పాత ఓడలు … డేవిడ్ మోర్టన్, అమెరికను కవి

పాత ఓడలకి కొన్ని జ్ఞాపకాలు అంటిపెట్టుకుని ఉంటాయి

ముక్కిపోయిన వాసనతో బరువులేని సరుకులాగ –

లోతులేని సింధుశాఖలూ, ముఖాన్ని ముద్దుపెట్టుకునే నీటిపెదాలూ,

తుఫాను రాత్రుళ్ళూ, ఇంతవరకు చెప్పని కథలూ…

సూర్యోదయంతో కనిపించే ద్వీపాలూ

తమ సన్నని తెరచాపకొయ్యలని పరీక్షించిన అగ్రభూములూ,

వెన్నుపలకలను విరిచేసిన వంకరలు తిరిగిన జలమార్గాలూ,

ప్రశాంత నీలి గగనపు నిశీధులూ, నక్షత్రాలూ…

ఊంహూ, ఓడలు ఒడ్డును మరిచిపోతాయనుకోకు, అలాగే

తమని వివేకవంతుల్ని చేసిన సముద్రాలనీ, గాలుల్నీ;

మీదుమిక్కిలి, ప్రతి సంఘర్షణా ఒక జ్ఞాపకాన్ని మిగులుస్తుంది;-

అందుకే అంటుంటారు… మునిగిన ఓడలుకూడా లేస్తాయట

రాత్రిపూట తమకి పరిచయమైన రేవుల్ని చూడడానికి,

మసక మసకగా తమ అగోచరమైన తెరచాపల కాంతిని విరజిమ్ముతూ.

.

డేవిడ్ మోర్టన్

February 21, 1886 – June 13, 1957

అమెరికను కవి

Old Ships

 .

There is a memory stays upon old ships,      

  A weightless cargo in the musty hold,—    

Of bright lagoons and prow-caressing lips,  

  Of stormy midnights,—and a tale untold.   

They have remembered islands in the dawn, 

  And windy capes that tried their slender spars,     

And tortuous channels where their keels have gone,         

  And calm blue nights of stillness and the stars.     

 

Ah, never think that ships forget a shore,     

  Or bitter seas, or winds that made them wise;       

There is a dream upon them, evermore;—    

  And there be some who say that sunk ships rise   

To seek familiar harbors in the night, 

  Blowing in mists, their spectral sails like light.

.

David Morton

 February 21, 1886 – June 13, 1957

American Poet

Poem Courtesy:

The Second Book of Modern Verse.  1922.

Ed:  Jessie B. Rittenhouse (1869–1948).   

http://www.bartleby.com/271/41.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: