అనువాదలహరి

పదో ఏడు వచ్చినపుడు … బిల్లీ కాలిన్స్, అమెరికను కవి

(చిన్నపిల్లల కోణం నుండి బాల్యాన్ని విడిచిపెడుతున్నప్పుడు కలిగే మనోవ్యథ బాగా చెప్పిన కవిత. )

ఆ ఆలోచన వచ్చేసరికే అనిపించింది
నాకు  ఏదో జరగబోతోందని…
గుడ్డిదీపం క్రింద చదువుతున్నప్పుడు వచ్చే తలనొప్పికంటే,
ఏ కడుపునొప్పికన్నా కూడా తీవ్రమైనది…
ఉత్సాహానికి  అమ్మవారు వచ్చినట్టు,
మనసుకి  రోగం వచ్చినట్టు
ఆత్మని కురూపిని చేసే అంటురోగం వచ్చినట్టు…  ఏదో జరగబోతోందని.

సింహావలోకనం చేసుకుందికి మూడు ఆదివారాలైనా కాలేదనొచ్చు,
కానీ ఒక విషయం మీరు మరిచిపోతున్నారు:
ఇద్దరిచేత పరిచయం చెయ్యబడడంలోని సంక్లిష్టతనీ
ఒక్కరిగా ఉండగలగడంలోని అచ్చమైన నిరాడంబరతనీ.
నేను పక్కమీద పడుక్కుని ప్రతి గంటనీ గుర్తుపెట్టుకోగలను.
నాలుగ్గంటలకి నేను అరేబియన్ మాంత్రికుడనయిపోతాను.
నన్ను నాకే కనిపించకుండా  చేసుకోగలను
ఒక గ్లాసుడు పాలని ఒక రకంగా తాగుతూ…
ఏడోగంటకి నేను సైనికుడినయిపోతా; తొమ్మిదికి యువరాజునే.

ఇప్పుడు చాలా భాగం నాకు కిటికీ దగ్గర
పొద్దు తిరుగుతున్న ఎండని అలా చూస్తూ గడిచిపోతుంది.
మునుపెన్నడూ ఇంత విషాదంగా
చెట్లమధ్యనున్న ఇంటిమీద ఇలా ఎండ పడలేదు,
నా సైకిలు ఇవాళ గేరేజీ గోడకి ఆనుకున్నట్టు
ముందెన్నడూ చేరబెట్టి లేదు.
దానికున్న ముదురు నీలపురంగు అంతా వెలిసిపోయింది.

ఇది విషాదానికి ప్రారంభం, అని నాకు నేను చెప్పుకుంటుంటాను,
నా లోకంలో నేను కాన్వాసుజోళ్ళతో నడుచుకుంటూ పోతూ.
నా ఊహల్లోని మిత్రులకి వీడ్కోలు పలికే సమయం వచ్చింది
మొదటి సారి పెద్దంకె గల వయసు రాబోతోంది.

ఇంకా నిన్న మొన్నటిలాగే ఉంది నా శరీరం క్రింద
వెలుగు తప్ప మరేదీ లేదనీ…
నన్ను కోస్తే మెరుస్తాననీ … భ్రమించి.
కానీ ఇప్పుడు జీవితపు కాలిబాట మీద పడితే
నా శరీరం చెక్కుకుంటుంది… రక్తం కారుతుంది.
.
బిల్లీ కాలిన్స్

(March 22, 1941)

అమెరికను కవి

Billy Collins

.

On Turning Ten

.

The whole idea of it makes me feel

like I’m coming down with something,

something worse than any stomach ache

or the headaches I get from reading in bad light–

a kind of measles of the spirit,

a mumps of the psyche,

a disfiguring chicken pox of the soul.

You tell me it is too early to be looking back,

but that is because you have forgotten

the perfect simplicity of being one

and the beautiful complexity introduced by two.

But I can lie on my bed and remember every digit.

At four I was an Arabian wizard.

I could make myself invisible

by drinking a glass of milk a certain way.

At seven I was a soldier, at nine a prince.

But now I am mostly at the window

watching the late afternoon light.

Back then it never fell so solemnly

against the side of my tree house,

and my bicycle never leaned against the garage

as it does today,

all the dark blue speed drained out of it.

This is the beginning of sadness, I say to myself,

as I walk through the universe in my sneakers.

It is time to say good-bye to my imaginary friends,

time to turn the first big number.

It seems only yesterday I used to believe

there was nothing under my skin but light.

If you cut me I could shine.

But now when I fall upon the sidewalks of life,

I skin my knees. I bleed.

.

Billy Collins

born March 22, 1941

American poet

Poem courtesy:

http://wonderingminstrels.blogspot.in/2002/10/on-turning-ten-billy-collins.html

%d bloggers like this: