అనువాదలహరి

శీలవతి… తూ ఫూ , చీనీ కవి

అందంలోనూ కులీనతలోనూ సాటిలేని

ఒక ఉత్తమురాలైన స్త్రీ ఈ దిక్కుమాలిన

లోయలో తలదాచుకుంటోంది.

ఆమె చెప్పినదాన్ని బట్టి

కలిగిన కుటుంబంలోంచే వచ్చింది గానీ

ఇప్పుడు ఆ సంపద అంతా నశించిపోయింది;

చెట్టూ చేమలాగ దక్షతలేక బతుకుతోంది.

విప్లవకారులకి ముఖ్యభూబాగాలు చిక్కిన తర్వాత

ఆమె అన్నదమ్ముల్ని వాళ్ళు మట్టుపెట్టేరు;

పుట్టుక, హోదా అలాంటప్పుడు అక్కరకు రావుగదా!

కనీసం వాళ్ళకి తగిన అంత్యక్రియలు చెయ్యడానికైనా

వాళ్ళ అస్థికలు ఇంటికి తీసుకుపోడానికి ఆమెకు అనుమతించలేదు.

ఒకప్పుడు వాళ్ళమాటకి ఎదురులేదనుకున్నవాళ్ళకి కూడా

ప్రపంచం ఒక్కసారి ఎదురుతిరుగుతుంది కదా!

సంపద అన్నది గాలిలో

మిణుకుమిణుకుమనే దీపం లాంటిది.

ఆమె భర్త నిలకడలేని వాడు.

వాడు మరో అందమైన స్త్రీని తెచ్చుకున్నాడు

చివరకి కొన్ని చెట్లైనా (వెచ్) స్థిరంగా ఉంటాయి

సూర్యాస్తమయం అయేసరికి ఆకులు ముడుచుకుంటూ.

మేండరిన్ బాతులు తమ జంటతోనే

జీవితాంతమూ కాపురం చేస్తాయి.

అతనికి కొత్తపెళ్ళాం

నవ్వులమీద మీద మోజే తప్ప

పాతపెళ్ళాం రోదన వినడానికి

చెవులు పనిచెయ్యవనుకుంటాను.

పర్వతాగ్రాల్లో నీరు ఎప్పుడూ

సత్యం లా స్వచ్ఛంగా ఉంటుంది.

అది క్రిందకి జారుతున్న కొద్దీ

బురద కొట్టుకుపోతుందని జనవాక్యం.

ఆమె చెలికత్తె తిరిగివచ్చింది

ఆమె ముత్యాలను బజారులో అమ్మి;

ఇంటి చూరుకున్న కన్నాలను కప్పడానికి

ఆమె పాదుల్ని ఎగదోస్తోంది.

ఆమె ఏరుతున్న పువ్వులు

ఆమె తలలో పెట్టుకోడానికి కాదు;

ఆ చారెడు సైప్రెస్ పువ్వులూ

ఆకలిబాధనుండి రక్షించుకోడానికి..

ఎంతో అందంగా ఉన్న ఆమె నీలి జాకెట్టు చేతులు

ఆమెను చలినించి రక్షించలేనంత పల్చగా ఉన్నాయి.

సాయంత్రం అవుతుంటే

ఆమె పొడవాటి వెదురుపొదకు ఆనుకుంటోంది.

.

తూ ఫూ

712- 770

చీనీ కవి

 Tu Fu

A Woman of Quality

.

Matchless in breeding and beauty,
a fine lady has taken refuge
in this forsaken valley.
She is of good family, she says,
but her fortune has withered away;
now she lives as the grass and trees.
When the heartlands fell to the rebels
her brothers were put to death;
birth and position availed nothing–
she was not even allowed
to bring home their bones for burial.
The world turns quickly against
those who have had their day–
fortune is a lamp-flame
flickering in the wind.
Her husband is a fickle fellow
who has a lovely new woman.
Even the vetch-tree is more constant,
folding its leaves every dusk,
and mandarin ducks
always sleep with their mates.
But he has eyes only
for his new woman’s smile,
and his ears are deaf
to his first wife’s weeping.
High in the mountains
spring water is clear as truth,
but when it reaches the lowlands
it is muddied with rumor.
Her serving-maid returns
from selling her pearls;
she drags a creeper over
to cover holes in the roof.
The flowers the lady picks
are not for her hair,
and the handfuls of cypress
are a bitter stay against hunger.
Her pretty blue sleeves
are too thin for the cold;
as evening falls
she leans on the tall bamboo.

.

Du Fu

Chinese Poet

(tr. David Lunde)

Poem Courtesy:

http://www.chinapage.com/poet-e/dufu2e.html

 

%d bloggers like this: