నాటకం చూస్తున్నపుడు నా వెనక కూచున్నామెకు… ఏ పీ హెర్బర్ట్, ఇంగ్లీషు కవి అమ్మా! మీరు ఈ నాటకం చూసేరు, నేనివాళ వరకు చూడలేదు; మీకు నాటకంలో సన్నివేశాలన్నీ తెలుసు, కానీ, నాకు తెలీవని మనవి చేస్తున్నాను. చివరి వరకు హంతకుడెవడో ప్రేక్షకుడికి తెలియకుండా ఉంచడమే రచయిత ఉద్దేశ్యం. మీరిలా చెప్పుకుంటూ పోతుంటే మీరు అతనికి అన్యాయం చేసినవాళ్ళు అవుతారు. నటులు తమ తమ ప్రత్యేకమైన శైలిలో చాలా హాస్యాన్ని పండిస్తుంటారు మీరు ముందుగానే ఏమిచెయ్యబోతున్నారో చెప్పెస్తే అందులోని సరసత ఆస్వాదించే అవకాశం నాకు ఉండదు. ఒక నాటకంలో ఉండే కుతూహలం అంతా, నాకు తెలిసి ప్రేక్షకుడి ఊహకి రహస్యం త్వరగా దొరక్కుండా ఉంచడంలోనే; మీరు అంతా పూర్తిగా చెప్పెస్తున్నారు గనుక ఇక అందులో ఊహించనిది జరిగే ఆస్కారమే లేదు మీతో పాటు వచ్చిన స్త్రీ కూడా మీలాగే తెలివితక్కువదిలా కనిపిస్తోంది. కానీ ఆవిడ సహకారం లేకుండానే కథని నేను అర్థం చేసుకోగలను. క్లుప్తంగా చెప్పాలంటే, తల్లులారా, మీరు మాటాడకుండే కూచుంటే మీకూ నాకూ మంచిది. చివరగా మరొక్క మాట… నా మెడమీద వాలి మరీ చూడకండి. . ఏ. పీ. హెర్బర్ట్ ఇంగ్లీషు రచయిత Sir AP Herbert At the Theatre: To the Lady Behind Me Dear Madam, you have seen this play; I never saw it till today. You know the details of the plot, But, let me tell you, I do not. The author seeks to keep from me The murderer’s identity, And you are not a friend of his If you keep shouting who it is. The actors in their funny way Have several funny things to say, But they do not amuse me more If you have said them just before; The merit of the drama lies, I understand, in some surprise; But the surprise must now be small Since you have just foretold it all. The lady you have brought with you Is, I infer, a half-wit too, But I can understand the piece Without assistance from your niece. In short, foul woman, it would suit Me just as well if you were mute; In fact, to make my meaning plain, I trust you will not speak again. And—-may I add one human touch?—- Don’t breathe upon my neck so much. A P Herbert 24 September 1890 – 11 November 1971 English Humorist, Novelist, Playwright and Member of Parliament Rate this:దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండిఏప్రిల్ 26, 2015