అనువాదలహరి

విశ్వాసం… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

నా ఆత్మ  నా శరీర గృహంలో ఉంటుంది

నువ్వు, రెండింటికీ స్వామివే.

కానీ, నా ఆత్మ, నిర్భయంగా హాయిగా తిరిగే

సాహసికుడిలా ఒక్కోసారి ఒదిగి ఉండదు.

అదొక శాంతిలేని, కుతూహలము వీడని  ఆభాస.

అదేం చేస్తుందో నే నెలా చెప్పగలను?

నా శరీరపు విశ్వాసాన్నైతే హామీ ఇవ్వగలను.

కానీ, నా ఆత్మకి

నీ మీద విశ్వాసం తప్పితే?

.

సారా టీజ్డేల్

August 8, 1884 – January 29, 1933

అమెరికను కవయిత్రి

.

Image Courtesy: http://img.freebase.com
Image Courtesy: http://img.freebase.com

.

Doubt

.

My soul lives in my body’s house

and you have both the house and her –

But sometimes she is less your own

than a wild, gay adventurer.

A restless and an eager wraith,

How can I tell what she will do?

Oh, I am sure of my body’s faith

But what if my Soul broke

faith with you?

.

Sara Teasdale

August 8, 1884 – January 29, 1933

American

Poem Courtesy: http://armymomhaven.com/teasdales/doubt—.php

 

 

ప్రకటనలు

2 thoughts on “విశ్వాసం… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి”

  1. మాన్యులు శ్రీ శర్మగారికి,
   మీ అభిమానానికి ధన్యవాదాలు. 5 రోజులుగా ఊర్లో లేను. మా స్వంతవూరు వెళ్ళవలసిన పని పడింది. 2 పద్యాలు మాత్రమే ముందుగా Schedule చెయ్య గలిగాను. మీరు అడిగింది చాలా చిక్కు ప్రశ్న. దానికి సమాధానం చెప్పగల సత్తా నాకు లేదు. కాకపోతే నా ఊహ మీతో పంచుకోగలను. (They are just wild thoughts)
   ఆత్మ శరీరానికి ఒక రకంగా ఆభాస అనుకోవచ్చునేమో. ఎందుకంటే, మనగురించి మనం ఆలోచిస్తున్నప్పుడు “నేను ఈ పని చేస్తున్నాను, ఇలా ఉన్నాను, ఇలా అనుకుంటున్నాను” అన్న ఆలోచన, మనం ఒక శరీరం లో ఉంటున్నా మన్న స్పృహ ఉంటుంది. కానీ ఒఠ్ఠి శరీరానికి ఆ స్పృహ ఉంటుందో లేదో తెలీదు. అది మరణానంతరం మాత్రమే తెలియగలిగేది. ఆత్మ లేని శరీరంలాగే, శరీరంలేని ఆత్మకూడా (అలా ఉండగలిగితే) వ్యర్థమేనేమో. అందుకే ఏదో ఒక శరీరంకోసం తపించవచ్చు. తన ఉనికికోసం ఒక శరీరాన్ని ఆశ్రయించిన ఆత్మ, శరీరం అదుపులో ఉండకుండా, తన ప్రత్యేకతని నిలబెట్టుకుంటూనే ఉంటుంది. శరీరం ఇంద్రియాధీనం కనుక ఆత్మచెప్పినట్టు ప్రవర్తిద్దామనుకున్నా, అలానడుచుకోలేక సతమతమౌతుంటుంది.
   అభివాదములతో
   మూర్తి

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: