అనువాదలహరి

Wafting Fumes… Anveeksha, Telugu, Indian

 

.

 

He did not care

To look at her sleeping

Puckered up like a book.

 

He did not for once

Glance at the string of pearls

her glow-worm fingers lace picking up

Each letter in the court of darkness.

 

 

Never did he show any intent to know

Her creativity …. entering into her pen

When she drew curtains for the day, after

Slogging for the whole day with chores.

 

He took no notice of her existence

Or her monologues

With the inanimate while folding her sari, or

Setting things right in the house;

Or the sweet cooing in his ears at bed time

Or when she caressed his gray-haired face.  

 

But now

After she lay cool on the funereal bed,

The occidental sun set on her forehead,

And she enveloped him in wafting fumes,

He started off

in search of those glow worms.

.

Anveeksha

Anveeksha, 38, hails from Hyderabad.  She is a Post Graduate in Telugu Literature and MBA from Ambedkar University.  She worked with Conqueror Technologies for  sometime as HR Manager and is presently a Management Trainer.  She says that she is trying to reinvent herself with the help of poetry.

 

నిర్గమ ధూపం

.

ఆమె పుస్తకంలా మునగదీసుకున్నపుడు

అతనెప్పుడూ అటుగా

చూడనే లేదు

 

వాలిన మిణుగురులు ఒక్కో అక్షరం ఎత్తుకెళ్ళి

చీకటికోటపై ముత్యాలవరసలు పేర్చుతుంటే

ఒక్క సారైనా తనచూపును

ప్రసరించనేలేదు.

 

వండివార్చి ఇల్లంతా ఒకరోజును లెక్కించాక

ఆమె కలంలో పరకాయ ప్రవేశంచేసి

ఏ సృష్టిచేసిందో

ఏనాడూ తెలుసుకొన ఆశపడలేదు.

 

 

చీరలుమడతేస్తూ

వస్తువులు సరిచేస్తూ వాటితో చేసిన సంభాషణ

రోజూ తనుపడుకోబోయేముందు

చెవిలో జూ ఊఊఉ… అన్ననాదం వినవస్తున్నా

తెల్లబడ్డ తనవెంట్రుకలు మొహాన్ని తడిమినా

ఆమె ఉనికిని తలపోయనే లేదు

ఇప్పుడు

కట్టెలపై నిమ్మళంగా పడుకున్నాక

పశ్చిమానవాలే సూర్యుడు తననుదుటన అస్తమించాక

ధూమమై ఎగుస్తున్న కవితలా అతన్ని అల్లుకున్నాక

చీకటిలో ఆ మిణుగురులకోసం

అతనిప్పుడు వెదుకుతూ బయల్దేరాడు.

 

.

అన్వీక్ష

 

%d bloggers like this: