అనువాదలహరి

స్వర్గంలో… స్టీఫెన్ క్రేన్, అమెరికను

స్వర్గంలో

కొన్ని గడ్డిపరకలు

దేముడిముందు నిల్చున్నాయి.

“మీరేం చేశారు?”

ఒక్కటి తప్ప మిగిలినవన్నీ

చాలా ఉత్సాహంగా చెప్ప సాగేయి

అవి జీవితంలో చేసిన గొప్ప పనులు.

ఆ ఒక్క గడ్డి పరక మాత్రం

సిగ్గుపడుతూ

కొంచెం వెనక్కి నిలబడింది.

ఇప్పుడు దేముడు అడిగాడు,

“మరి నువ్వేం చేశావు?”

ఆ గడ్డిపరక ఇలా అంది,”ఓ ప్రభూ!

నాకు జ్ఞాపకశక్తి చాలా తక్కువ.

ఒక వేళ నేను గొప్ప పనులు చేసుంటే

అవేవీ నాకు గుర్తు లేవు.”

అప్పుడు భగవంతుడు,

తన  సింహాసనము మీంచి వైభవంగా లేచాడు.

“అన్నిటిలోకీ ఉత్తమమైన గడ్డిపరకవి!” అని అన్నాడు.

స్టీఫెన్ క్రేన్

November 1, 1871 – June 5, 1900

అమెరికను

 

Stephen Crane

Stephen Crane

In Heaven

 .

In heaven,

Some little blades of grass

Stood before God.

“What did you do?”

Then all save one of the little blades

Began eagerly to relate

The merits of their lives.

This one stayed a small way behind,

Ashamed.

Presently, God said,

“And what did you do?”
The little blade answered, “Oh my Lord,

Memory is bitter to me,

For, if I did good deeds,

I know not of them.”

Then God, in all His splendor,

Arose from His throne.

“Oh, best little blade of grass!” He said.

.

Stephen Crane

November 1, 1871 – June 5, 1900

American

 Poem Courtesy: http://famouspoetsandpoems.com/poets/stephen_crane/poems/13271

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: