణాలూ, వెన్నెలరాత్రులూ…
ఇవన్నీ శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకుంటాం
కానీ, అవి తరిగిపోతాయి.
హేమంతపు మంచులా పరుచుకున్న శూన్య ఋతువులూ
నిశ్శబ్దంగా ఓడుతున్న కుళ్ళిన ప్రపంచపు రక్తస్రావమూ
వేలమంది దౌర్భాగ్యుల అవేదనపు కేకలూ —
ఇవి సమసిపోవాలని మనం కోరుకుంటాం,
కానీ, అవి మిగిలిపోతాయి.
.
థామస్ హార్డీ
2 June 1840 – 11 January 1928
ఇంగ్లీషు కవి
