అనువాదలహరి

ఆలోచనా తరంగం… కేథరీన్ ఫిలిప్స్, వెల్ష్ కవయిత్రి

మృత్యువు సమవర్తి; సౌందర్యమైనా, రాజులైనా,
చక్రవర్తులైనా, దివ్యమైనవీ, ప్రఖ్యాతిగలవీ ఏదైనా
ఒక నిర్దాక్షిణ్యమైన దాని ఒక్క తోపుతో వాటి సమాధుల్లో
ఎ చడీ చప్పుడూ లేకుండా దుమ్మూ ధూళీలా పోగుపడవలసిందే!

మనుషులకి మల్లే, సామ్రాజ్యాలకి కూడా
అంతం ఉన్నప్పుడు పెనుమార్పులకి ఆశ్చర్యపోయేదెవ్వరు?
అవి క్రమంగా క్షీణించి నశించవలసిందే; ఈ ప్రపంచంలో
దేననికీ నిశ్చయం లేదు, ఒక్క అనిశ్చితత్వానికి తప్ప.

అధికారమూ, కీర్తీ అన్నవి ఎంత క్షణికాలంటే
గుడీశలు చూసి జాలీ, రాజుల్ని చూసి ఈర్ష్యా పడేది ఎవడు?
అందులోనూ, కీర్తిప్రతిష్టలు నమ్మలేనివని తెలిసినపుడు
ప్రపంచంలో గొప్పవాళ్ళనిపించుకోవడంలో పెద్దగా మజా లేదు.

విధి మానవాళితో ఆడే ఈ క్రీడకి మనకి
అప్పుడప్పుడు ఇలాంటి వైరుధ్యాలు కనిపించినా
చీకటిలో సహజకాంతి గల మణుల్లాంటి వస్తువులు
ఈ గందరగోళంలో అప్పుడప్పుడు దొరుకుతుంటాయి.

ఎవడైతే వంశ ప్రవర చెప్పుకోవడం వల్ల కాకుండా
వేరే విధంగా గొప్పదనాన్ని సంపాదించుకోగలడో,
తన తండ్రి తాతలు సాధించిన గొప్పలు చెప్పుకోవడం కాకుండా
స్వయంగా మంచి కానిదాని గొప్పదనం వృధా అనుకుంటాడో ;

ఎవడికి ప్రపంచం తీరు తెలిసి మనం సౌఖ్యాలని
పిలిచే వాటికి తన ఆత్మను అమ్మజూపడో;
ఏదో మిష చూపి ధనాన్ని పోగుచెయ్యడాన్ని ద్వేషించి
దాని వినియోగానికి ఉదాత్తమైన లక్ష్యాన్ని వెదకగలడో.

తన దైవానికీ, దేశానికీ, స్నేహితులకీ సేవజేయగల
జీవితాన్ని త్యాగం చెయ్యడానికి ఎవడు వెనకాడడో ;
ఎవడికి పొగడ్తలు, కపటమూ ఇష్టం ఉండదో
వాడి వెనక పదిమంది కూడా ఉండరో;

అపుడు విలువైన స్వచ్చమైన వజ్రాలవంటి అతని ఆత్మ,
అతని ముఖం లాగే, నిర్మలంగా ప్రకాశిస్తుంది.
విలువలు నేరంగా పరిగణించి శిక్షించబడే చోట
అతను ఒక్కడే మంచిగా ఉండగల ధైర్యం చెయ్యగలడు.

ఎవడు కుతంత్రాలు నీచమైన రక్షణ మార్గం అనీ,
అమాయకత్వమే క్షేమమూ, తెలివైనమార్గమనుకుంటాడో
ఎవడికి తన లక్ష్యం స్పష్టమైనదేనా అన్న సందేహం మినహా
సాహసించడానికీ, పోరాటానికీవెరవక, భయానికివెరుస్తాడో.

ఎవడు సాహసాన్నీ, ధర్మాన్ని సమంగా అనుసరిస్తూ
ప్రమాదాల్ని ఎదుర్కొని, అధిగమించి, ధిక్కరించగలడో;
ఓడించిన శత్రువుని సహితం అగౌరవపరచక,
క్షమించి, అతని కోరికలని ఆదరిస్తాడో ;

తనకీ ఆత్మకీ స్నేహభావం కలిగి ఉండి
ఎక్కడ మనసు ఉంటే వారికి తన సర్వస్వాన్నీ ఈయగలడో;
ఎవనికి స్నేహం ముందు అధికారాలూ, బంధుత్వాలూ
అంతరించి,స్నేహంలోనే పరిపూర్ణత సిద్ధిస్తుందో.

ఒక సారి స్నేహానికి మనసిచ్చేక, స్నేహితుడు అతని గౌరవమూ,
నిజాయితీ తప్పనంతవరకు వెనక్కి తీసుకోడో;
ఆ స్నేహం నిలుపుకోడం అతనికి భారమైనప్పటికీ
దానిని ఆనందంగా భరించడానికి సిద్ధపడతాడో .

అతను తను ఉన్న ఉచ్చస్థితిలోనుండి పతనాన్ని
ఏమీ ఆశ్చర్యం పోకుండా తట్టుకోవడమే గాక,
ఎంతో ఉదాత్తమైన స్థితప్రజ్ఞతతో
తన ఔన్నత్యంలోనూ,దుర్విధిలోనూ ప్రవర్తించగలడో.

తన గౌరవ భంగం లేకుండా ఎంత కష్టాన్నైనా భరించగలడో
పగతీర్చుకుందికి భయపడకపోయినా, చిన్నచూపు చూసి అసహ్యించుకుంటాడో,
ఎవడు అన్ని ఆర్థిక దశలోనూ ఆనందంగా ఉంటాడో, ఎందుకంటే
మనిషికి తన పనులవల్ల తప్ప అయచితంగా సుఖదుఃఖాలు రావు గనుక;

అతను దైవాన్ని ఏ ప్రలోభాలద్వారా ప్రసన్నం చేసుకో యత్నించడో,
అంతే కాక, చెరశాలకైనా ధైర్యంగా నడవగలడో …
తన సర్వ సంపదలనీ, అధికారాల్నీ,
తన సర్వప్రపంచాన్నీ పోగొట్టుకున్నా, వ్యక్తిత్వం పోగొట్టుకోడో
అదిగో, అతను, నిజంగా స్వయం ప్రకాశిస్తాడు;
ఎవడు సచ్ఛీలుడో అతనే నిజంగా అమరుడు.

కేథరీన్ ఫిలిప్స్

వెల్ష్ కవయిత్రి

A Revery

.

Death is a leveller; beauty and kings,

And conquerours, and all those glorious things,

Are tumbled to their graves in one rude heap,

Like common dust as quiet and as cheap.

At greater changes who would wonder then,

Since Kingdoms have their fates as well as men?

They must fall sick and die; nothing can be

In this world certain, but uncertainty.

Since power and greatness are such slippery things,

Who’d pity cottages or envy Kings?

Now least of all, when, weary of deceit,

The world no longer flatters with the great.

Though such confusions here below we find,

As Providence were wanton with mankind:

Yet in this chaos some things do send forth

(Like jewels in the dark) a native worth.

He that derives his high nobility

Not from the mention of a pedigree;

Who scorns to boast the glories of his blood,

And thinks he can’t be great that is not good;

Who knows the world, and what we pleasure call,

Yet cannot sell one conscience for them all;

Who hates to hoard that gold with an excuse,

For which he can find out a nobler use;

Who dares not keep that life that he can spend,

To serve his God, his country and his friend;

Who flattery and falsehood doth so hate,

He would not buy ten lives at such a rate;

Whose soul, then diamonds more rich and clear,

Naked and open as his face doth wear,

Who dares be good alone in such a time,

When vertue’s held and punish’d as a crime;

Who thinks dark crooked plots a mean defence,

And is both safe and wise in innocence;

Who dares both fight and die, but dares not fear;

Whose only doubt is, if his cause be clear;

Whose courage and his justice equal worn,

Can dangers grapple, overcome and scorn,

Yet not insult upon a conquer’d foe,

But can forgive him and oblige him too;

Whose friendship is congenial with his soul,

Who where he gives a heart bestows it whole;

Whose other ties and titles here do end,

Or buried or completed in the friend;

Who ne’er resumes the soul he once did give,

While his friend’s honesty or honour live;

And if his friend’s content would cost the price,

Would count himself a happy sacrifice;

Who from the top of his prosperities

Can take a fall, and yet without surprize;

Who with the same august and even state

Can entertain the best and worst of fate;

Whose suffering ’s sweet, if honour once adorn it;

Who slights revenge, yet does not fear, but scorn it;

Whose happiness in ev’ry fortune lives,

For that no fortune either takes or gives;

Who no unhandsome ways can bribe his fate,

Nay, out of prison marches through the gate;

Who, losing all his titles and his pelf,

Nay, all the world, can never lose himself;

This person shines indeed, and he that can

Be vertuous is the great immortal man.

.

Katherine Philips (‘Orinda’)

(1 January 1632 – 22 June 1664)

Anglo-welsh Poet, Translator

Poem Courtesy:

A Book of Women’s Verse. 1921.

Ed: J. C. Squire

http://www.bartleby.com/291/14.html

%d bloggers like this: