దేవదూతలు… ఎడ్మండ్ స్పెన్సర్, ఇంగ్లీషు కవి

భగవంతుడు నిజంగా పట్టించుకుంటాడా?
ఇంత హీనమైన మనుషులనీ, వాళ్ళ దుర్మార్గాలనీ
క్షమించి ఉపకారం చెయ్యడానికి ఇంకా ప్రేమ మిగిలి ఉంటుందా?
ఉంది. లేకుంటే, మనుషులు మృగాలకంటే కనికిష్టంగా
తయారై ఉండేవారు. ఆహ్! ఏమని చెప్పాలి తన సృష్టిని
ప్రేమించే మహోన్నతుడైన ఆ దేవుని కరుణ గురించి!
అతని అనుగ్రహాలన్నీ దయారసపూరితాలై ఉంటాయి.
అందుకే తనదూతలని అన్నిచోట్లకీ సేవచెయ్యడానికి పంపిస్తాడు:
క్రూరమైన మనిషినీ… అంతే క్రూరమైన అతని శత్రువునీ.

మనలో సహాయంకోసం అర్రులుచాచేవారికి బాసటగా
ఎన్నిసార్లు వారు తమ దివ్య నివాసాలు విడిచి వచ్చుంటారు!
ఎన్ని మార్లు తమ బంగారు రెక్కలల్లాడించుకుని
ఆకసాన్ని చీల్చుకుంటూ, సైనికుల్లా మనల్ని ఆదుకుని…
ఘోరమైన పీడలనుండి మన రక్షించడానికి!
వాళ్ళు మనతరఫున పోరాడతారు, మనని కాపాడి,రక్షిస్తారు.
వాళ్ళ సేనలని మనకి నాలుగుపక్కలా మోహరిస్తారు;
ఇదంతా కేవలం ప్రేమతోనీ, ఏ బహుమానమూ ఆశించకుండా:
నిజానికి,భగవంతుడికి మనిషిని కరుణించవలసిన పనేమి?

.
ఎడ్మండ్ స్పెన్సర్

(1552/1553 – 13 January 1599

ఇంగ్లీషు కవి

Edmund Spenser Image Courtesy: http://en.wikipedia.org/wiki/File:Edmund_Spenser_oil_painting.JPG
Edmund Spenser
Image Courtesy: http://en.wikipedia.org/wiki/File:Edmund_Spenser_oil_painting.JPG

.

The Ministry of Angels

.

And is there care in heaven? And is there love      

In heavenly spirits to these creatures bace,    

That may compassion of their evils move?   

There is: else much more wretched were the cace   

Of men then beasts. But O! th’ exceeding grace     

Of Highest God, that loves his creatures so, 

And all his workes with mercy doth embrace,        

That blessed angels he sends to and fro,       

To serve to wicked man, to serve his wicked foe!   

 

How oft do they their silver bowers leave     

To come to succour us that succour want!    

How oft do they with golden pineons cleave

The flitting skyes, like flying pursuivant,      

Against fowle feendes to ayd us militant!     

They for us fight, they watch and dewly ward,       

And their bright squadrons round about us plant;   

And all for love and nothing for reward:      

O, why should Hevenly God to men have such regard!   

.

Edmund Spenser

(1552/1553 – 13 January 1599

English Poet

Poem Courtesy:

Select Poetry of the Reign of Queen Elizabeth.  1845.

Ed: Edward Farr

http://www.bartleby.com/261/8.html

 

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: