పిల్లాణ్ణిముద్దుచెయ్యి, ఎప్పుడూ ఏడుస్తుంటాడు… లేడీ మేరీ రాత్, ఇంగ్లీషు కవయిత్రి

పిల్లాణ్ణిముద్దుచెయ్యి, ఎప్పుడూ ఏడుస్తుంటాడు

సంతోషపెట్టు, గాలిలో ఎగురుతుంటాడు

అడిగింది ఇవ్వు, ఇంకా కావాలంటాడు

ఉన్నదానితో ఎప్పుడూ సంతోషపడడు.

వాడి కోరికలకి తుది ఉండదు

అవివేకమే వాడి అంతులేని సంపద;

వాడు ఇచ్చినమాట ఎప్పుడూ నిలబెట్టుకోడు

వాడు మాటాడినది ఒక్కటీ నమ్మబోకు.

వాడు ఒట్టేసి అబద్ధం ఆడతాడు

నిన్ను ఏమార్చడానికి పొగుడుతుంటాడు;

ఒక సారి చెయ్యి అందనీ, నిన్ను వదిలెస్తాడు

నిన్ను మభ్యపెట్టినందుకు గర్వపడుతుంటాడు

నువ్వు ఏడుస్తుంటే వాడు నవ్వుతుంటాడు

నీ లోపాలకి మళ్ళీ వాడే కారణం

ఇవి వాడి సుగుణాలు, నైపుణ్యాలు అల్పం,

వాడి అభిమానం ఉట్టి సబ్బు బుడగ.

నిలకడలో వాడు తూలికతో తులతూగుతాడు

పసిగట్టి వెంటాడడంలో తోడేళ్ళు సాటి రావు

కనుక పిల్లాణ్ణి ఏడుస్తుంటే అలాగే వదిలీ;

గాలిలో ఎగరడం వాడికి అలవాటు చెయ్యకు.

.

లేడీ మేరీ రాత్

18 October 1587 – 1651/3

ఇంగ్లీషు కవయిత్రి

.

Song: “Love, a child, is ever crying”

 .

Love, a child, is ever crying;  

Please him, and he straight is flying;   

Give him, he the more is craving,       

Never satisfied with having.     

 

His desires have no measure;    

Endless folly is his treasure;      

What he promiseth he breaketh;

Trust not one word that he speaketh.  

 

He vows nothing but false matter;      

And to cozen you will flatter;   

Let him gain the hand, he’ll leave you

And still glory to deceive you.  

 

He will triumph in your wailing;         

And yet cause be of your failing:        

These his virtues are, and slighter       

Are his gifts, his favours lighter.         

 

Feathers are as firm in staying; 

Wolves no fiercer in their preying;     

As a child then, leave him crying;       

Nor seek him so given to flying.

.

Lady Mary Wroth

18 October 1587 – 1651/3

English Poet

 

Poem Courtesy:

A Book of Women’s Verse.  1921.

Ed:   J. C. Squire

http://www.bartleby.com/291/6.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: