అనువాదలహరి

తేటనీటి సెలయేటికి… స్మాలెట్, స్కాటిష్ కవి

ఓ స్వచ్ఛ సరోవరమా! నీ తేటనీటిలో
నా శరీరాన్ని శుభ్రపరచ కోరుతాను.
నీ నైర్మల్యాన్ని ఏ ప్రవాహమూ కలుషితం చెయ్యలేదు; 
పుడమి బుగ్గమీది సొట్టవి,
నీ మార్గాన్ని ఏ రాయీ నిలువరించలేదు; 
మాతృ సరసిని పోలిన నీ జలాలు, పొదలతో,
తోపులతో, సుందర ఉద్యానాలతో
మనసును హరిస్తూ విభ్రమం గొలుపుతాయి

ఆహ్లాదకరంగా పచ్చదనం పరచుకున్న నీ తీరాన
ఎన్నో పశుల మందలూ, కాపరులూ తిరుగాడుతూ ఉంటారు,
పాడుకుంటూ యువతులు బిందెలతో నీళ్ళు మోసుకెళుతుంటే
లోయల్లో  గొల్లల పిల్లనగ్రోవులు మారుమోగుతుంటాయి,  
ఏ కపటమూ ఎరుగని ఒక కాలాతీతమైన నమ్మకం,
ఒళ్ళు వంచి చేసే పరిశ్రమ వర్ధిల్లుతాయి;
మనసులు మెచ్చి, చేతులు అందించిన
దీవెనలు వారిని సదా సంరక్షిస్తాయి.
.
స్మాలెట్

19 March 1721 – 17 September 1771

స్కాటిష్ కవి

Tobias George Smollet Picture  Courtesy: http://en.wikipedia.org/wiki/Tobias_Smollett

.

To Leven Water

 .

Pure stream, in whose transparent wave    

My youthful limbs I wont to lave;    

No torrents stain thy limpid source, 

No rocks impede thy dimpling course          

Devolving from thy parent lake                   

A charming maze thy waters make   

By bowers of birch and groves of pine         

And edges flower’d with eglantine.  

 

Still on thy banks so gaily green       

May numerous herds and flocks be seen,         

And lasses chanting o’er the pail,     

And shepherds piping in the dale,     

And ancient faith that knows no guile,         

And industry embrown’d with toil,   

And hearts resolved and hands prepared          

The blessings they enjoy to guard.

.

Tobias George Smollett.

19 March 1721 – 17 September 1771

1721–1771

Poem Courtesy:

The Oxford Book of English Verse: 1250–1900.

Ed: Arthur Quiller-Couch, ed. 1919.

%d bloggers like this: