అనువాదలహరి

In Search of a Phrase… Vadrevu Chinaveerabhadrudu, Telugu, Indian

For that haunting phrase you greet many a dawn,

Reach out to many and sacrificed a lot. And

For the apt word to flash in your mind, like a fisherman

On boat, you sieve the seas every day.

 

For the first shoots of sunlight every dawn

You bide; Fog-screen in front; the pool of moonshine

Sleeting through the night spreads to the limits of horizon;

Then, the silver gleams like tolling of bells from afar.

 

Like the first glimpse of a distant sail

You first witness a maiden ray. Then,

As if a net is cast over you from the other bank

A matrix of chiaroscuro snails before you.

 

One after the other the windows of the sky open

A silken hand comes into your view opening out

The screens of leafy curtains on the tops of branches.

You hear a sweet sonorous note unfolding from within.

 .

Chinaveerabhadrudu

Telugu

Indian

Vadrevu  Chinaveerabhadrudu
Vadrevu Chinaveerabhadrudu

ఒక వాక్యాన్ని అన్వేషిస్తూ

.

ఒక వాక్యాన్ని అన్వేషిస్తూ ఎన్నో ఉదయాలు ఎదురేగావు

ఎందరినో కలుసుకున్నావు, ఎన్నిటినో వదులుకున్నావు

స్ఫురించవలసిన శబ్దంకోసం ఒక జాలరిలాగా

తెప్పవేసుకుని ప్రతిరోజూ సముద్రాన్ని శోధించావు

తెల్ల వారే ప్రతి ఝాములోనూ తొలిసూర్యకాంతి కోసం

ఎదురుచూస్తావు.ముందు పొగ. రాత్రంతా కురిసిన

వెన్నెల దిగంతం దాకా చెరువులా పరుచుకుంది

అప్పుడుదూరంగా గంటలు మోగినట్టు వెండి మిలమిల.

సుదూరం నుండి నీవైపు మలుపు తిరిగిన

తొలినావ తెరచాపలాగా ముందొక వెలుగు రేఖ. అప్పుడు

అవతలి ఒడ్డు మీంచి ఎవరో నీ మీద వల విసిరినట్టు

కళ్ళముందు తారాడుతూ చిన్ని వెలుతురుగళ్ళజల్లు.

ఆకాశపు తలుపులొక్కొక్కటీ తెరుచుకుంటాయి

చిగుర్ల కొసల చెట్లకొమ్మల తరుకాండాల కిటికీ పరదాలు

తప్పిస్తూ మృదుహస్తమొకటి నీ కంట పడుతుంది. నీలో

ఒక మొగ్గ విచ్చుకుంటున్న సునాదం వినిపిస్తుంది.

.

వాడ్రేవు  చినవీరభద్రుడు

“నీటిరంగుల చిత్రం” సంకలనం నుండి

%d bloggers like this: