చంద్రుడు ప్రశాంతంగా కడలి తరంగాలమీద ఆడుతున్నాడు—
కిటికీ ఇంకా తెరిచే ఉంది, తెమ్మెరకి ఆహ్వానం పలుకుతూ,
సుల్తాన కళ్ళార్పక చూస్తోంది, చీకటి ద్వీపాలపై
జలతారు పరదాల మాటున కడలికూడా నిట్టూరుస్తోంది.
వణుకుతున్న ఆమె చేతుల్లోంచి వీణ పక్కకి ఒరిగింది.
ఒక మెత్తని స్వరం ఎక్కడో కలుక్కున ప్రతిధ్వనించడం ఆమె వింది.
గ్రీసు ద్వీపాలనుండి టార్టారు పడవలపై అడక వేసుకుంటూ
కోస్ తీరాలనుండి వచ్చే తురుష్క వ్యాపారిది కాదుగద?
సముద్రపు కాకులు ఒకదాని వెనక ఒకటి కెరటాలదొంతరలని
తరుగుతూ, నీటమునిగిలేచిన రెక్కలనుండి జాల్వారు ముత్యాల సవ్వడా?
లేక, సముద్రంలో గోపురాలు కూలుతున్నట్టు ఆకాశంలో
పల్టీలు వేస్తూ సన్నని కీచుగొంతుతో వేసే జీన్ పక్షి కూతా?
ఆ అంతః పురంలో స్త్రీల హృదయ కెరటాలను కలతపెట్టేదెవరు?
సముద్రం మీద ఊయలలూగే సముద్రపు కాకి కాదు;
గోడలోని రాతి ఇటుకలు కావు, దిగువ అల్లంత దూరాన అలలమీద
లయబద్ధంగా కెరటాలను వెనక్కి తోసే వర్తకుడి ఓడ తెడ్లు కావు.
కాని, నిట్టూరుస్తున్న ఆ ఉడుపులలోంచి వెక్కిళ్ళు అదుపుతప్పాయి.
చూడు, వాళ్ళు కొట్టుకుపోతున్న దుఃఖపు వరదని శబ్దిస్తూ
పేరుకి మానవాకారంలో కదలాడుతున్నారు…
చంద్రుడు మాత్రం ప్రశాంతంగా సంద్రం మీద ఆడుకుంటున్నాడు.
.
విక్టర్ హ్యూగో

స్పందించండి