షేక్స్పియర్… మాత్యూ ఆర్నాల్డ్, ఇంగ్లీషు కవి

(ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరము)

 

ఇతరులు మా ప్రశ్నలకి బందీలైపోతారు. నువ్వు స్వతంత్రుడివి.

జ్ఞానశిఖరానివై, మేము పదే పదే ప్రశ్నలడుగుతున్నా

నువ్వు నవ్వుతూ నిశ్చలంగా ఉంటావు.

నువ్వు తారకలకే నీ ఘనతని పరిచయం చేస్తావు.

ధృఢంగా ఒక పాదాన్ని సముద్రంలో ఉంచి

అత్యున్నత స్వర్గాన్ని నీ నివాసం చేసుకుని,

నీ పాదాల చెంతనున్న మేఘవలయాలని మాబోటి

మర్త్యుల నిరర్థకమైన వెతుకులాటకి వదిలెస్తావు.

స్వయంగా నేర్చుకుని, స్వయంగా తరచిచూచి,

స్వయంగా సాధించి, ఆత్మగౌరవం సంపాదించుకుని

చుక్కలకీ, కిరణాలకీ ఎవరూ గుర్తించకుండా

భూమి మీద నడవడమెలాగో మార్గంచూపినవాడివి.

అనంతమైన ఈ జీవితపు చీకటికోణాలన్ని చిరస్థాయిగా నిలిచిపోతాయి

దాని నిరోధించే అన్ని బలహీనతలూ, దాసోహమనే విషాదాలూ

ఆ కనుబొమల అనుమతితో మాటలు పలుకవలసిందే.

.

మాత్యూ ఆర్నాల్డ్

24 December 1822 – 15 April 1888

ఇంగ్లీషు కవి

.

Shakespeare

.

Others abide our question. Thou art free.

We ask and ask—Thou smilest and art still,

Out-topping knowledge. For the loftiest hill,

Who to the stars uncrowns his majesty,

Planting his steadfast footsteps in the sea,

Making the heaven of heavens his dwelling-place,

Spares but the cloudy border of his base

To the foil’d searching of mortality;

And thou, who didst the stars and sunbeams know,

Self-school’d, self-scann’d, self-honour’d, self-secure,

Didst tread on earth unguess’d at.—Better so!

All pains the immortal spirit must endure,

All weakness which impairs, all griefs which bow,

Find their sole speech in that victorious brow.

.

Matthew Arnold

24 December 1822 – 15 April 1888

English Poet and cultural critic.

The English Poets.  1880–1918.

Vol. V. Browning to Rupert Brooke

 Ed: Thomas Humphry Ward,

http://www.bartleby.com/337/1252.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: