అనువాదలహరి

A Night’s Tale on Day’s Sheet… Srinivas Vasudev, Telugu, Indian

This day, after all,
Isn’t sterile.
She bears an empty shadow with it always…
Neither the night is all alone
She tugs some untold tales with her
Skiing either over the eyelids
Or the shoulders of a myriad dreamers.
You need the day
Whenever you hang the welts of the night, by heart.
Night is the soothing balm of butter
For the fissures of the day!

***
Somebody has put on several suns on night’s face
This morning, somebody is struggling to muffle his face.

***
Time is not desolate;
Seems mischievous so long as you fail to grasp.
The night
Which strewed scissored dioramas all through
Seems to essay driving the day out.
Only the lake which blooms on its own
Knows how silently the night retires
Whenever it is pricked by the thorns of day

***

All through the night…
A pro plaints of nail pinches;
A street dog flounders about
To find room in the clock tower’s niche;
A perplexed old soul fails to fathom
The connection between old age and loneliness;
A forlorn lass fancies to catch the meteors in her palm;
Befuddled about its destiny, a letter languishes in the post box;

The night…prolongs with its end-less stories.

***

No night says quits
To its endeavor to scribble its tale on day’s page.
All her words are chiseled in bald phonemes
And her tales are records of exploitation of naked bodies.

The night has grown old. It can no longer write or sing.
Let us leave the night to the darkness…
.
Srinivas Vasudev

Telugu,

Indian

Image Courtesy: Srinivas Vasudev
Image Courtesy: Srinivas Vasudev

ఓ రాత్రి కథ-పగటి పేజీపై

 

ఈ పగలు,

ఒఠ్ఠిమనిషి కాదు

తనతో ఓఖాళీ నీడనీ మోసుకుంటూనే ఉంటూంది

ఈ రాత్రీ ఒంటరికంలో లేదు

తనతో కొన్ని కథల్నీ పట్టుకుపోతుంది

కోట్ల స్వాప్నికుల కళ్ళపైనుంచో, భుజాలపైనుంచో

జారుకుంటూ పోతుంటూంది

రాత్రి గాయాన్ని గుండెకి వేలాడదీసినప్పుడల్లా

ఈ పగలవసరమె!

గుండె పగులుకి నవనీతం కూడా ఈ రాత్రే!!

***

ఈ రాత్రెవరో సూర్యుడి లైట్లేసారు ముఖంనిండా

ఈ పగలెవరో తమ ముఖాన్ని కప్పుకునే అవస్థలో ఉన్నట్టున్నారు

***

కాలం ఒంటరికాదు, తన తుంటరితనం అర్ధంకానంతవరకే

కత్తిరించుకున్న చిన్న చిన్నదృశ్యాలన్నీ రాత్రంతా వెచ్చల్లుకున్న

రేయి

పగలుని పారదోలే ప్రయత్నేమేదో చేస్తున్నట్లే ఉంది

ఆ రాత్రికి పగల ముళ్ళు గుచ్చుకున్నప్పుడల్లా

తనెంత సున్నితంగా పక్కకుతప్పుకుంటుందో

తననితాను విప్పార్చుకునే కొలనుకే తెల్సు

***

 

రాత్రింతల…….

నఖక్షతాల ఫిర్యాదులతో వేశ్య

గంటస్తంభం గూట్లోనూ గూడు దొరకక ఓ వీధి కుక్కా

వయసుకీ ఒంటరితనానికీ ఈ విడదీయరాని సంబంధమేంటొ

అర్ధంకాక ఓ ముసలి ప్రాణం

తోకచుక్కల్ని దోసిట్లో బంధించాలనుకునే అనాథబాలిక

గమ్యం గురించి అగమ్యగోచరంగా దిక్కుతోచక పోస్ట్‌‌బాక్స్ లో ఓ ఉత్తరం!

కంచికిచేరని కథలన్నింటితో

మాపు!

***

 

 

ప్రతిరాత్రీ

పగటిపేజీపై తన కథని రాసే ప్రయత్నం మానదు

తనపదాలన్ని నగ్నాక్షరాలతో చెక్కబడ్డవే

తనకథలన్నీ నగ్నదేహాల దోపిడీనుంచి రాయబడ్డవే

ముసలిదైపోయిన ఈ రాత్రి ఇక రాయదు, పాడదు

ఈ రాత్రినైనా రాత్రికొదిలేద్దాం

.

%d bloggers like this: