అనువాదలహరి

దేవుని వరాలు… జార్జి హెర్బర్ట్, వెల్ష్ కవి

దేముడు మొదట మనిషిని సృష్టించినపుడు
ప్రక్కన ఒక గ్లాసునిండా వరాలు ఉంచుకున్నాడు,
తనలో తాను “మనం మనదగ్గర ఉన్నదంతా ఇచ్చెద్దాం.
చెల్లా చెదరుగా ఉన్న సృష్టిలోని సంపదలన్నీ
ఒక్కచోటకి పోగుపడనిద్దాం” అనుకున్నాడు.

అనడమే తడవు, ముందు బలం దారి తీసింది;
అందం దాన్ని అనుసరించింది, తర్వాత వివేకం, కీర్తి, ఆనందం:
ఉన్నవన్నీ అయిపోయిన తర్వాత, దేముడు ఒక క్షణం ఆగేడు,
అన్ని సంపదలలోకీ అట్ట అడుగున
“విశ్రాంతి” పడిఉండడం గమనించేడు.

ఇలా అనుకున్నాడు: నా జీవికి
ఈ వరాన్ని కూడా అనుగ్రహించేనా,
అతడు నా వరాల్ని పూజిస్తాడు నన్ను విడిచిపెట్టి;
అతను ప్రకృతిలో విశ్రాంతి తీసుకుంటాడు నాలో బదులుగా;
దాని వల్ల ఇద్దరం నష్టపోతాం.

అయినా సరే, విశ్రాంతి అతనికి వదిలెస్తాను
కాకపోతే దాన్ని బాధతో కూడిన అశాంతితో జతచేస్తాను.
అతను సంపన్నుడయినా అలసిపోవును గాక. దాని వల్ల,
సద్బుద్ధి అతన్ని నాదగ్గరకి తీసుకు రాకపోయినా
కనీసం, అతని అలసటైనా నా దగ్గరకి తీసుకు వస్తుంది.
.
జార్జి హెర్బర్ట్

3 ఏప్రిల్ 1593 – 1 మార్చి 1633

వెల్ష్ కవి

  .

George Herbert

.

The Gifts of God

.

When God at first made man,
Having a glass of blessings standing by,
Let us (said he) pour on him all we can:
Let the world’s riches, which dispersed lie,
Contract into a span.

So strength first made a way;
Then beauty flowed, then wisdom, honor, pleasure:
When almost all was out, God made a stay,
Perceiving that, alone, of all his treasure,
Rest in the bottom lay.

For if I should (said he)
Bestow this jewel also on my creature,
He would adore my gifts instead of me,
And rest in Nature, not the God of Nature:
So both should losers be.

Yet let him keep the rest,
But keep them with repining restlessness:
Let him be rich and weary, that, at least,
If goodness lead him not, yet weariness
May toss him to my breast.

.
George Herbert
3 April 1593 – 1 March 1633
Welsh Poet

Poem Courtesy:

The World’s Best Poetry. Volume IV. The Higher Life. 1904.
VI. Human Experience
Editors: Bliss Carman, et al.

 

%d bloggers like this: