అనువాదలహరి

నీవు లేక… హెర్మన్ హెస్, స్వీడిష్ కవి

సమాధి ఫలకంలా శూన్యంగా
రాత్రిపూట తలగడ నా వంక చూస్తుంటుంది తదేకంగా;
నీ కురులలో నిద్రపోకుండా
ఒంటరిగా ఉండడం
ఇంత కటువుగా ఉంటూందని ఎన్నడూ అనుకోలేదు.

వేలాడుతున్న దీపం మసిబారి
ఈ సడిలేని ఇంటిలో ఒంటరిగా ఉంటున్నాను
నీ చేతులు అందుకుందామని నా చెయ్యి జాచి
నీ కోసం కాంక్షతో జాచిన మెత్తని పెదాలకు
లక్ష్యం దొరకక విసుగుతో నీరసంగా నా పెదాలే దొరుకుతాయి.
అప్పుడు ఒక్కసారిగా మెలకువ వస్తుంది,
నన్నావరించిన చెమ్మ చీకటి ఇంకా చిక్కబడుతోంది.
కిటికీలోంచి ఒక నక్షత్రం స్పష్టంగా మెరుస్తోంది…
ఏవీ నీ స్వచ్ఛమైన కురులు?
ఏవీ నీ తీయని పెదిమలు?

ఇపుడు సంతోషాన్ని చూసినపుడల్లా వేదననీ
తాగిన ప్రతి గుటకలోనూ విషాన్ని దిగమింగుతున్నాను
నువ్వు లేకుండా
ఒక్కడినీ ఇలా ఒంటరిగా ఉండడం
ఇంత కష్టంగా ఉంటుందని నేనెన్నడూ ఊహించలేదు.

.

అనువాదం: James Wright

హెర్మన్ హెస్
2 జులై 1877 – 9 ఆగష్టు 1962
స్వీడిష్ కవి, నవలా కరుడూ, చిత్రకారుడూ

 .

Herman Hesse

.

Without You

.

My Pillow gazes upon me at night
Empty as a gravestone;
I never thought it would be so bitter
To be alone,
Not to lie down asleep in your hair.

I lie alone in a silent house,
The hanging lamp darkened,
And gently stretch out my hands
To gather in yours,
And softly press my warm mouth
Toward you, and kiss myself, exhausted and weak-
Then suddenly I’m awake
And all around me the cold night grows still.
The star in the window shines clearly-
Where is your blond hair,
Where your sweet mouth?

Now I drink pain in every delight
And poison in every wine;
I never knew it would be so bitter
To be alone,
Alone, without you.
.

(Translated by James Wright)

Hermann Hesse

2 July 1877 – 9 August 1962

German-Swedish Poet, Novelist

Poem Courtesy: http://www.poemhunter.com/poem/without-you-2/#content

ఆమె జవాబు… సర్ వాల్టర్ రాలీ, ఇంగ్లీషు కవి

 ప్రేమా, ఈ అనంత ప్రపంచమూ ప్రాయంలోనే ఉండి 

ప్రతి పశుకాపరి నాలుకమీదా నిజమే తారాడితే,

ఈ ఇంపైన సుఖాలు నన్ను వశం చేసుకుని

నీ ప్రేయసినై, నీతో జీవించేలా చేసి ఉండేవి.

 

కానీ కాలం మందల్ని పొలం నుండి పొలానికి తరుముతుంటుంది, 

నదులు వరదలై పొంగుతాయి, రాళ్ళు చల్లబడతాయి;

కోయిలకూడా మూగబోతుంది; మిగతావాళ్ళు 

జీవితం ఎలా వెళ్లదీయాలా అన్న చింతలో ఉంటారు.

 

పువ్వులు వాడిపోతాయి; విధేయతలేని పొలాలు

నిలకడలేని హేమంతానికి తలఒగ్గుతాయి;

పెదాలపై తేనె, మనసులో విషం,

ఊహకి వసంతమే గాని, దుఃఖానికి దారితీస్తాయి.

 

నీ తుపాకులు, నీ జోళ్ళు, నీ పూలపాంపులూ

నీ టోపీ, నీ ఉడుపులూ, నీ సింగారాలూ

త్వరలోనే క్షీణించి, నశించి మరుగైపోతాయి.

వెర్రి ముదిరినపుడు, తెలివి మందగిస్తుంది.

 

నీ తృణమేఖలలూ, అందులో అందమైన మొగ్గలూ,

నీ పగడాల వస్త్రాలూ, పసుపువన్నె బొత్తాములూ

ఇవేవీ ఏ కోశానా నా మనసును చూరగొని

నీదాన్ని చేసి, నీ భార్యగా చెయ్యలేవు.

 

యవ్వనం శాశ్వతమై, ప్రేమ నిరంతరం చిగుర్చగలుగుతే

ఆనందానికి కాలనియమాలు లేక, వయసు అవుసరం లేకపోయి ఉంటే

బహుశా ఈ ఆనందాలు నన్ను మైమరపించి

నీ భార్యనై, నీతో జీవించేట్టు చేసి ఉండేవి.

.

సర్ వాల్టర్ రాలీ

1554 – 29 October 1618

ఇంగ్లీషు కవి

.

ఎలిజబెత్ మహారాణి ఈ హయాం లో ఒక వెలుగు వెలిగిన వ్యక్తి సర్ వాల్టర్ రాలీ. ఆమెకి ప్రీతిపాత్రుడుగా, యుధ్ధతంత్ర నిపుణుడిగా, నావికుడిగా, అన్వేషకుడిగా, గూఢచారిగా, కవిగా అనేక పాత్రలు నిర్వహించి ఆమెవల్ల అనేకలాభాలు పొందిన వ్యక్తి. El Dorado కల్పితపట్టణానికి కారణం అతని సాహసయాత్రలను అతిశయోక్తులతో కూర్చి చెప్పిన కథనమే. అతను బ్రిటిషు గయానా, వెనిజులా తూర్పు ప్రాంతాలను కూడ బంగారంకోసం అన్వేషించాడు. ఎలిజబెత్ మహారాణి మరణం తర్వాత  జేమ్స్ I  మహరాజుపై కుట్రపన్నేడన్న అభియోగంతో 1618 లో అతను శిరచ్ఛేదానికి గురి అయ్యాడు.

Her Reply

.

If all the world and love were young,

And truth in every shepherd’s tongue,

These pretty pleasures might me move

To live with thee and be thy Love.

But Time drives flocks from field to fold;

When rivers rage and rocks grow cold;

And Philomel becometh dumb;

The rest complains of cares to come.

The flowers do fade, and wanton fields

To wayward Winter reckoning yields:

A honey tongue, a heart of gall,

Is fancy’s spring, but sorrow’s fall.

Thy gowns, thy shoes, thy beds of roses,

Thy cap, thy kirtle, and thy posies,

Soon break, soon wither—soon forgotten,

In folly ripe, in reason rotten.

Thy belt of straw and ivy-buds,

Thy coral clasps and amber studs,—

All these in me no means can move

To come to thee and be thy Love.

But could youth last, and love still breed,

Had joys no date, nor age no need,

Then these delights my mind might move

To live with thee and be thy Love.

.

Sir Walter Raleigh.

1554 – 29 October 1618

The Oxford Book of English Verse: 1250–1900.

Ed: Arthur Quiller-Couch, 1919.

http://www.bartleby.com/101/122.html

వాళ్ళు నిద్రించే చోట… జీ. ఓ. వారెన్, అమెరికను కవి

నల్లగా నిశ్చలంగా చుట్టబెట్టుకున్న పొగమంచు
పోటెత్తిన సముద్రం ఒడ్డు ఇసుకను ముంచెత్తినట్టు
దట్టమైన సమాధుల్లో లోతుగా వ్యాపించి
వాళ్ల శిరసులపై నక్షత్రధూళి నింపుతోంది.

వాళ్ళు నిద్రిస్తూ చాలా కాలమయింది.
వాళ్ళ తనుమృత్తికి ఏదో తెలియని బూజుపట్టింది.
వాళ్ళ గురించి చెప్పగలిగిందేమైనా ఇంకా ఉంటే,
కొద్దికొద్దిగా శిధిలమౌతున్న ఆ రాళ్లు చెప్పగలవు.

దారి తప్పి ప్రయాణిస్తున్న ఒంటరి నావికుడిలా
మేరలేని ఎటో తేలుతున్న పొగమంచులో
ఈ మునుగుతున్న సమాధులపై వాలి చూస్తూ
నేనూ ఇక్కడకు చేరవలసిందేగదా అని యోచిస్తున్నాను.

అక్కడ నిత్యమూ నిశీధి తరగలూ, ఈ నేలా
నా ఏకాంత విశ్రాంతి మందిరాన్ని మరుగుపరుచును గాక!
ఆ సమాధి ఫలకంపై ఉన్న మాటల్ని
నా ప్రేమిక మరిచిపోయేలా కాలం అనుగ్రహించుగాక. 

.

జీ. ఓ. వారెన్

అమెరికను కవి

 

Where They Sleep

 .

The fog inrolling, dark and still      

Lies deep upon the crowded dead       

As flooding sea upon the sands,         

And quenches starlight overhead.       

 

Long have they slept. Their separate dust

Has mingled with a nameless mould.  

Only the slower-crumbling stones      

Still tell so much as may be told.         

 

And now in shoreless fog adrift

Like some lone mariner gliding by,            

I lean above the drowning graves       

And wonder when I too shall lie         

 

Where evermore the tides of night      

And earth will hide my lonely rest;     

And Time will bid my love forget             

To read the stone upon my breast.

.

G O. Warren

American

Poem Courtesy:

Anthology of Massachusetts Poets.  1922.

Ed: William Stanley Braithwaite, (1878–1962). 

http://www.bartleby.com/272/87.html

 

సోమరితనం… ఎస్. వి. మిచెల్, అమెరికను కవి

గడిచిపోయిన క్షణాలను అమితంగా ప్రేమించడంలో

నన్ను మించినవాడు లేడు.

నేను బద్ధకంగా విచ్చుకునేపూలని

మించిన బద్ధకస్తుణ్ణి;

గాలల్లాడని కందకంలో నీటి కన్నా,

మధ్యాహ్నం నీటిమీద బద్ధకంగా తేలే

లిల్లీల కన్నా బద్ధకంగా పడుకోగలను;

ఇంతవరకు ఎన్నడూ కదిలిన ఛాయలు లేని

ఏ శిలాఫలకం కన్నా

నిశ్చలంగా ఉండగలను;

నాకు అనిపిస్తుంటుంది

అమాయకపు ఆనందం అందిచ్చే

అద్భుతమైన వరాలన్నిటినీ

నా అచంచలమైన సోమరితనం ఇస్తుంటుందని.

.

 ఎస్. వి. మిచెల్

February 15, 1829 – January 4, 1914

అమెరికను కవి

 

 

.

.

Idleness

.

 

There is no dearer lover of lost hours

Than I.

I can be idler than the idlest flowers;

More idly lie

Than noonday lilies languidly afloat,

And water pillowed in a windless moat.

And I can be

Stiller than some gray stone

That hath no motion known.

It seems to me

That my still idleness doth make my own

All magic gifts of joy’s simplicity.

.

 Silas Weir Mitchell

February 15, 1829 – January 4, 1914

American Writer and Physician

 

Poem Courtesy:

An American Anthology, 1787–1900.  1900

Ed: Edmund Clarence Stedman, (1833–1908). 

http://www.bartleby.com/248/522.html

 

నాటకం చూస్తున్నపుడు నా వెనక కూచున్నామెకు… ఏ పీ హెర్బర్ట్, ఇంగ్లీషు కవి

 అమ్మా! మీరు ఈ నాటకం చూసేరు,

నేనివాళ వరకు చూడలేదు;

మీకు నాటకంలో సన్నివేశాలన్నీ తెలుసు,

కానీ, నాకు తెలీవని మనవి చేస్తున్నాను.

చివరి వరకు హంతకుడెవడో ప్రేక్షకుడికి

తెలియకుండా ఉంచడమే రచయిత ఉద్దేశ్యం.

మీరిలా చెప్పుకుంటూ పోతుంటే

మీరు అతనికి అన్యాయం చేసినవాళ్ళు అవుతారు. 

నటులు తమ తమ ప్రత్యేకమైన శైలిలో

చాలా హాస్యాన్ని పండిస్తుంటారు

మీరు ముందుగానే ఏమిచెయ్యబోతున్నారో చెప్పెస్తే

అందులోని సరసత ఆస్వాదించే అవకాశం నాకు ఉండదు.

ఒక నాటకంలో ఉండే కుతూహలం అంతా, నాకు తెలిసి

ప్రేక్షకుడి ఊహకి రహస్యం త్వరగా దొరక్కుండా ఉంచడంలోనే;   

మీరు అంతా పూర్తిగా చెప్పెస్తున్నారు గనుక

ఇక అందులో ఊహించనిది జరిగే ఆస్కారమే లేదు

మీతో పాటు వచ్చిన స్త్రీ కూడా

మీలాగే తెలివితక్కువదిలా కనిపిస్తోంది.

కానీ ఆవిడ సహకారం లేకుండానే

కథని నేను అర్థం చేసుకోగలను.

క్లుప్తంగా చెప్పాలంటే, తల్లులారా,

మీరు మాటాడకుండే కూచుంటే మీకూ నాకూ మంచిది. 

చివరగా మరొక్క మాట… 

నా మెడమీద వాలి మరీ చూడకండి. 

.

ఏ. పీ. హెర్బర్ట్

ఇంగ్లీషు రచయిత

 

 Sir AP Herbert

At the Theatre: To the Lady Behind Me

Dear Madam, you have seen this play;

I never saw it till today.

You know the details of the plot,

But, let me tell you, I do not.

The author seeks to keep from me

The murderer’s identity,

And you are not a friend of his

If you keep shouting who it is.

The actors in their funny way

Have several funny things to say,

But they do not amuse me more

If you have said them just before;

The merit of the drama lies,

I understand, in some surprise;

But the surprise must now be small

Since you have just foretold it all.

The lady you have brought with you

Is, I infer, a half-wit too,

But I can understand the piece

Without assistance from your niece.

In short, foul woman, it would suit

Me just as well if you were mute;

In fact, to make my meaning plain,

I trust you will not speak again.

And—-may I add one human touch?—-

Don’t breathe upon my neck so much.

A P Herbert

 24 September 1890 – 11 November 1971

English Humorist, Novelist, Playwright and Member of Parliament

చొక్కా గీతం… థామస్ హుడ్, ఇంగ్లీషు కవి

వేళ్ళు అరిగి అరిగి నీరసించి

కనురెప్పలు ఎర్రబడి బరువెక్కి

స్త్రీకి యోగ్యం కాని చింకిపాతలలో

పాపం ఒక స్త్రీ, కూచుని

ఆమె సూదినీ దారాన్నీ లాక్కుంటూ

ఒక కుట్టు, రెండో కుట్టు, మూడో కుట్టు వేసుకుంటూ

పేదరికంతో, ఆకలితో, మురికిలో

విషాదము నిండిన గొతుతో

ఈ “చొక్కా గీతం” ఆలపించ సాగింది..

 

పని ! పని ! పని!

ఉదయం దూరంగా ఎక్కడో కోడికూయడం మొదలు

పని! పని ! పని!

రాత్రి చూరులోంచి నక్షత్రాలు కనిపించేదాకా!

అబ్బ! బానిసగా బ్రతకడం

అందులో ఒక మోటు, గర్విష్ఠి దగ్గర

ఈ పనే సేవ అనుకున్నప్పుడు

ఏ ఆడదానికీ మోక్షం లేదు..

 

పని! పని! పని!

తల తిరిగేదాకా పని!

ఓని! పని! పని!

కళ్లు బరువెక్కి చూపు మందగించేదాకా!

కుట్టూ, బకరం, పట్టీ,

పట్టీ, బకరం, కుట్టూ

చివరకి గుండీలమీద నిద్రొచ్చి వాలిపోయేదాకా!

ఇక కలల్లోనే వాటికి కుట్టడం.. 

 

ఇష్టమైన అక్కచెల్లెళ్ళున్న సోదరులారా!

తల్లులూ, భార్యలూ ఉన్న పురుషులారా!

మీరు ధరిస్తున్నది వస్త్రాలు కావు

అక్షరాలా సాటి జీవుల ప్రాణాలు!

కుట్టు– కుట్టూ- కుట్టు

పేదరికంలో, ఆకలిలో, మురికిలో

రెండు దారాలతో ఏకకాలంలో

ఒక పక్క చొక్కా, మరో పక్క కఫన్.   

 

నేను చావుగురించెందుకు మాటాడుతున్నాను

భయంకరమైన ఎముకల పోగు గురించి?

నాకిప్పుడు ఆ వికృతరూపమంటే భయం లేదు,

అదిప్పుడు నాలాగే ఉంటుంది

అది అచ్చం నా లాగే ఉంటుంది

ఇప్పుడు నే చేసే కటిక ఉపవాసాలవల్ల;

దేముడా! ఎంత చిత్రం, రొట్టె అంత ఖరీదైపోయి

రక్త మాంసాలు అంత వెలతక్కువవీ అయిపోయాయా?

పని! పని! పని!

నా శ్రమకి అలుపన్నది లేదు;

దానికి కూలి ఏమిటి? గడ్డి పరుపు

ఒక రొట్టె ముక్క… నాలుగు గుడ్డపీలికలు.

అదిగో పాడుబడ్డ ఇంటి కప్పు- ఇదిగో వట్టి నేల

ఒక మేజా- విరిగిపోయిన కుర్చీ

ఖాళీ గోడ… అప్పుడప్పుడు కనీసం

నా నీడైనా దానిమీదపడుతోందని సంతోషిస్తాను.

 

పని! పని! పని!

పగలు లేచినదగ్గరనుండి రాత్రి అలసి

గంటకొట్టీదాకా పని! పని! పని!

ఖైదీలు నేరానికి శిక్షగా పనిచేసినట్టు! 

కుట్టూ, బకరం, పట్టీ,

పట్టీ, బకరం, కుట్టూ 

గుండె బలహీనమై, చేతికి స్పర్శపోయినట్టు

చివరకి మెదడుకూడా చచ్చుపడిపోయేదాకా!

 

పని! పని! పని!

కనీకనిపించని డిశంబరు వెలుతురులోనూ;

పని! పని! పని!

వాతావరణం వెచ్చగా వెలుతురు ఉన్నపుడూ; 

ఇంటి చూరుల క్రింద

పొదగబోతున్న పిచ్చుకలు గూడుపెట్టి

వాటి మెరుస్తున్న మేనులు చూపిస్తూ

వసంతం రాగానే వెక్కిరిస్తూ పోతాయి.

 

ఓహ్! ఒక్క సారి ఆ మల్లెలానో, 

సన్నజాజిలానో జీవిస్తే ఎంతబాగుంటుంది

నెత్తిమీద వినీలాకాశంతో

పాదాలకింద పచ్చని నేలతో

లేమి అంటే ఏమిటో బాధ తెలియక ముందు

ఒకపూట తిండికి ఎంతకష్టపడాలో తెలియక

ఒకప్పుడు నేను అనుభూతి చెందినప్పటిలా

ఒక ఘడియ సేపయితే మాత్రం ఏమి?

 

ఓహ్! క్షణికమైన ఒక గంట చాలు!

ఎంత చిన్నపాటి విశ్రాంతి దొరికినా చాలు!

ఆశకోసమో, ప్రేమకోసమో విరామం కాదు

కేవలం దుఖాన్ని వెళ్ళగక్కుకుందికి!

కాసేపు రోదించినా గుండెకొంత తేలికౌతుంది నాకు

కానీ కన్నీళ్ళతో తడిసిన ఆ పక్కమీదే

నా ఏడుపు ఆపుకోవాలి. ఎందుకంటే ప్రతి కన్నీటిచుక్కా

నా సూదినీ దారాన్నీ కనిపించకుండా అడ్డుపడుతుంది.

 

వేళ్ళు అరిగి అరిగి నీరసించి

కనురెప్పలు ఎర్రబడి బరువెక్కి

స్త్రీకి యోగ్యం కాని చింకిపాతలలో

పాపం ఒక స్త్రీ, కూచుని

ఆమె సూదినీ దారాన్నీ లాక్కుంటూ

ఒక కుట్టు, రెండో కుట్టు, మూడో కుట్టు వేసుకుంటూ

పేదరికంతో, ఆకలితో, మురికిలో

విషాదము నిండిన గొతుతో

ఈ “చొక్కా గీతం” ఆలపించ సాగింది.

ఈ పాట ధనికుల చెవుల సోకుతుందా?

.

థామస్ హుడ్

23 May 1799 – 3 May 1845

ఇంగ్లీషు కవి

ఇది  ఊహాత్మక కథనం కాదు. Mrs Biddell అని లండనులో  “Lambeth” అనే ఒక చిన్న సబర్బ్ లో దీనాతి దీన మైన పరిస్థితులలో మగ్గుతూ చొక్కాలు కుట్టుకుని జీవనం గడిపే స్త్రీ గురించి రాసిన కవిత ఇది. ఈ కవిత మొదటిసారి 1843లో “Punch”  అనే పత్రిక క్రిస్మస్ సంచికలో మారుపేరుతో ప్రచురించబడింది. తక్షణమే బహుళప్రచారంలోకి రావడమే గాక,   Mrs Biddell తోపాటు ఆమెలాంటి దుర్భరమైన జీవితం గడుపుతున్న అనేకమంది స్త్రీ కార్మికుల  జీవితాలపై ప్రజల దృష్టి మళ్ళించేలా చెయ్యగలిగింది. ఆ రోజుల్లో ఇంగ్లండులో, మనదేశంలో బీడీ కార్మిక స్త్రీలలాగ, 2 పౌండ్లు డిపోజిట్ కడితే గాని స్త్రీలకు ఇంటిదగ్గర పేంట్లూ, చొక్కాలూ కుట్టే పని ఇచ్చేవారు కాదు.  దానికి నామమాత్రం కూలి దొరుకుతుండేది.  తన పిల్లలకి తిండి పెట్టలేని స్థితిలో తనుకుట్టే బట్టలనే కుదవబెట్టి తీర్చుకోలేని అప్పుతెచ్చుకుంది మగదక్షతలేని Mrs Biddell. అప్పుతీర్చలేకపోవడంతో చివరలి ఆమెను చట్టప్రకారం “Work house”  కి తరలించారు. ఆమె గతి చివరకి ఏమయ్యిందో ఎవరికీ తెలీదు. అయితేనేమి, ఆమె జీవితం, వారానికి 7 రోజులూ కష్టపడుతున్నప్పటికీ తమ జీవితాలలో ఏ మార్పూ లేకుండా దుర్భరమైన పరిస్థితులలో నామమాత్రంగా బ్రతికే అనేకానేకమంది కార్మికుల జీవితాల ప్రక్షాళనకి ఒక వెలుగురేక అయింది.

అందమైన ఆహ్లాదకరమైన ప్రకృతే కాదు, దుర్భరమైన పరిస్థితులలో బ్రతికే సాటి మనుషుల జీవితాలను చూసినపుడుకూడా  కవిమనసు తాదాత్మ్యంతో ప్రతిస్పందించాలి.     

.

The Song of the Shirt

 

WITH fingers weary and worn,
With eyelids heavy and red,
A woman sat, in unwomanly rags,
Plying her needle and thread–
Stitch! stitch! stitch!
In poverty, hunger, and dirt,
And still with a voice of dolorous pitch
She sang the “Song of the Shirt.”

“Work! work! work!
While the cock is crowing aloof!
And work–work–work,
Till the stars shine through the roof!
It’s Oh! to be a slave
Along with the barbarous Turk,
Where woman has never a soul to save,
If this is Christian work!

“Work–work–work
Till the brain begins to swim;
Work–work–work
Till the eyes are heavy and dim!
Seam, and gusset, and band,
Band, and gusset, and seam,
Till over the buttons I fall asleep,
And sew them on in a dream!

“Oh, Men, with Sisters dear!
Oh, men, with Mothers and Wives!
It is not linen you’re wearing out,
But human creatures’ lives!
Stitch–stitch–stitch,
In poverty, hunger and dirt,
Sewing at once, with a double thread,
A Shroud as well as a Shirt.

“But why do I talk of Death?
That Phantom of grisly bone,
I hardly fear its terrible shape,
It seems so like my own–
It seems so like my own,
Because of the fasts I keep;
Oh, God! that bread should be so dear,
And flesh and blood so cheap!

“Work–work–work!
My labour never flags;
And what are its wages? A bed of straw,
A crust of bread–and rags.
That shatter’d roof–and this naked floor–
A table–a broken chair–
And a wall so blank, my shadow I thank
For sometimes falling there!

“Work–work–work!
From weary chime to chime,
Work–work–work–
As prisoners work for crime!
Band, and gusset, and seam,
Seam, and gusset, and band,
Till the heart is sick, and the brain benumb’d.
As well as the weary hand.

“Work–work–work,
In the dull December light,
And work–work–work,
When the weather is warm and bright–
While underneath the eaves
The brooding swallows cling
As if to show me their sunny backs
And twit me with the spring.

“Oh! but to breathe the breath
Of the cowslip and primrose sweet–
With the sky above my head,
And the grass beneath my feet,
For only one short hour
To feel as I used to feel,
Before I knew the woes of want
And the walk that costs a meal!

“Oh! but for one short hour!
A respite however brief!
No blessed leisure for Love or Hope,
But only time for Grief!
A little weeping would ease my heart,
But in their briny bed
My tears must stop, for every drop
Hinders needle and thread!”

With fingers weary and worn,
With eyelids heavy and red,
A woman sat in unwomanly rags,
Plying her needle and thread–

Stitch! stitch! stitch!
In poverty, hunger, and dirt,
And still with a voice of dolorous pitch,–
Would that its tone could reach the Rich!–
She sang this “Song of the Shirt!”

.

Thomas Hood

23 May 1799 – 3 May 1845

English Poet

I would be watching them two…Kuppili Padma, Telugu, Indian

Sometimes

Forgetting the time

Sometimes

To forget the time

 

When they two

Sweep about the garden

Like two

Little butterflies;

And like two buoyant fish

When they swim

In the bluish swimming pool.

 

That lone girl

Becomes a bond

Akin to a red ribbon

Tasseling two-braids …

And a colourful cloud

Raining endless showers

Of love…

 

The two…

Scating, chatting, eating, riding, writing 

Whatever be the hour

Running one behind the other

Inseparably

Like a merry-go-round

In that garden.

 

No one knows

Who is happier in the piggy ride?

Who gleams like a rainbow

On the other’s smile?

Or,

Who hides and who seeks?

 

Time and again

My looks get

Riveted to them.

 

That moony little nymph

Teeming with effervescent child spirit

That waxing little

Crescent moon … all smiles.

And in her steps follows

Himself becoming a shield

For all seasonal elements

That youthful father

A prop

A support

A cover for her to grow on.

 

I would be watching those two

 

Sometimes

Forgetting the time

Sometimes

To forget the time.

 

Kuppili Padma.

Telugu

Indian

Kuppili Padma Short story writer, Poet

Kuppili Padma

Kuppili Padma is a popular columnist, short story writer and novelist in  Telugu. She is presently  the Creative Head at Electronic Media and lives in Hyderabad (Deccan). She is running a personal blog Mayura ( https://kuppilipadma.wordpress.com/) since Sept 2012. 

She has published many anthologies and received  Chaso Puraskaram in 2009.

వాళ్ళిద్దరిని చూస్తుంటాను

 

వొక్కోసారి సమయాన్ని

మరచిపోయి

వొక్కోసారి సమయాన్ని

మరచిపోవడానికి.

 

వారిద్దరూ

పూలవనమంతా

కలయ తిరుగుతోంటే

రెండు పసి తుమ్మెదల్లా

నీలినీలి కొలనులో

యీత కొడుతున్నప్పుడు

చురుగ్గా యెగిరె చేపపిల్లల్లా

 

వొకే బాలిక

రెండు జడల

యెర్రరిబ్బన్ కుచ్చులా

అనుబంధమై

అనేక రంగుల మబ్భులు

పల్లవించే

అనురాగ జల్లులై

స్కేటింగ్ చాటింగ్ యీటింగ్ రైడింగ్ రైటింగ్ …

యెదైన సరే

అన్ని వేళ

అల్లిబిల్లిగా

వొకరి వెంట మరొకరు

వుధ్యానవనంలో తిరిగే

రంగుల రాట్నంలా

వారిద్దరూ

 

యెవరి వీపు మీద

యెవరు

వుప్పు మూటో

యెవరి పెదవుల ఆకాశాన

యెవరు నవ్వుల యింద్రధనస్సో

యెవరి చేతివేళ్ళ మైదానంలో

యెవరు వీరివీరి గుమ్మడి పండో

 

మళ్ళీ మళ్ళీ

చూస్తుంటాను

అదే పనిగా

పసితనాన్ని

నింపుకొంటున్న

ఆ నిండు చందమామని

దినదిన ప్రభార్ధమానమవుతోన్న

ఆ పసి నెలవంకని

ఆ చిట్టితల్లి వెన్నంటే

కదిలే

ఆరు రుతువుల

గొడుగై

ఆ బుజ్జితండ్రి

ఆ చిన్నారినాన్న మిన్నంటే

విరిసే

శతపత్ర ఆశల

పందిరై

ఆ చిట్టితండ్రి

 

వాళ్ళిద్దరిని చూస్తుంటాను

వొక్కోసారి సమయాన్ని

మరచిపోయి

వొక్కోసారి సమయాన్ని

మరచిపోవడానికి —

 

కుప్పిలి పద్మ.

An Ordinary Day in an Ordinary Street… V. Chinaveerabhadrudu, Telugu, Indian

About ten in the morning, the trees are

Still lazying under the thick foggy veil.

The young sprouting leaves peep through

Like the hanging jukas from earlobes.

 
The early buzz for the daily grind

of Autos, the picking up traffic,

Children reaching out their schools,

Is like attuning for an imminent concert.

 
Stepping out as usual into the street

That looks as usual, I thought:

Though I seemingly walk here,

I am walking, in fact, not at all here.

 
I cross many paths once more

I crossed once before;

I am pilgrimaging and returning

Time and again to some ancient rendezvous.

 
It’s an ordinary morning in a very ordinary street.

But no sooner than I turned my eyes within,

Oh! People from hoary past and trodden paths

had unveiled a world of their own for me.

.

Vadrevu Chinaveerabhadrudu.

Vadrevu  Chinaveerabhadrudu
Vadrevu Chinaveerabhadrudu

మామూలు వీధిలో ఒక మామూలు ఉదయం

.

ఉదయం పదిగంటల వేళ, వీధిలో-

ముతక దుప్పటిలోనే ముణగదీసుకున్న చెట్లు

బయటకి కనబడుతున్న చెవిలోలాకుల్లా

తొంగిచూస్తున్న చివురాకులు.

  
ఆటోలు, పెరుగుతున్న రాకపోకలు,

బడికి చేరుకుంటున్న పిల్లలు

కచేరీకి శృతిచేసుకుంటున్నట్టు

రోజువారీ జీవితపు తొలి అలజడి

 
ఎప్పట్లానే కనిపిస్తున్న వీధిలో

ఎప్పట్లానే అడుగుపెడుతూ అనుకున్నాను

నే నిప్పుడీ వీధిలో నడుస్తున్నానేగాని

నిజానికి నడుస్తున్నదిక్కడ కానేకాదని.

 
 
దాటివచ్చిన ఒకప్పటి దారులెన్నిటినో

మళ్ళీ దాటుతున్నానని.

ఏ ప్రాచీనక్షేత్రాలకో పునఃపునః

పయనమవుతున్నానని, తిరిగివస్తున్నానని.

 
 
మామూలు వీధిలో ఒక మామూలు ఉదయం

నా చూపు లోపలికి తిప్పానో లేదో

ఎక్కడెక్కడి వీధుల్లోంచో ఎప్పటెప్పటి వాళ్లంతా

నా కోసమొక లోకాన్ని నేలకు దించేసారు.

 
 చినవీరభద్రుడు

ప్రభాతం… జాన్ ఫోర్డ్, ఇంగ్లీషు కవి

నిద్ర మరపించే కష్టాలను కాపుకాసే
నీడలారా! ఇక్కడనుండి తక్షణం పారిపొండి!

కళ్ళు బరువెక్కి మూసుకుపోయినా
మనసుమాత్రం మేలుకునే ఉంటుంది;
అంతులేని బాధలూ బాధ్యతలతో
బందీలైన ఆలోచనల వలలో చిక్కుకుని;
ప్రేమలూ దుఃఖాలూ ప్రశాంతతనీయడం కంటే
నిట్టూర్పులతోనే వ్యక్తమవుతుంటాయి

నిద్ర మరపించే కష్టాలను కాపుకాసే
నీడలారా! ఇక్కడనుండి తక్షణం పారిపొండి!

.

జాన్ ఫోర్డ్

(1586–c. 1640)

ఇంగ్లీషు కవి

.

Dawn

 

Fly hence, shadows, that do keep       

Watchful sorrows charmed in sleep!   

Tho’ the eyes be overtaken,      

Yet the heart doth ever waken  

Thoughts chained up in busy snares           

Of continual woes and cares:    

Love and griefs are so exprest  

As they rather sigh than rest.    

  Fly hence, shadows, that do keep     

  Watchful sorrows charmed in sleep. 

.

John Ford

(1586–c. 1640)

The Book of Elizabethan Verse.  1907.

Ed: William Stanley Braithwaite.

http://www.bartleby.com/331/2.html

కటీఫ్… యెవగనీ యెటుషెంకో, రష్యను కవి

నాకు ప్రేమంటే విరక్తి వచ్చింది; మన కథకి పేలవమైన ముగింపు,
జీవితమంత నిరుత్సాహంగా, సమాధి అంత కళావిహీనంగా.
మన్నించు… ఈ ప్రేమగీతాన్ని ఇక్కడితో ఆపేస్తున్నాను
గిటారు పగలగొడుతున్నా, మనిద్దరికీ దాచుకుందికి ఏవీ లేవు. 

కుక్కపిల్లకేం తోచడం లేదు. ఆ బొచ్చుకుక్కకి చిన్నవిషయాన్ని
మనం ఎందుకు అంత క్లిష్టం చేసుకుంటున్నామో అర్థంకావటం లేదు.
అది నీ గది ముందుకొచ్చి మూలుగుతుంది. పోనీలే అని వెళ్లనిస్తాను. 
అది నా నా గది తలుపులు గోకినపుడు, నువ్వే వెళ్ళిపోతావు. 

ఓ కుక్కా! సున్నితమైన ఆవేశాలు గలదానా,
ఇలా ఆ గదికీ ఈ గదికీ పరిగెడుతుంటే నీకు పిచ్చెక్కుతుంది
నీకు ఈ పురాతనమైన భావన అర్థం కాదు,
అయిపోయింది, ఇక్కడితో సరి, కథ ముగిసింది, సమాప్తం, మంగళం.

నువ్వు సున్నితంగా ఆలోచిస్తున్నకొద్దీ, అప్పటిలాగే
“ప్రేమ పరిరక్షణ” అనే అద్భుతమైన నాటక ఆడాల్సి వస్తుంది.
“మన్నించడాలు” గుసగుసమంటాయి, దాని ప్రతిధ్వనులకై ఆసగా ఎదురుచూస్తాం,
కాని ఆవరించిన నిశ్శబ్దంలోంచి ఏదీ వెనుతిరిగి రాదు.

కనుక ప్రేమను మొదట్లోనే కాపాడుకోవడం మంచిది,
“ఎన్నడూ విడిపోం” శాశ్వతంగా కలిసుంటాం” వంటివి వాడకూడదు;
రైలు చక్రాలు ఏమిటి మొత్తుకుంటాయో పట్టించుకోవాల్సి ఉంది:
“ఎప్పుడూ ప్రమాణాలు చెయ్యొద్దు,” అవి తులాదండాల్లా ఊగుతుంటాయి.

మనం విరిగిపోయిన కొమ్మలు గుర్తుంచుకోవాల్సింది
ఆకాశం నిండా ముక్కలైన మేఘాల్ని గమనించాల్సింది
తెలివితక్కువగా ప్రేమ నటించే ప్రేమికుల్ని హెచ్చరించాల్సింది:
ఎంత ఎక్కువ ఆశపడితే, అంత ఎక్కువగా అబద్ధమని తేలుతుంది,” అని.

ప్రేమలో నిజమైన అనురాగం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడం
భరించవలసిన ప్రతి బంధాన్నీ జాగ్రత్తగా చూసుకోడం;
ఆమెకు నువ్వు స్వర్గాన్ని వాగ్దానం చెయ్యకు; అరెకరం సూచించు;
“జీవితాంతం” అనకు, కనీసం మరుసటి సంవత్సరం వరకైనా చాలు.

పదే పదే, “నిన్ను ప్రేమిస్తున్నా, నిన్ను ప్రేమిస్తున్నా” అనకు
ఆ చిన్న వాక్యం జీవితకాలం వెన్నాడుతుంది…
ఓ రోజు ఎప్పుడైనా నీకు ప్రేమ తగ్గి, గుర్తుచేసుకున్నప్పుడు,
అది కందిరిగలా కుట్టడమో, కత్తిలా దిగబడడమో చేస్తుంది.

అలా… మా కుక్కపిల్ల మతి పోయినట్టై
ఆ తలుపుకీ ఈ తలుపుకీమధ్య వస్తూ పోతూంది.
నిన్ను వదిలేసేను కనుక “క్షమించు” అని అడగను. కానీ,
ఒకందుకు క్షమాపణ చెబుతాను: ఒకప్పుడు నిన్ను ప్రేమించినందుకు.

.

యెవగనీ యెటుషెంకో

18th July 1932

రష్యను కవి

 

.

Breaking Up

.

I fell out of love: that’s our story’s dull ending,

as flat as life is, as dull as the grave.

Excuse me — I’ll break off the string of this love song

and smash the guitar. We have nothing to save.

 

The puppy is puzzled. Our furry small monster

can’t decide why we complicate simple things so —

he whines at your door and I let him enter,

when he scratches at my door, you always go.

 

Dog, sentimental dog, you’ll surely go crazy,

running from one to the other like this —

too young to conceive of an ancient idea:

it’s ended, done with, over, kaput. Finis.

 

Get sentimental and we end up by playing

the old melodrama, “Salvation of Love.”

“Forgiveness,” we whisper, and hope for an echo;

but nothing returns from the silence above.

 

Better save love at the very beginning,

avoiding all passionate “nevers,” “forevers;”

we ought to have heard what the train wheels were shouting,

“Do not make promises!” Promises are levers.

 

We should have made note of the broken branches,

we should have looked up at the smokey sky,

warning the witless pretensions of lovers —

the greater the hope is, the greater the lie.

 

True kindness in love means staying quite sober,

weighing each link of the chain you must bear.

Don’t promise her heaven — suggest half an acre;

not “unto death,” but at least to next year.

 

And don’t keep declaring, “I love you, I love you.”

That little phrase leads a durable life —

when remembered again in some loveless hereafter,

it can sting like a hornet or stab like a knife.

 

So — our little dog in all his confusion

turns and returns from door to door.

I won’t say “forgive me” because I have left you;

I ask pardon for one thing: I loved you before.

.

Yevgeny Yevtushenko

18th July 1932

Russian Poet

%d bloggers like this: