అనువాదలహరి

ఇంటి పైకప్పులు … జాయిస్ కిల్మర్, అమెరికను కవి

(ఎమీలియా జోసెఫ్ బర్ కి)

దారి విశాలమైనది, నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి

ఈ నిశీధి ఊపిరులు సుగంధభరితంగా ఉన్నాయి.

కాళ్ళకి తిరిగాలన్న వ్యామోహం కలగడానికి ఇదే సరియైన తరుణం

కానీ, కనిపిస్తున్న ఖాళీ రాదారినుండీ, ముఖం మీదపడే చుక్కలవెలుగు నుండీ,

ఆరుబయలు అద్భుతంనుండీ వెనుదిరిగి, మానుష నివాసానికి మరలడమే ఇష్టం.

ఏ ఇల్లూ లేకుండా.  ప్రపంచపు రాదారులంట అటూ ఇటూ తిరగాలనుకునే

దేశదిమ్మరిని నేను నిజంగా ఇప్పటివరకు చూడనేలేదు.

నిన్న రాత్రి మీ కొట్టంలో పడుక్కుని పొద్దుటే వెళ్ళిపోయిన బాటసారి కూడా

తలదాచుకుందికి మరో ఇల్లు దొరికేదాకా మాత్రమే తిరుగుతాడు.

సంచారవాసి కూడా నెత్తిమీద గూడు ఉన్న బండిలోనే పడుక్కుంటాడు;

లేదా, నిద్రవేళ అయేసరికి తన గుడారంలోకి దూరుతాడు.

సూర్యుడు ఖణీగా కనిపిస్తున్నంతసేపే తను గడ్డిలో హాయిగా విశ్రమిస్తాడు

చీకటిపడగానే, ఆకాశాన్ని వదిలించుకుందికొక కప్పు వెతుక్కుంటాడు.

మీరు దేశ సంచారిని దేశదిమ్మరి అంటే మీరు అతనికి అపచారం చేస్తున్నట్టే,

ఎందుకంటే, తనతోపాటు ఎప్పుడూ గూడు మోసుకెళ్ళే అతను, సంచారజీవి కాడు.

రోడ్డు అంత అందంగా కనిపించడానికి ఏకైక కారణం ప్రతి సంచారికీ ఎరుకే:

ఎందుకంటే…  ప్రతి దారీ చివరకి చేరేది…  ఆ ఇంటికీ, ఈ ఇంటికీ, ఏదో ఒక ఇంటికి.

జీవితం ఒక రహదారి, ఏళ్ళు మైలు రాళ్ళు అని ఒక నానుడి; కానీ, అక్కడక్కడ

సుంకపు గేటు తగులుతుంది, కన్నీళ్ళతో నువ్వు నీ దారి కొనుక్కోవాలి.

అది గతకలరోడ్డో, మిట్ట రోడ్డో, దూరంగా విశాలంగా ఉండే రోడ్డో

ఏదయితేనేం, చివరకి  బంగారు వాకిళ్ళున్న హేమనగరికి దారితీస్తుంది.

.

జాయిస్ కిల్మర్,

December 6, 1886 – July 30, 1918

అమెరికను కవి.

.

.

Roofs

(For Amelia Josephine Burr)

.

The road is wide and the stars are out

and the breath of the night is sweet,

And this is the time when wanderlust should seize upon my feet.

But I’m glad to turn from the open road and the starlight on my face,

And to leave the splendour of out-of-doors for a human dwelling place.

 

I never have seen a vagabond who really liked to roam

All up and down the streets of the world and not to have a home:

The tramp who slept in your barn last night and left at break of day

Will wander only until he finds another place to stay.

 

A gypsy-man will sleep in his cart with canvas overhead;

Or else he’ll go into his tent when it is time for bed.

He’ll sit on the grass and take his ease so long as the sun is high,

But when it is dark he wants a roof to keep away the sky.

 

If you call a gypsy a vagabond, I think you do him wrong,

For he never goes a-travelling but he takes his home along.

And the only reason a road is good, as every wanderer knows,

Is just because of the homes, the homes, the homes to which it goes.

 

They say that life is a highway and its milestones are the years,

And now and then there’s a toll-gate where you buy your way with tears.

It’s a rough road and a steep road and it stretches broad and far,

But at last it leads to a golden Town where golden Houses are.

.

Joyce Kilmer

December 6, 1886 – July 30, 1918

American

Poem Courtesy:

http://www.eliteskills.com/analysis_poetry/Roofs_by_Joyce_Kilmer_analysis.php

 

 

%d bloggers like this: