అనువాదలహరి

కుర్రతనమే గాని సహజమే… కోలరిడ్జ్, ఇంగ్లీషు కవి

(ఈ కవిత చదివేక నాకు  “ప్రణయలేఖలు” అన్న ఖండికలో పింగళి కాటూరి కవుల పద్యం:
“ఎగిరి నీ పాదములచెంత కెట్లొ వచ్చి
వ్రాలుదునొయన్న ఉత్సుకత్వమ్ము గలదు;
సాధ్య సాధనమైన పక్షముల జంట
హృదయమునకుండి లేదు శరీరమునకు”
గుర్తుకు వచ్చింది )
***


నాకే గాని రెండు చిన్న రెక్కలుంటే
నేనే గాని ఒక చిన్న పక్షినయి ఉంటే
ప్రియతమా! నేను నీ దగ్గరకి ఎగిరివచ్చేవాడిని!
కానీ ఇలాంటి ఆలోచనలన్నీ ఊసుపోకకి.
నేను ఇక్కడ ఉన్నచోటే ఉన్నాను
.
కానీ నేను నిద్రలో నీదగ్గరకి ఎగిరొస్తాను:
నేను నిద్రలో ఎప్పుడూ నీ తోటే!
అపుడు ప్రపంచమంతా మనదే కదా!
కానీ తెలివి వచ్చి చూస్తే ఎక్కడున్నాను?
ఒంటరిగా ఏ తోడూ లేక ఒక్కడినే.
.
మహరాజు ఆజ్ఞాపించినా, నిద్ర ఆగదు:
అందుకని నాకు తెల్లారకుండా లేవడం ఇష్టం.
అప్పుడు నిద్ర తేలిపోయి ఉండవచ్చుగాని,
ఇంకా చీకటిగా ఉండడంతో కళ్ళుమూసుకుని
హాయిగా కలలు కనొచ్చు.
.
కోలరిడ్జ్
ఇంగ్లీషు కవి

.

Something Childish but Natural

.

If I had but two little wings
And were a little feathery bird,
To you I’d fly, my dear!
But thoughts like these are idle things,
And I stay here.

But in my sleep to you I fly:
I’m always with you in my sleep!
The world is all one’s own.
But then one wakes, and where am I?
All, all alone.

Sleep stays not, though a monarch bids:
So I love to wake ere break of day:
For though my sleep be gone,
Yet while ’tis dark, one shuts one’s lids,
And still dreams on.

.

Samuel Taylor Coleridge

21 October 1772 – 25 July 1834

English Poet

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: