అనువాదలహరి

బెంగలు… షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి

(నిజానికి ఇది వ్యాఖ్యానం అక్కరలేని కవిత.  పిరికి మనిషి ఎప్పుడూ ఒక అభద్రతాభావనలో కొట్టుమిట్టాడుతుంటాడు. ఎన్ని అనుకూలతలు ఉన్నా, చింత ఎప్పుడూ లేనిదానిగురించే.  కొందరిని భగవంతుడు సైతం సుఖపెట్టలేడు. )

నిన్న రాత్రి నేనిక్కడ ఆలోచిస్తూ పడుక్కుంటే

కొన్ని బెంగలు నా చెవుల్లోకి మెల్లగా దూరి

రాత్రల్లా ఒకటే గెంతులూ, అరుపులూ…

అవి ఎప్పటిలా వాటి పాత బెంగలపాటే పాడేయి:

స్కూల్లో నాకు నోటంట మాట పెగలప్పోతే?

వాళ్ళు ఈతకొలను మూసెస్తే?

నన్ను ఎవరైనా చితక్కొడితే?

నా కప్పులో ఎవరైనా విషం కలిపేసిఉంటే?

నాకు పట్టలేని దుఃఖం వస్తే?

ఏదో జబ్బు చేసి నేను చచ్చిపోతే?

నేను ఆ పరీక్షలో తప్పితే?

నా గుండెలమీద తెల్లవెంట్రుకలు మొలిస్తే?

నన్ను ఎవరూ ఇష్టపడకపోతే?

నా మీద ఎప్పుడైనా పిడుగు పడిపోతే?

నేను పొడవు ఎదగకపోతే?

నా బుర్ర రోజురోజుకీ కుంచించుకుపోతే?

ఒక వేళ చేప ఎరకి చిక్కుకోకపోతే?

గాలిజోరుకి నా గాలిపటం చిరిగిపోతే?

వాళ్ళే ఒకవేళ యుద్ధం మొదలుపెడితే?

మా అమ్మా నాన్న విడాకులు తీసుకుంటే?

బస్సు ఒకవేళ ఆలస్యం అయితే?

నా పళ్ళు తిన్నగా పెరక్కుండా గొగ్గిపళ్ళు అయిపోతే?

నేను నా నిక్కరు చించేసుకుంటే?

నేను అసలు ఎప్పటికీ నాట్యం నేర్చుకోలేకపోతే?

అన్నీ సవ్యంగా ఉన్నట్టే ఉంటాయి,

కానీ, రాత్రి అవడమే ఆలస్యం,

నా బెంగలు నన్ను మళ్ళీ చుట్టుముడతాయి.

.

షెల్ సిల్వర్ స్టీన్,

(September 25, 1930 – May 10, 1999)

అమెరికను కవి.

 Shel Silverstein

.

 

What-if

 

.

Last night, while I lay thinking here,

some What-ifs crawled inside my ear

and pranced and partied all night long

and sang their same old What-if song:

What-if I’m dumb in school?

What-if they’ve closed the swimming pool?

What-if I get beat up?

What-if there’s poison in my cup?

What-if I start to cry?

What-if I get sick and die?

What-if I flunk that test?

What-if green hair grows on my chest?

What-if nobody likes me?

What-if a bolt of lightning strikes me?

What-if I don’t grow talle?

What-if my head starts getting smaller?

What-if the fish won’t bite?

What-if the wind tears up my kite?

What-if they start a war?

What-if my parents get divorced?

What-if the bus is late?

What-if my teeth don’t grow in straight?

What-if I tear my pants?

What-if I never learn to dance?

Everything seems well, and then

the nighttime What-ifs strike again!

.

Shel Silverstein

(September 25, 1930 – May 10, 1999)

American poet, singer-songwriter, cartoonist

 Poem Courtesy:

http://www.poetrysoup.com/famous/poems/best/shel_silverstein

 

ప్రకటనలు
%d bloggers like this: