అనువాదలహరి

దేవతలతో గుసగుసలు… సామ్యూల్ లవర్, ఐరిష్ కవి

(ఐర్లండులో నిద్రలోనవ్వేపిల్లలు దేవదూతలతో గుసగుసలాడుతుంటారనే  నమ్మకం ప్రచారంలో ఉంది.  మనకి కూడా అలాంటి నమ్మకం ఉంది.)

.

ఓ బిడ్డ నిద్రపోతోంది;
తల్లి మాత్రం శోకిస్తోంది;
ఎందుకంటే ఆమె భర్త దూరంగా ఎక్కడో సముద్రం మీద ఉన్నాడు
ఆ జాలరి ఇంటి చుట్టు పక్కల
తుఫాను చూడబోతే తీవ్రరూపం దాలుస్తోంది.
ఆమె రోదిస్తూ, “ప్రియా, డెర్మాట్, త్వరగా ఇల్లు ఏరుకో!” అని.

ఆమె దేముడికి అనేక ప్రార్థనలు చేస్తుంటే
బిడ్డ ఇంకా నిద్రపోతూనే ఉంది,
తన కాళ్ళు దగ్గరా తీసుకుని నిద్రలో నవ్వుతోంది:
” ఓహ్, అది చాలా శుభశూచకం
బిడ్డా! నిద్రలో నీ నవ్వడం,
నాకు తెలుసు, దేవతలు నీతో గుసుగుసలాడుతున్నారు.

” నిద్రపోతున్న నీ మీద వాళ్ళు
బహుజాగరూకతతో కాపు కాస్తున్నప్పుడు
బిడ్డా, వాళ్లతో నెమ్మదిగా వాళ్ళతో చెప్పు
మీ నాన్నని కూడా ఒక కాపు కాయమని.
ఎందుకంటే వాళ్ళు నీతో గుసగుసలాడుతున్నారని నాకు తెలుసు.

ఉదయం తెల్లవారడంతోనే
డెర్మాట్ ఇల్లు చేరుకున్నాడు,
ఆ బిడ్డ తండ్రి రాకచూసి ఆనందంతో తల్లి కన్నీరు కార్చింది;
తనబిడ్డని మనసారా దీవిస్తూ
గుండెకు హత్తుకుని ప్రేమగా నిమురుతూ,
“నాకు తెలుసు, దేవతలు నీతో మాటాడుతుంటారు,” అంది.
.
సామ్యూల్ లవర్

24 February 1797 – 6 July 1868

ఐరిష్ కవి 

.

The Angel’s Whisper

 

[In Ireland they have a pretty fancy that when a child smiles in its sleep it is “talking with angels.”]

 

A baby was sleeping;

Its mother was weeping;

For her husband was far on the wild raging sea;

And the tempest was swelling

Round the fisherman’s dwelling;

And she cried, “Dermot, darling! O come back to me!”

 

Her beads while she numbered

The baby still slumbered,

And smiled in her face as she bended her knee:

“O, blessed be that warning,

My child, thy sleep adorning,—

For I know that the angels are whispering with thee.

 

“And while they are keeping

Bright watch o’er thy sleeping,

O, pray to them softly, my baby, with me,—

And say thou wouldst rather

They ’d watch o’er thy father!

For I know that the angels are whispering with thee.”

 

The dawn of the morning

Saw Dermot returning,

And the wife wept with joy her babe’s father to see;

And closely caressing

Her child with a blessing,

Said, “I knew that the angels were whispering with thee.”

.

 

Samuel Lover

24 February 1797 – 6 July 1868

Irish Lyricist, composer and Novelist

Poem Courtesy:

 

The World’s Best Poetry.

Eds.Bliss Carman, et al.,

Volume I. Of Home: of Friendship.  1904.

Poems of Home: I. About Children

http://www.bartleby.com/360/1/8.html

%d bloggers like this: