అనువాదలహరి

క్షణికానందము … కెన్నెత్ బర్క్, అమెరికను కవి

చెఱువు నిండుగా ఉంది

నేల పచ్చగా ఉంది

వార్తలు కట్టేయడంతో

మనసిపుడు ప్రశాంతంగా ఉంది.

 

ఓ చేతిలో పుస్తకం

మరో చేతిలో డ్రింకూ

ఇంకేం కావాలి మనిషికి?

 

మంచి కీర్తిప్రతిష్ఠలూ

మెరుగైన ఆరోగ్యం

బాంకులో ఓ పది మిలియను డాలర్లూ…

.

కెన్నెత్ బర్క్

1897 – 1993

అమెరికను కవి

 

 

Temporary Well Being

 

The pond is plenteous

The land is lush,

And having turned off the news

I am for the moment mellow.

 

With my book in one hand

And my drink in the other

What more could I want

 

But fame,

Better health,

And ten million dollars?

.

KENNETH BURKE

1897 – 1993

American Poet, Essayist, Novelist, Literary Theorist

%d bloggers like this: