అనువాదలహరి

అజ్ఞాత వ్యక్తికి… హెలెన్ డడ్లీ, అమెరికను కవయిత్రి

(అప్రాప్త మనోహరికి … అని  భావకవులు రాసిన అలనాటి కవితలకి దీనికి చాలా పోలికలున్నాయి )

రోదసిలో నిరంతరం అటూ ఇటూ
గర్వంగా తిరిగే ఎన్నో తారలను చూసేను,
చివరికి సూర్య చంద్రుల్ని కూడా
కాని, చూడనిది నీ ముఖమే.
.
వాయులీనాన్ని విన్నాను,
పైరగాలులూ, ఉత్తుంగ తరంగాలూ ఆనందంతో
ఆలపించే అవధిలేని గీతాల్ని విన్నాను
ఇంతవరకు విననిది నీ గొంతుకే.
.
ఇక్కడి మేటి శ్వేత కుసుమం
పారిజాతాన్ని పట్టుకున్నాను
పగడాన్ని, రత్నభోగినీ తాకేను.
తాకనిది నీ చెయ్యే.
.
సంధ్య వేకువ మెరిసే పాదాలను
ప్రేమికునిగా చుంబించాను,
ప్రభాతానికి  తలుపులు తెరిచాను
తెరవజాలనిది నీ కనులే!
.
తెలియనివి చాలా కలగన్నాను
మంత్రగత్తెలు సృష్టించే మాయల్లా,
వింత వింత ఆకారాలతో మాటాడేను,
ఎన్నడూ మాటాడనిది  ఒక్క నీతోనే.
.
హెలెన్ డడ్లీ
అమెరికను కవయిత్రి
19వ శతాబ్దం

 .

To One Unknown

.

I have seen the proudest stars       

That wander on through space,       

Even the sun and moon,   

But not your face.   

           

I have heard the violin,            

The winds and waves rejoice           

In endless minstrelsy,         

Yet not your voice.   

          

I have touched the trillium,              

Pale flower of the land,            

Coral, anemone, 

And not your hand.        

    

I have kissed the shining feet           

Of Twilight lover-wise,       

Opened the gates of Dawn—                  

Oh not your eyes!         

      

I have dreamed unwonted things,   

Visions that witches brew, 

Spoken with images,          

Never with you.

.

Helen Dudley

American

19th century

Courtesy:

Poetry: A Magazine of Verse. 1912–22.

Ed. Harriet Monroe, (1860–1936).

http://www.bartleby.com/300/6.html

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: