నిశీధి… జేమ్స్ బీటీ, స్కాటిష్ కవి
చీకటి పడింది, ఇపుడు ప్రకృతిదృశ్యం రమణీయంగా లేదు;
నేను విచారిస్తున్నాను, కానీ, ఓ వనసీమలారా మీకోసం కాదు;
ఎందుకంటే పొద్దు పొడుస్తూనే మీ అందాలు మీకు తిరిగి వస్తాయి,
సరికొత్త సువాసనలు అద్దుకుంటూ, మంచుతో మెరుస్తూ:
నేను శీతకాలపు విధ్వంశానికీ వగవను;
దయాళువైన ప్రకృతి కుసుమాంకురాల్ని పదిలపరుస్తుంది,
చివికిపోతున్న ఈ అస్థికలశం మీద ఎప్పుడు వసంతం కరుణిస్తుంది!
నిశీధిలో చిక్కుకున్న ఈ సమాధిపై పొద్దుపొడిచేదెపుడు?
.
జేమ్స్ బీటీ,
(25 అక్టోబర్ 1735 – 18 ఆగష్టు 1803)
స్కాటిష్ కవీ, తత్త్వవేత్త.
.
Night
’Tis night, and the landscape is lovely no more;
I mourn, but, ye woodlands, I mourn not for you;
For morn is approaching, your charms to restore,
Perfumed with fresh fragrance, and glittering with dew:
Nor yet for the ravage of winter I mourn;
Kind Nature the embryo blossom will save,
But when shall spring visit the mouldering urn!
O when shall day dawn on the night of the grave!
.
James Beattie
(25 October 1735 – 18 August 1803)
Scottish Poet, Moralist and Philosopher
Poem Courtesy:
Parnassus: An Anthology of Poetry. 1880.
Comp: Ralph Waldo Emerson, (1803–1882).
http://www.bartleby.com/371/3.html
శీతకాలపు స్వారీ… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
గుర్రపుస్వారీలో ఉన్న ఆనందాన్ని ఎవరు ప్రకటించగలరు?
ఎగరడంలో ఉన్న ఆనందాన్ని ఎవరు విప్పి చెప్పగలరు?
అకస్మాత్తుగా కనిపించిన అడవిపూల గుత్తుల్ని తప్పించుకుంటూ
విశాలమైన రెక్కలతో, ఆకాశంలో ఎగురుతూ వెళుతుంటే…
క్షణికమైన లోకంలో కొన్ని శాశ్వతమైన క్షణాలుంటాయి
భగవద్దత్తమైనవి, లిప్తపాటైనా, చెప్పలేని ఆనందాన్నిస్తాయి
సూర్యుడు హరివిల్లులు చిందించే తళతళల మంచుస్ఫటికాలతో
నా ముందు పరుచుకున్న విశాలమైన తెల్లని త్రోవకూడా అలాంటిదే,
నేనూ, నా బలశాలి గుర్రమూ దౌడు తీస్తుంటే తెల్లని ఈ పొలాలు,
నల్లని పొడవాటి మా జాడలతో మరకలు మరకలు అవుతున్నాయి.
ఈ చిరుగాలీ, చిరువేడికిరణ స్పర్శ ఎంత హాయిగా ఉన్నాయి!
చేవగల ఈ నేలతో నేనూ మమేకమవుతుంటే, ఆహా, ఏమి ఆనందం!
.
ఏమీ లోవెల్
February 9, 1874 – May 12, 1925
అమెరికను కవయిత్రి.
.
Amy Lowell
.
A Winter Ride
Who shall declare the joy of the running!
Who shall tell of the pleasures of flight!
Springing and spurning the tufts of wild heather,
Sweeping, wide-winged, through the blue dome of light.
Everything mortal has moments immortal,
Swift and God-gifted, immeasurably bright.
So with the stretch of the white road before me,
Shining snow crystals rainbowed by the sun,
Fields that are white, stained with long, cool, blue shadows,
Strong with the strength of my horse as we run.
Joy in the touch of the wind and the sunlight!
Joy! With the vigorous earth I am one.
.
Amy Lowell
February 9, 1874 – May 12, 1925
American Poet
Poem Courtesy:
The Little Book of Modern Verse. 1917.
Ed. Jessie B. Rittenhouse, (1869–1948).
http://www.bartleby.com/267/69.html
నిర్ణయం… రుడ్యార్డ్ కిప్లింగ్, ఇంగ్లీషు కవి
అమెరికను ఆత్మ పలుకుతోంది:
సఫలతనందించేశక్తి ఎవని చేతిలో ఉందో
తప్పొప్పులు నిర్ణయించే నిర్ణేత ఎవరో
మా విశ్వాసమూ, బలిదానాలూ అతనికే
మా గమ్యం, మా బలమూ అతని అనుగ్రహమే
ఈ స్వేచ్చా ధరిత్రిమీద పండగ చేసుకొండి
మా పూర్వపు సంకెలలు పూర్తిగా తెగిపోయాయి;
మరొక్క సారి మాకు మంచికీ చెడుకీ మధ్య
నిర్ణయించుకునే అపూర్వ అవకాశం దొరికింది.
అయితే అది ప్రార్థనలూ, కన్నీళ్ళతో
అంత చవుకగా ఏమీ దొరకలేదు,
సందేహాలూ, రోగాలతో పోగొట్టుకున్న
మార్గాన్ని మళ్ళీ తిరిగి సాధిస్తాం.
కానీ, కోపాలూ యుద్ధాలూ చల్లారేక
బాధలూ, శోధనలూ ముగిసిన తర్వాత
మళ్ళీ మేము మాతో నివసించగలిగే త్రోవ
అతని కరుణే మాముందు తెరుస్తుంది.
మృత్యుద్వారాలు సంతసిస్తే సంతసించనీ!
మేము మంచిని దర్శించి దాన్ని నిలబెడతాం,
ఓ భూదేవీ, నువ్వే సాక్ష్యం, మేము
స్వేచ్ఛకి తోడుగా ఉందామని నిర్ణయించుకున్నాం
తనువు మట్టిపాలైనా ఆత్మ శాశ్వతమని
మనని ఆజ్ఞాపించి నడిపించిన
భగవంతునికి జేజేలు పలకండి
అతని కరుణే మనందరిని రక్షించింది
.
రుడ్యార్డ్ కిప్లింగ్
30 డిశంబరు 1865 – 18 జనవరి 1936
ఇంగ్లీషు కవి, కథకుడూ, నవలా కారుడూ
1907 నోబెలు బహుమతి గ్రహీత
.
.
The Choice
.
THE AMERICAN SPIRIT SPEAKS:
To the Judge of Right and Wrong
With Whom fulfillment lies
Our purpose and our power belong,
Our faith and sacrifice.
Let Freedom’s land rejoice!
Our ancient bonds are riven;
Once more to us the eternal choice
Of good or ill is given.
Not at a little cost,
Hardly by prayer or tears,
Shall we recover the road we lost
In the drugged and doubting years.
But after the fires and the wrath,
But after searching and pain,
His Mercy opens us a path
To live with ourselves again.
In the Gates of Death rejoice!
We see and hold the good—
Bear witness, Earth, we have made our choice
For Freedom’s brotherhood.
Then praise the Lord Most High
Whose Strength hath saved us whole,
Who bade us choose that the Flesh should die
And not the living Soul!
.
Joseph Rudyard Kipling
30 December 1865 – 18 January 1936
English
Poem Courtesy:
A Treasury of War Poetry. 1917.
Ed: George Herbert Clarke (1873–1953).
శోకంలో… థామస్ హేస్టింగ్స్, అమెరికను సంగీతకారుడు
ఓ ప్రభూ, ఈ కన్నీటి కనుమలలో
బాటసారులము,దయతో మార్గాన్ని చూపించు,
నీ తీర్పు వెలువడని మా ప్రయత్నాలలో
మా చివరి శ్వాస ఉన్నంతవరకూ…
ఆకర్షణల బాణాలు మమ్మల్ని బాధించినపుడు
మేము తప్పుడుత్రోవలలోకి మరలినప్పుడు
నీ అనురాగము మాకు కరువైపోకూడదు
నీదైన సన్మార్గంలో మమ్మల్ని నడిపించు.
బాధల, ఆవేదనల వేళల్లో
మృత్యువు సమీపిస్తున్నప్పుడు
మా మనసులు ఆందోళనచెందకుండా చూడు
మా ఆత్మలు భయవిహ్వలం కానీయకు;
ఈ మర్త్య జన్మ ముగిసినపుడు
నీ అక్కున సేదదీరగా మమ్ము ఆహ్వానించు,
దేవతల గుంపులు కొలువుదీరగా
మేము ఇతర విముక్తాత్మలని చేరుకునేదాకా.
.
థామస్ హేస్టింగ్స్
15 October 1784 – 15 May 1872
అమెరికను సంగీతకారుడు.
.
.
In Sorrow
Gently, Lord, oh, gently lead us,
Pilgrims in this vale of tears,
Through the trials yet decreed us,
Till our last great change appears.
When temptation’s darts assail us,
When in devious paths we stray,
Let thy goodness never fail us,
Lead us in thy perfect way.
In the hour of pain and anguish,
In the hour when death draws near,
Suffer not our hearts to languish,
Suffer not our souls to fear;
And, when mortal life is ended,
Bid us in thine arms to rest,
Till, by angel bands attended,
We awake among the blest.
.
Thomas Hastings.
15 October 1784 – 15 May 1872
American
Poem Courtesy:
Yale Book of American Verse. 1912.
Ed: Thomas R. Lounsbury (1838–1915).
http://www.bartleby.com/102/6.html
ఎండవేడిమికి ఇక భయపడనవసరం లేదు… షేక్స్పియర్
(ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరం)
ఎండ గురించి ఇక భయపడ పనిలేదు
శీతకాలపు చలిగురించి కూడా;
నువ్వు ఈ జీవితపు కర్తవ్యం నిర్వహించి
ఇంటికి తిరిగిపోయావు, ప్రతిఫలం అందుకుని;
అందగాళ్ళైనా, అందగత్తెలైనా
చిమ్నీలు తుడిచే పిల్లల్లా మట్టిపాలు కావలసిందే.
గొప్పవాళ్ళ ఆగ్రహానికి భయపడ పనిలేదు,
నిరంకుశుల శిక్షల పరిథి దాటిపోయావు;
ఇక తిండికీ బట్టకీ చింతించే పనిలేదు;
గడ్డిపరకైనా, మహావృక్షమైనా నీకు ఒక్కటే;
అందరూ చివరకి మట్టిలో కలవవలసిందే.
మెరుపులకి భయపడే పని లేదు,
అందరూ భయపడే పిడుగుపాటు అయినా;
అపవాదులకీ,తొందరపాటు విమర్శలకి కూడా;
నువ్వు సుఖదుఃఖాలను అధిగమించేవు;
యువప్రేమికులూ, అసలందరు ప్రేమికులూ
నిన్ను చేరవలసిందే చివరకు మట్టిలోకి.
ఏ మాంత్రికుడూ నీకు హానిచెయ్యలేడు!
ఏ మంత్రవిద్యలూ నిన్ను ఆకర్షించలేవు!
ఏ భూతమైనా నీకు దూరంగా ఉండవలసిందే
ఏ అపాయమూ నీ దరిదాపులకి రాదు!
నీ చిరనిద్ర ప్రశాంతముగా ఉండు గాక;
నీ సమాధి పేరు వహించును గాక!
.
(From Cymbalene)
షేక్స్పియర్
26 April 1564 (baptised) – 23 April 1616
.
‘Fear no more the heat o’ the sun’
Fear no more the heat o’ the sun,
Nor the furious winter’s rages;
Thou thy worldly task hast done,
Home art gone, and ta’en thy wages;
Golden lads and girls all must,
As chimney-sweepers, come to dust.
Fear no more the frown o’ the great,
Thou art past the tyrant’s stroke;
Care no more to clothe and eat;
To thee the reed is as the oak:
The sceptre, learning, physic, must
All follow this, and come to dust.
Fear no more the lightning-flash,
Nor the all-dreaded thunder-stone;
Fear not slander, censure rash;
Thou hast finish’d joy and moan:
All lovers young, all lovers must
Consign to thee, and come to dust.
No exorciser harm thee!
Nor no witchcraft charm thee!
Ghost unlaid forbear thee!
Nothing ill come near thee!
Quiet consummation have;
And renownèd be thy grave!
.
(From ‘Cymbeline’, Act IV. Scene 2)
.
William Shakespeare
(26 April 1564 (baptised) – 23 April 1616)
English poet, playwright and actor
Poem Courtesy:
Comp: Andrew Macphail,
The Book of Sorrow. 1916.
Serenity
(http://www.bartleby.com/361/5.html)
నిర్లక్ష్యం… ఆస్కార్ ఫే ఏడమ్స్, అమెరికను కవి
నిర్లక్ష్యం అంటే ఏమిటని నన్నడుగుతున్నావా?
సర్లే, ఆ మాటకి నాకు అర్థం తెలుసును.
నిర్లక్ష్యం అంటే ఒకప్పుడు నువ్వు చలికాచుకున్న
మంటను వదిలిపెట్టి బూడిద వెతుక్కోడం;
దురదృష్టవశాత్తూ స్నేహానికి తలుపుతెరిచిన
తాళాన్ని పోగొట్టుకోడం; ఒకప్పుడు నీకోసం మెరిసినకళ్ళు
ఇప్పుడు నువ్వు చూసినా పట్టించుకోకపోవడం;
ఒకనాడు ఉన్నది ఇకమీదట ఎన్నడూ ఉండదన్న సత్యం గ్రహించడం
ఇప్పుడు నువ్వు దేన్నీ నమ్మవని తెలుసుకోవడం,
వయసు ఎప్పుడో తెలియకుండా జారిపోయిందని గ్రహించడం,
ఆశ తిరిగి చిగురించదని అర్థం చేసుకోవడం.
చివరకి ప్రేమంటే అనాదిగా వస్తున్న వంచన తప్ప మరోటి కాదు…
ఇవన్నీ దీని అర్థాలు. అయినప్పటికీ దీనికి కాదు బాధపడవలసింది,
బతుకుతూ, ఒంటరిగా బ్రతుకుతున్నామన్న లక్ష్యం లేకుండా బతకడానికి!
.
ఆస్కార్ ఫే ఏడమ్స్
(1855–1919)
అమెరికను కవి
Image Courtesy: http://www.s9.com/images/portraits/238_Adams-Oscar-Fay.jpg
.
Indifference
What is indifference, do you ask of me?
O well I know the meaning of the phrase.
It is to find gray ash instead of blaze
That warmed you once; to lose, alas! the key
Which turned in friendship’s wards; to sometime see
The eyes that shone for you in other days
Now coldly meet your own in passing gaze;
To know that what has been no more shall be.
It is to find that you in naught believe,
To know that youth has fled far down the past,
To feel that hope will ne’er again be born,
And love is but a poor worn cheat at last.
It is all this, yet not for this to grieve,—
To live, and heed not that one lives forlorn!
.
Oscar Fay Adams
(1855–1919)
American Poet
Poem Courtesy:
American Sonnets. 1891.
Comps: Higginson and Bigelow
http://www.bartleby.com/343/1.html
ఇచ్ఛ, శక్తి, కర్తవ్యమూ… లె నార్దో దవించి, ఇటాలియను చిత్రకారుడు
చెయ్యాలనుకుని, చెయ్యలేని వారు – చెయ్యగలిగినవి చేద్దామనుకోవాలి!
మనం చెయ్యలేనివి చేద్దామనుకోవడం వృధా;
అందుకనే, ఎవడైతే గురిలేకుండా ఎదో ఒకటి చేద్దామనుకోడో
అలాంటి వ్యక్తిని మనం విజ్ఞుడు అని అంటాము.
మన బాధల్లాగే, మన సుఖాలు కూడా ఎప్పటికీ
ఇచ్చాశక్తిగూర్చిన అవగాహనమీద ఆధారపడి ఉంటాయి.
అది మనకి తర్కం తన ఆధిక్యతని ప్రకటించుకున్నా,
కర్తవ్యానికి తగ్గట్టు సయిష్టంగా తల ఒగ్గడం నేర్పుతుంది
అయినప్పటికీ, చాలా సార్లు నువ్వు చెయ్యలేనివి చెయ్యాలనుకోవాలి,
మనకోరిక కన్నీరు తెప్పించినా సంతృప్తిగా స్వీకరించాలి
చూడడానికి తియ్యగా కనిపించినది కటువుగా పరిణమించొచ్చు:
చివరగా నీ మనసులో ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి,-
నీకు నువ్వు నిజాయితీగా ఉండి, ఇతరులకి ప్రేమపాత్రుడవైతే,
నీ కర్తవ్యాన్ని నువ్వు తప్పకుండా నెరవేర్చగలుగుతావు.
[(Samuel Waddington) అనువాదం]
.
లె నార్దో దవించి
(15 April 1452 – 2 May 1519)
ఇటాలియను బహుభాషా కోవిదుడు బహువిద్యా ప్రవీణుడు
.
.
Of Will, Power, and Duty
.
Who would, but cannot—what he can, should will!
’Tis vain to will the thing we ne’er can do;
Therefore that man we deem the wisest, who
Seeks not mere futile longing to fulfil:
Our pleasure, as our pain, dependeth still
On knowledge of will’s power; this doth imbue
With strength who yield to duty what is due,
Nor reason wrest from her high domicile.
Yet what thou canst not always shouldst thou will,
Or gratified thy wish may cost a tear,
And bitter prove what seemed most sweet to view:
Last in thy heart this truth we would instil,—
Wouldst thou to self be true, to others dear,
Will to be able, what thou oughtst, to do.
(Translated by Samuel Waddington)
.
Leonardo da Vinci
(15 April 1452 – 2 May 1519)
Italian polymath, painter, sculptor, architect, musician, mathematician, engineer, inventor, anatomist, artist, geologist, cartographer,botanist, and writer.
Poem Courtesy:
The Sonnets of Europe. 1888.
Comp: Samuel Waddington
http://www.bartleby.com/342/46.html
Note
This sonnet was attributed to Leonardo da Vinci in 1584 by Lomazzo, but it has since been attributed to various other authors, and Sig. G. Uzielli, in the journal Il Buonarroti, published in Rome, has recently affirmed that it must have been written some fifty years before the date of Leonardo. If such be really the case, it would be interesting to know how the sonnet came to be attributed to the great painter. If Leonardo had been a poet it would not have been surprising that he should have been accredited with a composition that did not belong to him, but as he was not, Lomazzo must, one would imagine, have had some reason for believing that the sonnet was his work.
ప్రేమ మహా దారుణమైనది! … గ్రేస్ ఫాలో నార్టన్, అమెరికను కవయిత్రి
దిగంతాలనున్న హరిత మైదానాన్ని దర్శించేను
లోతెరుగని నీడలో పరున్నాను
భూదేవిని అడిగేను, “నన్ను పొదువుకో” అని
రాత్రిని ప్రార్థించేను, “నన్ను ఆవరించ”మని
గాలిమీద చికాకుగా అరిచేను,
“నీకేం తెలీదు ఫో, నీకు ఎదురులేని స్వేచ్ఛ ఉంది,” అని.
చిగురాకులనన్నిటినీ వంగి దగ్గరగా గుమిగూడి
నాకొక తెరగా నిలబడమని బ్రతిమాలుకున్నాను;
తర్వాత చుక్కలతో నా కథ చెప్పుకున్నాను:
“అదిగో ఆ లోయలో, అదే మా ఇంటి దీపం.
నేను తిరిగి వెళ్ళిపోతానని తెలుసు గాని,
ముందు, ఈ కనికరంలేని అడవిలో పడుక్కోనీ” మని
ఒక మంట మరీ దగ్గరగా రగిలింది,
ఒక పేరు మరీ ప్రాణపదమైపోయింది
నాకు భయమేస్తోంది….
నిశ్చలమైన కొండలకీ, చల్లని నేలకీ, దూరాన ఆకసానికీ
గోడువెళ్ళబోసుకున్నాను: ‘నా గుండెలోని మనిషి నాకు స్వంతం కాదు!
“ఓహ్! గాలిలాగా, పక్షిరెక్కలాగా
నాకూ స్వేచ్ఛ ఉంటే ఎంత బాగుండును!
ప్రేమ మహా దారుణమైనది!”
.
గ్రేస్ ఫాలో నార్టన్
(29th October 1876 – 1956)
అమెరికను కవయిత్రి
.
Love Is a Terrible Thing
.
I went out to the farthest meadow,
I lay down in the deepest shadow;
And I said unto the earth, “Hold me,”
And unto the night, “O enfold me,”
And unto the wind petulantly
I cried, “You know not for you are free!”
And I begged the little leaves to lean
Low and together for a safe screen;
Then to the stars I told my tale:
“That is my home-light, there in the vale,
“And O, I know that I shall return,
But let me lie first mid the unfeeling fern.
“For there is a flame that has blown too near,
And there is a name that has grown too dear,
And there is a fear …”
And to the still hills and cool earth and far sky I made moan,
“The heart in my bosom is not my own!
“O would I were free as the wind on wing;
Love is a terrible thing!”
.
Grace Fallow Norton
(29th October 1876 – 1956)
American Poetess
The Answering Voice: One Hundred Love Lyrics by Women. 1917.
Comp: Sara Teasdale
http://www.bartleby.com/292/7.html
తల్లిలేని పిల్లడు… విలియం థాం, స్కాటిష్ కవి
ఏ మేనత్తలో, తోబుటువులో, అమ్మమ్మలో నాయనమ్మలో
మిగతా పిల్లలందర్నీ తమ ఇళ్ళల్లో హాయిగా నిద్రపుచ్చుతుంటే
ఎవరూ పట్టించుకోకుండా ఒంటరిగా అన్నీ కోల్పోయినట్టుండే దెవరు?
పాపం,చిన్నతనం ఇంకా వదలని వెర్రిబాగులాడు… తల్లిలేని పిల్లాడే.
ఆ తల్లి లేని పిల్లవాడు తన పక్కమీదకి నడుచుకు పోతాడు
వెచ్చగా వీపు కప్పేవారూ మెత్తని దిండుమీద తల ఉంచేవారూ లేరు;
అతని లేత అరి పాదాలు పగిలి బీటలు బారి ఇనపముక్కల్లా ఉన్నాయి
పాపం ఆ తల్లిలేని పిల్లాడు పడుకునే పక్కే చాలా గట్టిగా ఉంటుంది.
ఎప్పుడూ ఏవో చేతులు అలవాటుగా ప్రేమగా తల నిమిరినట్టు
అతని చల్లని కనుబొమ్మలు కనే కలలలో వస్తుంటాయి;
ఉదయం అయేసరికి తయారు: పనుల సంకెళ్ళూ, తల్లిలేని పిల్లవాడి
పొడకూడా కిట్టని నిర్లక్ష్యంతో కూడిన తీవ్రమైన చూపులూ.
ఒకప్పుడు అతన్ని మెత్తని ఊయలలూపిపాటలు పాడిన అక్క
తల్లి సమాధి పక్కనే తనుకూడా సమాధి అయిపోయింది;
తండ్రి కొయ్యరోట్టైనా సంపాదించిపెట్టడానికి వళ్ళుహూనం చేసుకుంటాడు
పాపం, ఈ తల్లిలేని పిల్లాడి కష్టాలు అతని దృష్టికి రావు.
కుర్రాడు పుట్టిన కొద్దిసేపటిలోనే మరణించిన తల్లి ఆత్మ
ఆ కుర్రాడు భూమ్మీదపడే కష్టాలు గమనిస్తూ ఉంటుంది
ఎవరు ఆ తల్లిలేని పిల్లవాడిని ప్రేమగా చూస్తారో వారికి
స్వర్గంలో లభించబోయే భగవంతుని ఆశీస్సులు గణిస్తూ.
కటువుగా మాటాడకండి, పాపం గడగడ వణికిపోతాడు;
మీరు పిలిస్తే తలవంచుకు వస్తాడు, నవ్వితే నవ్వుతాడు,
ఈ దయలేని మనుషులకి వాళ్ళ అవసానకాలంలో తెలుస్తుంది
ఈ తల్లిలేని పిల్లాడికి చేసినదానికి దేముడు ఏమి శిక్షవేస్తాడో.
.
విలియం థాం
(1799– 29 February 1848)
స్కాటిష్ కవి
.
The Mitherless Bairn
When a’ ither bairnies are hushed to their hame
By aunty, or cousin, or frecky grand-dame,
Wha stands last and lanely, an’ naebody carin’?
’T is the puir doited loonie,—the mitherless bairn!
The mitherless bairn gangs to his lane bed;
Nane covers his cauld back, or haps his bare head;
His wee hackit heelies are hard as the airn,
An’ litheless the lair o’ the mitherless bairn.
Aneath his cauld brow siccan dreams hover there,
O’ hands that wont kindly to kame his dark hair;
But mornin’ brings clutches, a’ reckless an’ stern,
That lo’e nae the locks o’ the mitherless bairn!
Yon sister that sang o’er his saftly rocked bed
Now rests in the mools where her mammie is laid;
The father toils sair their wee bannock to earn,
An’ kens na the wrangs o’ his mitherless bairn.
Her spirit that passed in yon hour o’ his birth,
Still watches his wearisome wanderings on earth;
Recording in heaven the blessings they earn
Wha couthilie deal wi’ the mitherless bairn!
O, speak him na harshly,—he trembles the while,
He bends to your bidding, and blesses your smile;
In their dark hour o’ anguish the heartless shall learn
That God deals the blow, for the mitherless bairn!
[Notes:
Stanza 1:
ither: other; bairnies: children; hame: home; Frecky: big; wha: who; last: lost; lanely: lonely; naebody carin’: nobody caring; puir: poor ; doited: childish; loonie: Foolish (with a sense of pity);
Stanza 2:
gang: walk/ go: lane: lone; cauld: cold; hap: cover with a quilt; wee: little or very small; hackit: rough with cuts; heelies: heels; airn: iron; lair: secluded place or den; litheless: hard
Stanza 3: aneath: beneath/ under; siccan: such; kame: comb; a’: as; stern: harsh; lo’e : love; nae: not; locks: looks
Stanza 4: Yon: A/ An; saftly: softly; mool: grave; Sair: sore; wee: little; bannock: A flat cake baked on a griddle; ken: knowledge/ perception/ idea;
Stanza 5: couthlie: couthie, agreeable, genial, kind;]
.
William Thom
(1799– 29 February 1848)
Scottish Poet
The World’s Best Poetry.
Eds: Bliss Carman, et al.,
Volume I. Of Home: of Friendship. 1904.
Poems of Home: I. About Children
http://www.bartleby.com/360/1/55.html
నా భర్తకి… అజ్ఞాత కవయిత్రి
తప్పించుకోలేని ఈ ఐహిక బాధలనుండీ
ఈ జీవితం నుండీ నేను నిష్క్రమించినపుడు
నా కోసం నల్లని దుస్తులు ధరించవద్దు
ప్రియతమా! నువ్వు ఉంగరాన్ని మాత్రం తియ్యకు.
దయచేసి ఆ తళతళల వజ్రాన్ని
నా గుర్తుగా చేతికి ఉంచుకో
అది నీ కళ్ళలో మెరిసినప్పుడు
అది పక్కనుండి నడుస్తున్న నా నీడగా భావించు.
ఎందుకంటే, ఆ వజ్రం కన్నా, ఆ మాటకొస్తే
ఏ రత్నం కన్నాకూడా ప్రకాశవంతంగా నీకు కనిపిస్తాను.
అక్కడ ఏదో జరగకూడనిది జరిగినట్టు
ఇంటిని నల్లని అలంకరణలతో నింపకు.
నా సమయం సమీపించి నేను పోయినపుడు
నీకు దుఃఖించవలసిన పని లేదు
నా స్మృతికి చిహ్నంగా, గుర్తుగా
నా వస్తువు దేనినీ భావించవద్దు.
నేను నా అదృష్టం కొద్దీ శాశ్వతుడైన
భగవంతుని స్వర్గధామం నుండి వచ్చేను
నేను అతని నివాసానికి వారసు రాలిని,
అది అతని వాగ్దానం, దేముడు మాట తప్పడు.
నన్ను నా సోదరుడి సమాధిపక్కనే నిద్రపుచ్చండి
అలా చేస్తానని మీరు మాట ఇచ్చేరు.
ఇక నేను శలవు తీసుకోవలసిన సమయం వచ్చింది
మీ నుండి నేను వీడ్కోలు తీసుకోక తప్పదు.
.
అజ్ఞాత కవయిత్రి