అనువాదలహరి

వంతలగృహం… మార్గరెట్ వాకర్ , అమెరికను కవయిత్రి

నా మూలాలు దక్షిణప్రాంత జీవితంలో లోతుగా చొచ్చుకుపోయాయి;
అవి జాన్ బ్రౌన్ కన్నా, నాట్ టర్నర్ కన్నా, రాబర్ట్ లీ కన్నా లోతైనవి.
నేను పుట్టి పెరిగింది ఉష్ణమండలాల్లో; తాటి చెట్టుకీ, అరటిమొక్కకీ
మామిడి, కొబ్బరి, పనస, రబ్బరు చెట్లకీ నేను పరిచయమే.

మండుటెండలూ, అఖాతాల నీలిరంగు సెలయేరులూ నా రక్తంలో ఉన్నై.
లేత చిగుళ్ళ పరిమళానికీ, నల్లజాతి వారసత్వానికీ
విశృంఖలంగా పెరిగే మొక్కల స్వేచ్చకీ చెందినదాన్ని.

ఆకాశానికీ దూరంగా, ఇనుమూ, ఇటుకా, కర్రతో కట్టిన గోడలమధ్య
సాల్వడార్ సంగీతం వింటూ, పక్కన సబ్ వే రొదతో
ఆవిరి నిండిన ఇళ్ళలో పెరిగిన బల్బుని కాదు.
.
నాకు పత్తి చేలూ, పుగాకు, చెరుకుతోటలు కావాలి.
బీడుపడ్డ పొలాలరాలే విత్తనాల బస్తాలతో నడవాలి
నా గుండెలో కలవరపెట్టే సంగీతం, నేనిక్కడనుండి త్వరగా కదలాలి.

ఓ నా  దక్షిణ తీరమా! వంతల గృహమా! నా రక్తం అణువణువులో
నీ సంగీతమే నినదిస్తోంది! ఈ విద్వేష తెగలు, వేటకుక్కలూ,
ముఠాలూ  ఎన్నాళ్ళు నన్ను నా స్వస్థలంనుండి నిలువరించగలవు?

.

మార్గరెట్ వాకర్

July 7, 1915 – November 30, 1998

అమెరికను కవయిత్రి

 .

.

Sorrow Home

.

My roots are deep in southern life; deeper than John Brown

or Nat Turner or Robert Lee. I was sired and weaned

in a tropic world. The palm tree and banana leaf,

mango and coconut, breadfruit and rubber trees know me.

Warm skies and gulf blue streams are in my blood. I belong

with the smell of fresh pine, with the trail of coon, and

the spring growth of wild onion.

I am no hothouse bulb to be reared in steam-heated flats

with the music of El and subway in my ears, walled in

by steel and wood and brick far from the sky.

I want the cotton fields, tobacco and the cane. I want to

walk along with sacks of seed to drop in fallow ground.

Restless music is in my heart and I am eager to be gone.

O Southland, sorrow home, melody beating in my bone and

blood! How long will the Klan of hate, the hounds and

the chain gangs keep me from my own?

.

Margaret Walker

July 7, 1915 – November 30, 1998

American

 

Poem Courtesy: http://www.english.illinois.edu/maps/poets/s_z/walker/onlinepoems.htm

 

ప్రకటనలు
%d bloggers like this: