ప్రార్థన పరమార్థం … సర్ ఆబ్రీ డి వేరె, ఐరిష్ కవి
కనుక, నువ్వు ప్రార్థించేటపుడు గాని,
బిక్షవేసేటపుడుగాని టముకు కొట్టుకోకు. వంచకులు
కేవలం ఆడంబరం కోసం అలాచేస్తుంటారు; వీధులన్నీ
వారి దాతృత్వం గూర్చి చెప్పుకుంటాయి; వారి పాటలే పాడతాయి.
వారి స్తోత్రపాఠాలకి సామాన్యులు నూనెగచ్చుమీద జారినట్టు
పడిపోతారు; వాళ్ళు వఠ్ఠి నయవంచకులు!
స్వర్గం గురించి వదరుతున్నా, మనసు ఇహంలోనే కొట్టుకుంటుంది;
కలుపుమొక్కలకి పాకులాడుతూ శాశ్వత గ్రాసాన్ని పోగొట్టుకుంటారు.
దేముడికి ఈ ప్రార్థనలూ అరుపులూ అక్కరలేదు;
మనిషి దేమునితో అనుసంధానం చేసుకుందికి
ప్రార్థన చేయమని భగవంతుడు శాసించేడు.
వక్రమైన మార్గాలూ, అర్థంలేని ఆనందాలూ
కోరుకోకు. నీ గొంతులో ప్రార్థన పలకడానికి ముందు
నీ మనసు ప్రేమ అనే రెక్కలమీద దైవత్వంవైపు ఎగరాలి.
.
సర్ ఆబ్రీ డి వేరె 2nd Baronet
(28 August 1788 – 5 July 1846)
ఐరిష్ కవి
The Right Use of Prayer
Therefore, when thou wouldst pray, or dost thine alms,
Blow not a trump before thee. Hypocrites
Do thus vaingloriously: the common streets
Boast of their largess, echoing their psalms.
On such the laud of men like unctuous balms
Falls with sweet savour. Impious Counterfeits!
Prating of Heaven, for earth their bosom beats:
Grasping at weeds they lose immortal palms.
God needs not iteration nor vain cries;
That Man communion with his God might share
Below, Christ gave the ordinance of prayer.
Vague ambages and witless ecstasies
Avail not. Ere a voice to prayer be given
The heart should rise on wings of love to Heaven.
.
Sir Aubrey de Vere 2nd Baronet
(28 August 1788 – 5 July 1846)
Irish poet and landowner.
The Oxford Book of Victorian Verse. 1922.
Compiled by: Arthur Quiller-Couch,
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి