IV… లావో జూ: తావో తె చింగ్ నుండి
తోవ నిండైనది; వాడుకవల్ల అరిగిపోదు.
సంఖ్యాకమైన ఈ జీవరాశుల మాత్రిక గంభీరమైనది.
పదునైన దాని పదును మొక్కబోనీ,
చిక్కుముడులు విప్పు.
కాంతి తీక్ష్ణత తగ్గించు.
పాత దారులనే అనుసరించు.
నీడలతో నిండి అది అసలున్నట్టే తెలియదు.
ఈ దారి ఎవరు వేసారో నాకు తెలియదు.
ఇది చూడబోతే అనాదిగా ఉన్నట్టే ఉంది.
.
లావో జూ:
తావో తె చింగ్ నుండి
(అతి ప్రాచీన చినీ గ్రంధం)
.
IV
The Way is full: use won’t empty it.
Deep is the matrix of the myriad creatures.
Blunt the sharp:
Loosen the knots:
Dim the glare:
Follow old tracks.
Shadowy, it seems hardly there.
I don’t know whose child it is.
It seems like the ancestral form.
.
Lao Tzu
Tao Te Ching
(The Book of the Way and Virtue)
Translated by AS Kline
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
ఇలాంటివే