అనువాదలహరి

సాయంవేళ … జార్జ్ హీమ్, జర్మను కవి

కెంపులా మెరిసిన రోజు … ఊదారంగు వన్నెల్లోకి మునిగిపోయింది
అద్భుతమైన తళతళలతో ఏరు స్వచ్ఛంగా పారుతోంది
అలలమీద జోరుగా పోతున్న పడవ తెరచాప… ఊగిసలాడుతోంది
మెరుస్తున్న నీటిమీద సరంగు నీడ నల్లగా కనిపిస్తోంది.

ప్రతి ద్వీపం మీదా శరత్కాలపుటడవులు రోదసి తన రెక్కలు
బారజాపినంత మేరా తమ కుందనపు తలలు తాటిస్తున్నాయి.
చీకటి కనుమల్లోంచి మంద్రంగా ఆకుల గుసగుసలు తేలివస్తున్నాయి
గిరిసీమలనుండి సన్నగా వినవచ్చే తంత్రీ వాదనంలా

అశ్రద్ధగా పట్టుకున్న చేతులనుండి చిక్కని మద్యం
ఒలికిపోయినట్లు, తూరుపు ఇప్పుడు పెల్లుబికిన చీకటిలో
తడిసిపోయింది; దూరంగా … శోక వస్త్రాలు ధరించి 
క్రీనీడల జోళ్లు ధరించి నిశాసుందరి మౌనంగా వేచి ఉంది.

 .

జార్జ్ హీమ్

30 October 1887– 16 January 1912

జర్మను కవి

.

Georg Heyn

.

 

Evening

The Crimson day is steeped in Tyrian dyes;

The stream runs white, washed with a fabulous glaze.

A sail: one with the flying vessel, flies

The skipper’s silhouette, black on the blaze.

On every island autumn’s forests lift

Their ruddy heads where space spreads wide her wings.

From dark defiles low leafy murmurs drift—

Of woodland’s music soft as cithern strings.

With outpoured darkness now the east is soaked,

Like blue wine from an urn that careless hands

Have broken. And afar, in mourning cloaked,

Tall night on shadowy buskins mutely stands.

.

Georg Heym

30 October 1887– 16 January 1912

German Poet

(From “Modern German Poems”

Translated by Babette Deutsch and Avrahm Yarmolinsky)

Poem Courtesy:

Poetry: A Magazine of Verse.  1912–22.

Ed: Harriet Monroe,   (1860–1936).

Volume XXI. No. 3. December, 1922

http://www.bartleby.com/300/2819.html

 

%d bloggers like this: