ఇపుడు నా పెదాలు సజీవంగా ఉన్నప్పటికీ
అవి చెప్పవలసిన మాటలు చెప్పకూడదు
నేను మరణించిన పిదప నా ఆత్మకు
నేనేం చెప్పాలనుకున్నానో గుర్తుంటుందా?
ఒక వేళ దానికి గుర్తున్నా,
ప్రియతమా, వాటిని నువ్వు గణించవు;
ఎందుకంటే, ఇప్పుడు అవి చెప్పకూడదు
అప్పుడు నువ్వు వాటిని వినలేవు.
.
సారా టీజ్డేల్
August 8, 1884 – January 29, 1933
అమెరికను కవయిత్రి

.
After Death
Now while my lips are living
Their words must stay unsaid,
And will my soul remember
To speak when I am dead?
Yet if my soul remembered
You would not heed it, dear,
For now you must not listen,
And then you could not hear.
.
Sara Teasdale
August 8, 1884 – January 29, 1933
American Lyric Poet
The New Poetry: An Anthology. 1917.
Ed: Harriet Monroe, (1860–1936).
http://www.bartleby.com/265/366.html
స్పందించండి