అనువాదలహరి

మచ్చలేని జీవితం… థామస్ కేంపియన్, ఇంగ్లీషు కవి

ఎవడు నిజాయితీగా బతుకుతాడో
ఎవని నిర్మలమైన హృదయం
అనైతిక చర్యలనుండీ,
అహంకారంనుండి దూరంగా ఉంటుందో

ఎవని జీవితకాలం ప్రమాదరహితమైన
వేడుకలతో సాఫీగా సాగిపోతుందో
ఎవనిని కష్టాలు క్రుంగదీయక
ఆశలు ఊరించవో..

అతనికి రక్షణకోసం
దుర్గాలూ, ఆయుధాలూ అవసరం లేదు.
తుఫానులూ, పిడుగుపాటులనుండి
రహస్య నేలమాళిగల అవసరం లేదు.

అతను ఒక్కడే ఏమాత్రం
భయపడని కన్నులతో
సముద్రాల భీభత్సాన్నీ
రోదసినుంది వచ్చే ఉపద్రవాలనీ చూడగలడు. .

విధి, అదృష్టం తీసుకొచ్చే
సుఖాలనన్నిటినీ త్యజించి
అతను ఆకాశాన్నే తన పాఠ్యపుస్తకం చేసుకుని
ఖగోళాన్ని తన జ్ఞానంగా మలుచుకుంటాడు.

మంచి ఆలోచనలే అతని స్నేహితులు
స్వ్యంగా గడిపిన వయసే అతని ధనం
ఈ భూమే అతని ప్రశాంత స్థావరం
అతను యాత్రచేసే పుణ్యభూమి . 

థామస్ కేంపియన్

12 February 1567 – 1 March 1620

ఇంగ్లీషు కవి

 

.

Integer Vitae

 

THE man of life upright,

Whose guiltless heart is free

From all dishonest deeds,

Or thought of vanity;

 

The man whose silent days

In harmless joys are spent,

Whom hopes cannot delude,

Nor sorrow discontent;

 

That man needs neither towers

Nor armour for defence,

Nor secret vaults to fly

From thunder’s violence:

 

He only can behold

With unaffrighted eyes

The horrors of the deep

And terrors of the skies.

 

Thus, scorning all the cares

That fate or fortune brings,

He makes the heaven his book,

His wisdom heavenly things;

 

Good thoughts his only friends,

His wealth a well-spent age,

The earth his sober inn

And quiet pilgrimage.

.

Thomas Campion.

12 February 1567 – 1 March 1620

English composer, poet, and physician

Poem Courtesy:

The Oxford Book of English Verse: 1250–1900

Ed: Arthur Quiller-Couch, 1919.

 

 

%d bloggers like this: