అనువాదలహరి

మొక్కలాటి మౌనం… జిష్వావా షింబోర్స్కా, పోలిష్ కవయిత్రి

కవిత్వంతో ఏడడుగులు 80

.

మొక్కల మౌనం

.

మీకూ నాకూ మధ్య ఏకపక్ష అనుబంధం బలపడుతోంది.
నాకు ఆకు అన్నా, రేకు అన్నా, పప్పు అన్నా, కొన అన్నా, కాండం అన్నా తెలుసు
ఏప్రిల్, డిశెంబరు లలో నీకు ఏమవుతుందో కూడా నాకు తెలుసు.

నే చూపినంత కుతూహలం తిరిగి నామీద చూపించకపోయినా
మీలో కొందరంటే నేను పాదాక్రాంతమౌతాను,
మరికొందరంటే, మెడ రిక్కిస్తాను.
.

 

మీకు నేను చాలా పేర్లు పెట్టాను:
గంగరేగుచెట్టనీ, ఉమ్మెత్త అనీ, రాజహంస అనీ,
మైఫలమనీ, చవుకుచెట్టనీ, బదనిక అనీ, ఫర్గెట్మీనాట్ అనీ ఇలా.
కానీ నాకే పేరూ లేదు.

అయినా, మనందరం కలిసే ప్రయాణిస్తాం కదా.
కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు మాటాడుకోవడం సహజం,
వాతావరణం గురించో, పరిగెత్తిపోతున్న
స్టేషన్లగురించో చెప్పుకోవడమూ సహజమే.

మనం మాటాడుకుందికి సంగతుల కరువు లేదు,
ఎందుకంటే మనకి చాలావిషయాలతో అనుబంధం ఉంది.
ఒకే నక్షత్రం మనల్ని ఒకరికొకరిని అందుబాటులో ఉంచుతుంది
ఒకే సూత్రాలకి కట్టుబడి మన నీడలు పడుతుంటాయి.
కనీసం ఇద్దరం ఏదో ఒకటి తెలుసుకుందికి ప్రయత్నిస్తాం
ఎవరికి నచ్చినరీతిలో ఎవరికి వాళ్ళం,
మనకి తెలియని విషయాల్లో కూడా
ఎంతోకొంత సామ్యం ఉంటూనే ఉంటుంది.

 

ఒక్క సారి అడిగి చూడు, అంతే!

నాకు తెలిసినమేరకి చెబుతాను:
నా కళ్ళతో చూడడం అంటే ఏమిటి?
నా గుండె ఎందుకు కొట్టుకుంటుంది?
నా శరీరానికి ఎందుకు నిలకడలేదు?వగైరా, వగైరా.

కానీ అసలు ప్రశ్నలే అడగకపోతే

ఎవరైనా సమాధానాలెలా చెప్పగలరు?
మీదుమిక్కిలి
సమాధానం చెప్పే వ్యక్తి
నీకు అస్సలు ఏమీకాని వ్యక్తి అయితే?

కలుపుమొక్కలనీ, నికుంజాలనీ,
మైదానాలనీ, రెల్లు పొదలనీ
నేను మీతో ఏది అన్నా నాలోనేను మాటాడుకోవడమే
మీరు మాత్రం వినరు.

మీతో సంభాషణ  అత్యవసరం,
కానీ అసాధ్యం,
తీరికలేని జీవితంలో  అత్యావశ్యకం
ఎప్పటికప్పుడు వాయిదాపడుతూనే ఉంటుంది.
.

జిస్వావా షింబోర్స్కా

 

2 జులై 1923 – ఫిబ్రవరి 1, 2012)

పోలిష్ కవయిత్రి

 

Image Courtesy: http://upload.wikimedia.org
Image Courtesy: http://upload.wikimedia.org

The Silence of Plants

.

A one-sided relationship is developing quite well between you and me.
I know what a leaf, petal, kernel, cone, and stem are,
and I know what happens to you in April and December.

Though my curiosity is unrequited,
I gladly stoop for some of you,
and for others I crane my neck.

I have names for you:
maple, burdock, liverwort,
eather, juniper, mistletoe, and forget-me-not;
but you have none for me.

After all, we share a common journey.
When traveling together, it’s normal to talk,
exchanging remarks, say, about the weather,
or about the stations flashing past.

We wouldn’t run out of topics
for so much connects us.
The same star keeps us in reach.
We cast shadows according to the same laws.
Both of us at least try to know something,
each in our own way,
and even in what we don’t know
there lies a resemblance.

Just ask and I will explain as best I can:
what it is to see through my eyes,
why my heart beats,
and how come my body is unrooted.

But how does someone answer questions
which have never been posed,
and when, on top of that
the one who would answer
is such an utter nobody to you?

Undergrowth, shrubbery,
meadows, and rushes…
everything I say to you is a monologue,
and it is not you who’s listening.

A conversation with you is necessary
and impossible,
urgent in a hurried life
and postponed for never.

(trans. Joanna Trzeciak)

.

WISLAWA SZYMBORSKA

2 July 1923 – 1 February 2012

Polish Poet

Poem Courtesy:

http://www.poemhunter.com/poem/the-silence-of-plants/

%d bloggers like this: