రోజు: ఏప్రిల్ 21, 2015
-
కటీఫ్… యెవగనీ యెటుషెంకో, రష్యను కవి
నాకు ప్రేమంటే విరక్తి వచ్చింది; మన కథకి పేలవమైన ముగింపు, జీవితమంత నిరుత్సాహంగా, సమాధి అంత కళావిహీనంగా. మన్నించు… ఈ ప్రేమగీతాన్ని ఇక్కడితో ఆపేస్తున్నాను గిటారు పగలగొడుతున్నా, మనిద్దరికీ దాచుకుందికి ఏవీ లేవు. కుక్కపిల్లకేం తోచడం లేదు. ఆ బొచ్చుకుక్కకి చిన్నవిషయాన్ని మనం ఎందుకు అంత క్లిష్టం చేసుకుంటున్నామో అర్థంకావటం లేదు. అది నీ గది ముందుకొచ్చి మూలుగుతుంది. పోనీలే అని వెళ్లనిస్తాను. అది నా నా గది తలుపులు గోకినపుడు, నువ్వే వెళ్ళిపోతావు. ఓ కుక్కా!…