నీరవము… థామస్ హుడ్, ఇంగ్లీషు కవి
ఎక్కడా చప్పుడు పుట్టని చోట నిశ్శబ్దం ఉండిఉండొచ్చు
చల్లని సమాధుల్లోనూ, సముద్రపు లో లోతుల్లోనూ
ఏ శబ్దమూ వినిపించని చోట నిశ్శబ్దం ఉండొచ్చు,
మూగబోయి, ఇంకా దీర్ఘనిద్రలో ఉన్న
ఏ ప్రాణి కనరాని విశాలమైన ఎడారుల్లోనూ ఉండొచ్చు;
కానీ ఏ గొంతుకా మూగపోలేదు, ఏ ప్రాణీ నిశ్శబ్దంగా చరించలేదు
సోమరిగా ఈ నేల మీద తిరిగి, ఎన్నడూ మాటాడక
నాచుపేరుకున్న శిధిలాల్లోనూ, పాడైన భవనాల్లోనూ
ఒకప్పుడు మనిషి వసించిన పురాతన భవంతుల్లోనూ
తిరిగే మేఘాలూ, మేఘాల్లా స్వేచ్ఛగా సంచరించే నీడలూ తప్ప;
మధ్య మధ్యలో నక్కలూ, దుమ్ములగొండులూ అరిచినా,
అటూ ఇటూ త్వరగా ఎగిరే గుడ్లగూబలు వాటి ప్రతిధ్వనికి
అరిచినా, చిరుగాలి వినీవినిపించకుండా శోకించినా,
అక్కడే, ఒంటరిగా, సచేతనంగా నిజమైన నీరవం ఉంటుంది.
.
థామస్ హుడ్,
23 May 1799 – 3 May 1845
ఇంగ్లీషు కవి
.
.