స్వాప్నికులు… వాల్టర్ ఎడోల్ఫ్ రాబర్ట్స్, వెస్ట్ ఇండియన్ కవి
మనం ఈ ప్రపంచపు అంతులేని స్వాప్నికులం
ఎంత కష్టమైనా వృధా ఐనా మన నావలు ప్రయాణించవలసిందే
అన్నిసముద్రాలూ కలిసేచోట్లు మనల్ని సాహసానికి పురుకొల్పుతాయి
మనమీంచి ఆ చిట్ట చివరి కెరటం పొర్లినపుడుకూడా
మళ్ళీ మనం పునరుజ్జివిస్తాం. మనల్ని జయాపజయాలలోంచి
ఉద్ధరించగల ఆవేశాన్ని దేవతలు మనకు అనుగ్రహించారు.
మనం బంగారులేళ్ళను పట్టుకుందికో, లేక ఏ “శ్వేత”రాణి
ప్రేమను గెల్చుకుందికో, కొత్తలోకాలని గెలవడానికో పుట్టలేదు.
అయినప్పటికీ, వనదేవతల సాక్షిగా మనం శాంతికోసమూ పుట్టలేదు!
కాల,సౌందర్యాలు హరించలేని అమూల్యవస్తువు మనదగ్గరుంది:
వినాశకరమైన భీకర యుద్ధాలను సైతం తట్టుకుని
ఎవరి అవగాహనకీ ఒదగని మార్మిక సౌందర్యమున్న ఈ నేల.
.
In this 1960 Gleaner photo, W. Adolphe Roberts (centre), president of the Bolivarian Society, exchanges words with two other members of the society, Señor Mario Plaza Ponte (left), newly appointed Venezuelan consul, and Señor Martin Carazo, dean of the Consular Corps.