అనువాదలహరి

24-42 … Dr. Pulipati Guruswamy, Telugu, Indian

Read whichever way

Grief is the fate of the fated.

 .

Reflection knows

The heart standing in front.

 .

Dreams, doubling up

Petrify gradually

In their dance spree.

 .

My breath of fancy within

evaporates

For a whiff of your consent.

 .

Who is going to join

The parting ways?

.

Somebody knit

Darkness around lightning.

 .

But then, who is it that speaks?

The Silence of the mirror.

.

Dr. Pulipati Guruswamy

Telugu, Indian

Image Courtesy: Dr. Pulipati Guruswamy
Image Courtesy:                 Dr. Pulipati Guruswamy

2442

.

ఎటు చదివినా
దుఃఖపు తలరాత ఒకటే

ప్రతిబింబానికి
మనసు తెలుసు

రెట్టింపు కలలు
నాట్యం చేసుకుంటూ
ప్రతిమలౌతాయి

నీ మనసు కోసం
ఆవిరౌతున్న
నా లోపలి ఊహల గాలి

ఎవరు కలుపుతారు
రహదారుల్ని?

మెరుపుల చుట్టూతా
చీకటి కుట్టినారు

అసలు మాట్లాడుతున్నది
అద్దం నిశ్శబ్ధం .

-డా. పులిపాటి గురుస్వామి

యవ్వనమూ – ముదిమీ… ఛార్ల్స్ కింగ్స్ లీ ఇంగ్లీషు కవి

కుర్రాడా! ప్రపంచం అంతా కొత్తగా ఉన్నప్పుడు
ప్రకృతి అంతా పచ్చగా కనిపిస్తున్నప్పుడు;
బాబూ! ప్రతి బాతూ హంసలాగానూ,
ప్రతి పిల్లా మహరాణిలానూ కనిపిస్తున్నప్పుడు;
బాలకా! అప్పుడు గుర్రాన్నీ బూటునీ వెతుక్కుని
దేశాటన చెయ్యడానికి పోవాలి;
పిల్లడా! యువరక్తం దాని దారి అది వెతుక్కోవాలి,
ప్రతి జీవికీ దాని రోజంటూ ఒకటి ఉంటుంది.

కుర్రాడా! ప్రపంచం అంతా పాతబడిపోయినప్పుడు
చెట్లన్నీ పచ్చదాన్ని కోల్పోయినపుడు;
బాబూ! ఏ క్రీడలోనూ ఉత్సాహం దొరకనప్పుడు
బండి చక్రాలన్నీ అరిగిపోయినప్పుడు;
ఇంటికి మెల్లగా చేరుకో; జీవితంలో అలిసి
చేవలుడిగిన వారిలో నీచోటు చూసుకో;
అక్కడి ముఖాలలో నువ్వు చిన్నప్పుడు ప్రేమించినది
ఒక్కటైనా దొరికేలా దేముడు నిన్ననుగ్రహించుగాక!
.
ఛార్ల్స్ కింగ్స్ లీ

12 June 1819 – 23 January 1875

English Poet

Charles Kingsley

Young and Old

.

When all the world is young, lad,    

And all the trees are green;   

And every goose a swan, lad, 

And every lass a queen;        

Then hey for boot and horse, lad,           

And round the world away; 

Young blood must have its course, lad,     

And every dog his day.        

When all the world is old, lad,

And all the trees are brown;        

And all the sport is stale, lad, 

And all the wheels run down:        

Creep home, and take your place there,    

The spent and maimed among:      

God grant you find one face there           

You loved when all was young.

.

Charles Kingsley

(1819–1875)

Poem Courtesy:

The Harvard Classics. 1909–14.

English Poetry III: From Tennyson to Whitman.

http://www.bartleby.com/42/655.html

నీగ్రో గాయకుడు… జేమ్స్ డేవిడ్ కొరోదర్స్, అమెరికను కవి

నా పాటలన్నిటిమీదా పరివ్యాప్తమై ఒక ముఖం జాడ

ఉంటుంది; అడవిలో పెరిగే అందమైన పూల మీద నీడలా.

ఆ ఆనందపారవశ్యంలో కమ్మని కలలొస్తాయి ;

అంత అద్భుతమైన వీణ అందిచ్చిన ఆనందమూ, నిమ్న జాతి

గాయకుడికి ఆశీస్సులీయగల అనుకంప కలిగించలేకపోతుంది.

ఇది నన్ను చాలా కాలం వేధించింది; అందులో చిత్రమైన వేళల్లో:

అప్పుడు హీరా ఉద్యానాలు, సింథియా పొదరిళ్ళూ కళకళలాడుతున్నై;

ఎక్కడో దూరంగా ఏకాంతంగా ఉన్న ఎర్రని ఆశల తోరణాలతో…

అయినా నన్ను మరింత లోతుగా తవ్వి పోసుకుంటాను

ప్రేమ అనే స్వచ్ఛసరోవరాలనుండీ, అంతుపట్టని నైలు నదులనుండీ

ఎడారి ఇసుకదారులంట చెమట కక్కుకుంటూ నైనా నీరు తెస్తాను

ఏ ఒక్క అంకాన్నీ విడిచిపెట్టకుండా ఆలాపన చేస్తాను,

అపుడు నా నల్లని ముఖాన్ని బట్టి పాటని కించపరచకుండా

లోకం నన్ను తెలుసుకుని చిరకాలం గుర్తుంచుకొనుగాక!

.

జేమ్స్ డేవిడ్ కొరోదర్స్

1869 – 1917

అమెరికను నల్లజాతి కవి

.

.

The Negro Singer

.

O’er all my song the image of a face

Lieth, like shadow on the wild sweet flowers.

The dream, the ecstasy that prompts my powers;

The golden lyre’s delights bring little grace

To bless the singer of a lowly race.

Long hath this mocked me: aye in marvelous hours,

When Hera’s gardens gleamed, or Cynthia’s bowers,

Or Hope’s red pylons, in their far, hushed place!

But I shall dig me deeper to the gold;

Fetch water, dripping, over desert miles,

From clear Nyanzas and mysterious Niles

Of love; and sing, nor one kind act withhold.

So shall men know me, and remember long,

Nor my dark face dishonor any song.

.

James David  Corrothers

1869 – 1917

American Poet

(Note:

Nyanza: A lake; a large body of water in east Africa.)

 Read about the poet here:

http://www.blackpast.org/aah/corrothers-james-david-1869-1917

The Book of American Negro Poetry. 1922.

Ed: James Weldon Johnson, (1871–1938).

అద్భుతమైన లుకేషియా స్నేహనికి గురుతుగా… కేథరీన్ ఫిలిప్స్, వెల్ష్ కవయిత్రి

ఆనందం పరాకాష్ఠకు చేరిన
ఈ క్షణం దాకా నా జీవితం జీవితం కాదు.
అపవాదుల భయం లేకుండా నేనిపుడు అనొచ్చు,
నేను నీదాన్ని కాదు, నేను నువ్వే.

ఈ కాయము శ్వాసించింది, నడిచింది, నిద్రించింది
దానితో ప్రపంచం అంతా నమ్మింది
ఇందులో ఆత్మ ఉండి ఈ పనులన్నీ చేయిస్తోందని.
కాని వాళ్ళంతా పొరబడ్డారు.

ఎందుకంటే, కీ ఇచ్చిన వాచీ
నడిచిన తంతే నా చేష్టలూను;
నిన్ను కలిసినదాకా ఈ ఒరిండాకి
ఆత్మ అంటూ ఒకటి లేనే లేదు.

ఇప్పుడది బాధాతప్తమైన నా హృదయాన్ని
ఊరడించి, ప్రేరణనిచ్చి, తోవచూపిస్తుంది;
నువ్వే నా ఆనందం, నా జీవితం, నా ఆటవిడుపు,
నాకు అత్యంతవిలువైన వస్తువువి నువ్వే.

ఏ పెళ్ళి కొడుకు ఆనందం, మహారాజు ఆనందం
నా ఆనందానికి సరితూగవు;
వాళ్ళు అంకించుకొనేవి కేవలం మృణ్మయాలు,
నాకు ఈ విశ్వమంతా నీలో అందుతుంది.

మన పుట్టువంత లలితంగా,
మన ఆత్మలంత శాశ్వతంగా
ఏ అనవసర భయాలకీ  లొంగకుండా
మన ఆత్మలు ఇలానే వెలుగులు విరజిమ్మాలి

.

కేథరీన్ ఫిలిప్స్

జనవరి 1, 1632 –  జూన్ 22, 1664

వెల్ష్ కవయిత్రి

.

.

To my Excellent Lucasia, on our Friendship

 .

I did not live until this time

Crown’d my felicity,

When I could say without a crime,

I am not thine, but thee.

 

This carcass breath’d, and walkt, and slept,

So that the world believ’d

There was a soul the motions kept;

But they were all deceiv’d.

 

For as a watch by art is wound

To motion, such was mine:

But never had Orinda found

A soul till she found thine;

 

Which now inspires, cures and supplies,

And guides my darkned breast:

For thou art all that I can prize,

My joy, my life, my rest.

 

No bridegroom’s nor crown-conqueror’s mirth

To mine compar’d can be:

They have but pieces of the earth,

I’ve all the world in thee.

 

Then let our flames still light and shine,

And no false fear controul,

As innocent as our design,

Immortal as our soul.

.

Katherine Philips (‘Orinda’)

(1 January 1632 – 22 June 1664)

Anglo-welsh Poet, translator

Poem Courtesy:

A Book of Women’s Verse. 1921.

Ed: J. C. Squire

(http://www.bartleby.com/291/13.html)

 

 

 

వీడ్కోలు… ఛార్ల్స్ కింగ్స్ లీ, ఇంగ్లీషు కవి

నా చక్కని తల్లీ, నీకు వదిలిపెట్టడానికి విలువైనదేదీ లేదు;

పేలవమైన నా కథని ఆలపించడానికి ఎవరూ ప్రయత్నించరు;

కానీ నేను మరణించేలోగా నీకు అనవరతమూ మార్గదర్శి కాగల

ఒక జీవిత సత్యాన్ని బోధించగలను.

బంగారు తల్లీ! అందరితో మంచిగా ఉండు; ఎవరి తెలివి వాళ్ళని ప్రదర్శించనీ;

పొద్దల్లా కలలుకంటూ కూచోకుండా, గొప్ప పనులు చేసి చూపించు;

అలా చేసి, అనంతమైన నీ జీవితాన్నీ, చివరకి మరణాన్ని కూడా

ఒక మధురమైన గీతంగా మలుచుకో.

.

ఛార్ల్స్ కింగ్స్ లీ

జూన్ 12, 1819 – జనవరి 23, 1875

ఇంగ్లీషు కవి

.

Charles Kingsley

.

A Farewell

 .

My fairest child, I have no song to give you;

No lark could pipe to skies so dull and gray:

Yet, ere we part, one lesson I can leave you

           For every day.

 

Be good, sweet maid, and let who will be clever;

Do noble things, not dream them, all day long;

And so make life, death, and that vast forever

           One grand, sweet song.

.

Charles Kingsley

12 June 1819 – 23 January 1875

English Poet, Historian, Novelist and Priest.

Poem Courtesy: The English Poets. 1880–1918.

Vol. IV. The Nineteenth Century: Wordsworth to Rossetti

Ed:  Thomas Humphry Ward.

http://www.bartleby.com/337/1200.html

 

 

 

 

దేవుని వరాలు… జార్జి హెర్బర్ట్, వెల్ష్ కవి

దేముడు మొదట మనిషిని సృష్టించినపుడు
ప్రక్కన ఒక గ్లాసునిండా వరాలు ఉంచుకున్నాడు,
తనలో తాను “మనం మనదగ్గర ఉన్నదంతా ఇచ్చెద్దాం.
చెల్లా చెదరుగా ఉన్న సృష్టిలోని సంపదలన్నీ
ఒక్కచోటకి పోగుపడనిద్దాం” అనుకున్నాడు.

అనడమే తడవు, ముందు బలం దారి తీసింది;
అందం దాన్ని అనుసరించింది, తర్వాత వివేకం, కీర్తి, ఆనందం:
ఉన్నవన్నీ అయిపోయిన తర్వాత, దేముడు ఒక క్షణం ఆగేడు,
అన్ని సంపదలలోకీ అట్ట అడుగున
“విశ్రాంతి” పడిఉండడం గమనించేడు.

ఇలా అనుకున్నాడు: నా జీవికి
ఈ వరాన్ని కూడా అనుగ్రహించేనా,
అతడు నా వరాల్ని పూజిస్తాడు నన్ను విడిచిపెట్టి;
అతను ప్రకృతిలో విశ్రాంతి తీసుకుంటాడు నాలో బదులుగా;
దాని వల్ల ఇద్దరం నష్టపోతాం.

అయినా సరే, విశ్రాంతి అతనికి వదిలెస్తాను
కాకపోతే దాన్ని బాధతో కూడిన అశాంతితో జతచేస్తాను.
అతను సంపన్నుడయినా అలసిపోవును గాక. దాని వల్ల,
సద్బుద్ధి అతన్ని నాదగ్గరకి తీసుకు రాకపోయినా
కనీసం, అతని అలసటైనా నా దగ్గరకి తీసుకు వస్తుంది.
.
జార్జి హెర్బర్ట్

3 ఏప్రిల్ 1593 – 1 మార్చి 1633

వెల్ష్ కవి

  .

George Herbert

.

The Gifts of God

.

When God at first made man,
Having a glass of blessings standing by,
Let us (said he) pour on him all we can:
Let the world’s riches, which dispersed lie,
Contract into a span.

So strength first made a way;
Then beauty flowed, then wisdom, honor, pleasure:
When almost all was out, God made a stay,
Perceiving that, alone, of all his treasure,
Rest in the bottom lay.

For if I should (said he)
Bestow this jewel also on my creature,
He would adore my gifts instead of me,
And rest in Nature, not the God of Nature:
So both should losers be.

Yet let him keep the rest,
But keep them with repining restlessness:
Let him be rich and weary, that, at least,
If goodness lead him not, yet weariness
May toss him to my breast.

.
George Herbert
3 April 1593 – 1 March 1633
Welsh Poet

Poem Courtesy:

The World’s Best Poetry. Volume IV. The Higher Life. 1904.
VI. Human Experience
Editors: Bliss Carman, et al.

 

మొర … ఎబ్ నెజర్ ఏలియట్, ఇంగ్లీషు కవి

చలిగా, లోతుగా, నల్లగా కెరటాలు సాగుతుంటాయి
ఎక్కడా గాలి ఊసు లేని సముద్రం మీద
ఎవరికీ ఎరుకలేని ఏ చారెడు నేలకోసమో!
.
ఆ చీకటి అలలతరగలమీద తేలుతూ
వినీ వినిపించక, శతృ, మిత్రుల శోకాలు,
ఎవరికీ తెలియని ఏ నేలనో వెతుక్కుంటూ పోతాయి.

దూరాన రక్షించమంటూ విధివంచితుడెవరో
అరుస్తున్నాడు; ఈ లోకంలోని బాధలనుండి విముక్తుడై
మిగతావాళ్ళలాగే ఎవరికీ తెలియని తీరానికి పోతున్నాడు.

ఆ వెళుతున్నవాని వెంట కొన్ని వేల మంది పోయినా
గాలి ఆడని ఆ ప్రదేశానికి, ఒంటరిగానే పోతున్నాడు,
ఎవరి ఊహకీ అందని ఆ దేశానికి.

ఆ గాలి అల్లాడని చోటుకి అందరూ వెళ్ళవలసిందే,
అయితే, ఆ వెళ్ళేవాడికోసం మాత్రం ఎవరూ పోరు;
ఆ వెళ్ళిన చోటునుండి, ఎందుకు తిరిగిరాడో ఏ ఒక్కడికీ తెలీదు.

అయినా సరే,  ఈ బాధామయ లోకం నుండి
పదిమందితో పాటే అరుస్తూ పోతున్న వాడు, ఎవరితో
పునస్సమాగం కోరుతున్నాడు? వారితోనా? మృత్యువుతోనా?

ఏ గాలీ చొరని చోట దేమునితో ఏకాంతంగా
మృత్యువు తన నీడగా, నశించి, అతడు పోతాడు.
దేముడున్నాడని నీడే నిరూపిస్తుంది.

గాలి చొరలేని,  లోతుదొరకని అఖాతమా!
ఎవ్వరూ కనుగొనలేని భూఖండమా!
దైవమే సర్వస్వమని అతని నీడే ఋజువుచేస్తుంది.

.

 ఎబ్ నెజర్ ఏలియట్

17 March 1781 – 1 December 1849

ఇంగ్లీషు కవి

.

Ebenezer Elliott

.

Plaint

.

Dark, deep, and cold the current flows

Unto the sea where no wind blows,

Seeking the land which no one knows.

O’er its sad gloom still comes and goes

The mingled wail of friends and foes,

Borne to the land which no one knows.

Why shrieks for help yon wretch, who goes

With millions, from a world of woes,

Unto the land which no one knows?

Though myriads go with him who goes,

Alone he goes where no wind blows,

Unto the land which no one knows.

For all must go where no wind blows,

And none can go for him who goes;

None, none return whence no one knows.

Yet why should he who shrieking goes

With millions, from a world of woes,

Reunion seek with it or those?

Alone with God, where no wind blows,

And Death, his shadow—doom’d, he goes:

That God is there the shadow shows.

O shoreless Deep, where no wind blows!

And thou, O Land which no one knows!

That God is All, His shadow shows.

.

Ebenezer Elliott

17 March 1781 – 1 December 1849

English Poet

 

Poem Courtesy:

The Oxford Book of Victorian Verse. 1922.

Compiler: Arthur Quiller-Couch.

http://www.bartleby.com/336/19.html

.

 

జత గ్లోవ్జ్ పందెంలో ఓడిపోయినపుడు… జేమ్స్ రస్సెల్ లోవెల్, అమెరికను కవి

మేం పందెం వేసుకున్నాం, ఆమె ఎండవస్తుందనీ, నేను వర్షం పడుతుందనీ.

అందులో, కించిత్తు కుతంత్రం ఉందని ఒప్పుకోవాలి, నిజం చెప్పాలంటే

ఎందుకంటే, ఆమెకు ముందుగా గెలుస్తానన్న ధీమాలేకపోతే

మేమిద్దరం కలిసిపంచుకున్న ఈ వెచ్చదనం ఆమె సృష్టించి ఉండేదా?
.

జేమ్స్  రస్సెల్ లోవెల్

22 ఫిబ్రవరి 1819 –  12 ఆగష్టు  1891

అమెరికను కవి, విమర్శకుడు, సంపాదకుడు, దౌత్యవేత్త .

.

James Russell Lowell

Epigrams: With a Pair of Gloves Lost in a Wager

.

We wagered, she for sunshine, I for rain,       

And I should hint sharp practice if I dared;  

For was not she beforehand sure to gain       

Who made the sunshine we together shared?

.

James Russell Lowell

February 22, 1819 – August 12, 1891

American poet, editor, critic and diplomat

Poem Courtesy:

A Library of American Literature:

An Anthology in Eleven Volumes. 1891.

Comps: Stedman and Hutchinson,

Vols. VI–VIII: Literature of the Republic, Part III., 1835–1860

.

 

కామన… పూష్కిన్, రష్యను కవి

రోజులు సాగుతూ ఉంటాయి; ప్రతిక్షణమూ

విఫలప్రేమ వల్ల గాయపడ్డ నా మనసులోని

బాధనీ దుఃఖాన్ని ఇనుమడింపజేస్తూ చీకటి మిగిల్చి

నిద్ర పోనీని కలలకీ, వెంటాడే కోరికలకీ దారితీస్తుంది;

అయినా, నేను ఫిర్యాదు చెయ్యను; బదులుగా, శోకిస్తాను;

కన్నీళ్ళు నాకు మనశ్శాంతి నిస్తాయి, ఇచ్చి శలవుతీసుకుంటాయి.

గాఢమైన దుఃఖానికి బందీ అయిన  నా మనసుకి,

నా మాటనమ్మండి, చెప్పలేని  ఆనందం కలుగుతుంది.

జీవితమా! సాగిపో! రిక్తాత్మా! రా, ముందుకి ఎగిరిపో,

నిశ్శబ్ద తమోశూన్యంలోకి అంతర్థానమైపో!

నా ప్రేమ గురించి అంతులేని మనోవేదన నాకు ఇష్టం.

ప్రేమిస్తూ మరణించగలిగితే, దయచేసి నన్ను మరణించనీండి.

.

అలెగ్జాండర్ సెర్గెవిచ్ పూష్కిన్

6 జూన్ 1799 – 10 ఫిబ్రవరి 1837

రష్యను కవి.

.

Image Courtesy: http://en.wikipedia.org/wiki/File:A.S.Pushkin.jpg
Image Courtesy: http://en.wikipedia.org/wiki/File:A.S.Pushkin.jpg

.

A Wish

.

The days drag on, each moment multiplies

Within my wounded heart the pain and sadness

Of an unhappy love and, dark, gives rise.

To sleepless dreams, the haunting dreams of madness

But I do not complain – instead, I weep;

Tears bring me solace, comforted they leave me.

My spirit, captive held by grief, a deep.

And bitter rapture finds in them, believe me.

Pass, life! Come, empty phantom, onward fly.

And in the silent void of darkness vanish.

Dear it to me my love’s unending anguish;

If as I die I love, pray let me die.

.

Alexander Sergeyevich Pushkin

6 June  1799 – 10 February  1837

http://www.poemhunter.com/i/ebooks/pdf/alexander_sergeyevich_pushkin_2012_6.pdf

స్తుతి గీతం 14… ఎలిజబెత్ మహారాణి 1, ఇంగ్లండు

నిజమైన నమ్మకం ఎన్నడూ లేని వాళ్ళు
వాళ్ల మనసుల్లో దేముడు లేడంటారు.
వాళ్ళ నడవడి అంతా రోతగా ఉంటుంది
అందులో ఒక్కడికీ దైవత్వం అంటే తెలీదు.
స్వర్గంనుండి  దేముడు వాళ్లని గమనించేడు
వాళ్ల నడవడి ఎలా ఉంటుందో చూద్దామని.
ఎందులోనూ నిశ్చయం లేక, పక్కతోవలు పట్టి
ఏ ఒక్కడూ కూడా ఋజుమార్గంలో పోయినవాడు లేడు.
వాళ్ల మనసుల్లో, మాటల్లో అంతా కపటమే.
పెదవి విప్పితే విషపూరితమైన లాలూచీ మాటలు
వాళ్ళ మనసులు చెడిపోయాయి; నోర్లు తాటిపట్టెలు,
వాళ్ళు చిటికెలో రక్తపాతానికి ఒడిగట్టగలరు.
వాళ్ళు ఎంతగుడ్డివాళ్ళంటే, సత్యాన్ని తెలుసుకోలేరు
వాళ్ళలో ఎన్నడూ దేముడంటే భయం పుట్టదు.
అటువంటి దుర్మార్గులు మంచివాళ్ళెలా అవుతారు?
వాళ్ళు భగవంతుడి నెత్తురుకూడా తాగగల సమర్థులు.
వాళ్లు భగవంతుని నిజంగా సేవించలేరు
వాళ్ళ మనసులు కలవరంతో దిక్కుతోచక ఉంటాయి.
భగవంతుడెప్పుడూ న్యాయంగా నడిచేవారితో ఉంటాడు
ఎందుకంటే, వాళ్ళు అతనిమీద విశ్వాసం ఉంచుతారు.
అందుకే భగవంతుడు వాళ్ళకి
ఆకాశంనుండి వేలాడే ఇజ్రాయేలు ఇచ్చాడు
భగవంతుడు అతని బాధలన్నీ తొలగించినపుడు
జాకొబ్ మనస్ఫూర్తిగా ఆనందంతో ఉంటాడు.
భగవంతునికి జేజేలు.
.
ఎలిజబెత్ మహారాణి 1
7 సెప్టెంబరు 1533 – 24మార్చి  1603
ఇంగ్లండు.

.

.

Psalm XIV

.

Fools, that true faith yet never had,

Say in their hearts, there is no God!

Filthy they are in their practice,

Of them not one is godly wise.

From heaven the Lord on man did look,

To know what ways he undertook:

All they were vague, and went astray,

Not one he found in the right way;

In heart and tongue have they deceit,

The lips throw forth a poisoned bait;

Their minds are mad, their mouths are wood,

And swift they be in shedding blood:

So blind they are, no truth they know,

No fear of God in them will grow.

How can that cruel sort be good?

Of God’s their folk which suck the blood?

On him rightly shall they not call;

Despair will so their hearts appal.

At all times God is with the just,

Because they put in him their trust.

Who shall therefore from Sion gave

That health which hangs on our b’leue? (blue?)

When God shall take from his the smart,

Then will Jacob rejoice in heart.

               Praise to God.

.

(Note: The poem is converted to present day  readable form by the translator within his limitations of understanding. The exact text is available at the link provided. The liberty taken by the translator may be forgiven.)

Queen Elizabeth I

7 September 1533 – 24 March 1603

England

Poem Courtesy:

Select Poetry of the Reign of Queen Elizabeth. 1845.

Ed: Edward Farr.

http://www.bartleby.com/261/1.html

%d bloggers like this: