అనువాదలహరి

అమరత్వం… ఫ్లారెన్స్ రాండల్ లివ్ సే, కెనేడియన్ కవయిత్రి

(యుద్ధరంగంలో క్షణక్షణం మృత్యువును తప్పించుకుంటూ బ్రతికే సైనికుల జీవితాన్ని చక్కగా చెప్పిన కవిత)

.

నేనొకసారి మరణించేను, కానీ కత్తితో
పొడుస్తున్న బాధతో మళ్ళీ ప్రాణం తిరిగొచ్చింది.

మరోసారీ ప్రాణంపోయిందనే అనుకుని
భయపడ్డాను; కానీ ఫిరంగి  చాలా దూరంగా పడింది.

తూటా గాలిని చీల్చుకుంటూ రంయిమని వచ్చింది,
చిన్నప్పటి ప్రార్థన ఒకసారి చదువుకున్నాను.

నాకు తెలివొచ్చేలోగా మరణం సంభవిస్తే
నేను దైవాన్ని కోరుకుంటాను నా ఆత్మని తీసుకుపొమ్మని
నేను మేల్కొనే లోగా…

.

ఫ్లారెన్స్ రాండల్ లివ్ సే

(3rd Nov 1874 – 28th  July 1953)

కెనేడియన్ కవయిత్రి.

Florence Randal Livesay

 .

Immortality

.

I died once, but I came to life
With pain that stabbed me like a knife;

And once again I know I died–
Afraid! And yet that shell flew wide.

A singing bullet cut the air;
I said a catch of a childish prayer–

If I should die before I wake
I pray the Lord my soul to take.

‘Before I wake–’

.

Florence Randal Livesay (AKA: Kilmeny)

Canadian Poetess

3rd Nov 1874 – 28th July 1953

Poem Courtesy: http://digital.library.upenn.edu/women/garvin/poets/livesay.html

Bio of the poetess visit: http://content.lib.sfu.ca/cdm/ref/collection/ceww/id/234

%d bloggers like this: