మృగరాజు అస్థిపంజరం… ఛార్లెస్ టెన్నిసన్ టర్నర్, ఇంగ్లీషు కవి

ఓ మృగరాజా! ఎన్నాళ్లయింది నువ్విలా రక్తమాంసాలు లేకపడి ఉండి?
నీ భీకరమైన ఆకలి చూపులను ఆక్సర్షిస్తున్నదేది?
మొదట రాబందులు వాలేయి; తర్వాత క్రిములూ, వేడీ, గాలీ, వర్షమూ
అనుసరించేయి; వాటితోబాటే ఉష్ణమండలపు తీవ్రతలూనూ…
అవి నిన్ను విడిచిపెట్టేయేమో నాకు తెలీదు;
ఎన్నాళ్ళు నీ భారీ శరీరం కుళ్ళిపోయి పడి ఉందో,
చివరకి ముక్కముక్కలై నాలుగుచెరగులా వెదజల్లబడిందో,
లేక, తుఫానులై ఎగసిన ఇసుక వాటిని తిరిగి
భూమిలోకి నెట్టేసిందో, కాని, ఒకప్పుడు తీవ్రమైన ఆగ్రహం
ప్రదర్శించిన నీ విశాలమైన ముఖం ఇపుడు శూన్యంగా పడి ఉంది;
ఒకప్పుడు ఈ ఎడారినంతటినీ గడగడలాడించిన
నీ గొంతు ఘర్జనలుకూడా ఇప్పుడు వినరావు;
నీ గోళ్ళు మిగిలేయి; కానీ, క్రిములు, గాలీ, వర్షం, వేడీ
నీ పాదాల్లోంచి రక్తమాంసాలని హరించేసేయి.

.

ఛార్లెస్ టెన్నిసన్ టర్నర్

4 July 1808 – 25 April 1879

ఇంగ్లీషు కవి

.

The Lion’s Skeleton

 .

How long, O lion, hast thou fleshless lain?

What rapt thy fierce and thirsty eyes away?

First came the vulture: worms, heat, wind, and rain

Ensued, and ardors of the tropic day.

I know not—if they spar’d it thee—how long

The canker sate within thy monstrous mane,

Till it fell piecemeal, and bestrew’d the plain,

Or, shredded by the storming sands, was flung

Again to earth; but now thine ample front,

Whereon the great frowns gather’d, is laid bare;

The thunders of thy throat, which erst were wont

To scare the desert, are no longer there;

Thy claws remain, but worms, wind, rain, and heat

Have sifted out the substance of thy feet.

.

Charles Tennyson Turner

4 July 1808 – 25 April 1879

English Poet

Poem Courtesy:

A Victorian Anthology, 1837–1895.  1895.

Edmund Clarence Stedman, ed. (1833–1908).

 http://www.bartleby.com/246/362.html

.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: