డేలియా … శామ్యూల్ డేనియల్, ఇంగ్లీషు కవి నీ బంగరు కేశాలపై హేమంతం మంచుకురిసినపుడు, గడ్డకట్టిన కాలం దగ్గరలోని పూలన్నీ తునిమినపుడు ఎప్పటికీ తొలగని చీకటిలా నీ రోజులు కనిపించినపుడు, ఇన్నాళ్ళ నీ బలమైన నమ్మకాలూ వఠ్ఠి తప్పులేనని తేలినపుడు; అప్పుడు, నేను రంగు రంగుల కుంచెలతో చిత్రించబోయే ఈ చిత్రాన్ని చూడు, అదేమంత పనికిరానిది కాదు. ప్రకృతీ పరమేశ్వరుడూ నీకిక్కడ ప్రసాదించిన అనుగ్రహాన్ని గుర్తించు; నిన్ను నువ్వు పరిశీలించుకుని నేను నీకై ఎంతకృషిచేశానో తెలుసుకో; బహుశా, ఇదే నీకు శాశ్వతమైన స్మృతి చిహ్నం కావొచ్చు, అదృష్టం బాగుంటే భావితరాలు దీన్ని ఆదరించవచ్చు. నీ నిష్క్రమణతో పాటు ఈ రంగులు వెలిసిపోయేవి కావు నువ్వూ, నేనూ మరణించినా ఇవి మిగిలే ఉంటాయి; ఇవి మిగిలితే, ఈ చిత్రం వల్ల నువ్వూ జీవించే ఉంటావు; అవి ఉంటాయి, కనుక నీకు మరణం లేదు. . (1592) శామ్యూల్ డేనియల్, 16 వ శతాబ్ది ఇంగ్లీషు కవి . (From) Delia 34 When winter snows upon thy golden hairs, And frost of age hath nipped thy flowers near; When dark shall seem thy day that never clears, And all lies with’red that was held so dear; Then take this picture which I here present thee, Limned with a pencil1not all unworthy. Here see the gifts that God and nature lent thee; Here read thy self and what I suff’red for thee. This may remain thy lasting monument, Which happily2 Posterity may cherish. These colors with thy fading are not spent; These may remain when thou and I shall perish. If they remain, then thou shalt live thereby; They will remain, and so thou canst not die. . (1592) Samuel Daniel English Poet 16th Century (Note: 1. Limned with a Pencil: Painted With a Brush 2. Happily: Perhaps) Poem Courtesy: http://www.wwnorton.com/college/english/nael/noa/pdf/27636_16u37Daniel.1_2.tp.pdf Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండిఫిబ్రవరి 15, 2015