అనువాదలహరి

కలల ప్రపంచం… ఫ్రాన్సిస్ ఏన్ కెంబుల్, బ్రిటిషు కవయిత్రి

ఓ ప్రియతమా! నా కలల్లో
నీ అందమైన ముఖం కనిపించి
ఎన్నడూలేని ప్రేమతో సుకుమారంగా నవ్వితే,
ఆ అపురూపమైన చిరునవ్వుకు ఈర్ష్యపడకు,
అది నువ్వు అనుగ్రహించినది కాదు.

నీ కలతలేని సుఖ నిద్రావస్థలో
నీ పాదాలమ్రోల వాలి నా ఆత్మ శోకిస్తే
దాని నిశ్శబ్ద ఆరాధనని అనుభవించు.
నీకు తెలుసును, ప్రియ సుందరీ,
అది నా పొరపాటు కాదు.
.
ఫ్రాన్సిస్ ఏన్ కెంబుల్
బ్రిటిషు కవయిత్రి,

.

Dream Land

 .

When in my dreams thy lovely face,

Smiles with unwonted tender grace,   

Grudge not the precious seldom cheer;         

I know full well, my lady dear!

It is no boon of thine.             

 

In thy sweet sanctuary of sleep,

If my sad sprite should kneeling weep,         

Suffer its speechless worship there;    

Thou know’st full well, my lady fair! 

It is no fault of mine.              

.

Frances Anne Kemble

27 November 1809 – 15 January 1893

British Actress, Poet, Playwright.

Poem Courtesy:

Women Poets of the Nineteenth Century.  1907.

Ed: Alfred H. Miles.

http://www.bartleby.com/293/117.html

 

%d bloggers like this: